Indhu Telugu News

Indhu Telugu News All About Latest News From All Over The Telugu Like, Film News, Gallery & Behind the Screen Stories.

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ముద్దుగుమ్మలు...
14/12/2024

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు కనిపించకుండా మాయమయ్యారు. అప్పటిలో తమ అందం, ఆకట్టుకునే అభినయంతో కవ్వించిన హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీస్‌తో సెటిల్ అయ్యారు. మరికొంతమంది విదేశాలకు వెళ్లిపోయారు. కాగా పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్, ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఆమె.. ఆమె కోసమే కుర్రాళ్ళు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. ఆమె ఫోటోలను సినిమా పోస్టర్స్ ను భద్రంగా ఇంట్లో గోడలకు అతికించుకునే వారు. అంత ఫెమస్ హీరోయిన్ ఆమె.. కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె ఎవరో తెలుసా.?

అప్పట్లో హీరోయిన్స్ సినిమాలకు చాలా కీలకంగా ఉండేవారు. ఇప్పుడు హీరోయిన్స్ కేవలం పాటలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో మమతా కులకర్ణి ఒకరు. బెంగాలీ, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించి మెప్పించింది ఆ అందాల తార. ముఖ్యంగా బాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. మిథున్ చక్రవర్తి తో మొదలు పెట్టి అజయ్ దేవగణ్, బాబీ డియోల్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సల్మాన్ ఖాన్, గోవిందా, అనిల్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, అమీర్ ఖాన్ వరకు ఎంతో మంది హీరోలతో నటించారు మమతా.

ఇక తెలుగులోనూ ఆమె నటించి మెప్పించారు. మోహన్ బాబు నటించిన దొంగా పోలీస్, ప్రేమశిఖరం, బ్రహ్మ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది మమతా కులకర్ణి. ఇక ఇప్పుడు మమతా సినిమాలకు దూరం గా ఉంటుంది. చాలా కాలం అజ్ఞాతంలో ఉన్న మమతా కులకర్ణి దాదాపు 25 ఏళ్ల తర్వాత ముంబైకి తిరిగి వచ్చింది. గతంలో డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో ఇరుక్కుంది. ఆ తర్వాత ఆమె పై ముంబై కోర్టు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసును కొట్టివేసింది. ఇక తాజాగా ముంబైలో అడుగుపెట్టిన మమతా ఎమోషనల్ అయ్యింది. “నా చేతిలో 40 సినిమాలు, మూడు ఫ్లాట్స్‌, నాలుగు కార్లు, 50 ఈవెంట్స్‌ ఉన్న సమయంలో అన్నింటినీ వదిలేశాను. ఇప్పుడు రీ ఎంట్రీ కోసం రాలేదు ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా వచ్చాను” అని తెలిపింది మమతా కులకర్ణి.

20/11/2024

Sri Ram Automall second hand all Types of Vehicles in Auction Cheap & Best price

20/11/2024

Bank Seized Vehicles - Shriram Finance

19/11/2024

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when Indhu Telugu News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share