ADN News

ADN News HD Digital Network :: ADN News

ఈమె పేరు రచన గుజ్జర్.. మధ్యప్రదేశ్ లో యూ ట్యూబర్. తన లైఫ్ స్టైల్స్ పై వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంది. ఇటీవల తనకున్న బంగా...
08/06/2026

ఈమె పేరు రచన గుజ్జర్.. మధ్యప్రదేశ్ లో యూ ట్యూబర్. తన లైఫ్ స్టైల్స్ పై వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంది. ఇటీవల తనకున్న బంగారు నగలపై ఒక వీడియో చేసింది. యూ ట్యూబ్ లో పోస్ట్ చేసింది. రెండు రోజులకు ఇంట్లో దొంగ ప్రవేశించి నగలతో పాటు, రెండు లక్షల రూపాయలు నగదు కూడా తీసుకెళ్ళాడు..

అత్త, అల్లుడు పెళ్ళిచేసుకున్నారు.. ఇద్దరూ గత జన్మలో ప్రేమికులట.. ఈ జన్మలో తెలిసి పెళ్లి చేసుకుని ఒకటి అయ్యామని చెప్పారు....
08/06/2026

అత్త, అల్లుడు పెళ్ళిచేసుకున్నారు.. ఇద్దరూ గత జన్మలో ప్రేమికులట.. ఈ జన్మలో తెలిసి పెళ్లి చేసుకుని ఒకటి అయ్యామని చెప్పారు. తన కూతురు ఒప్పుకుంటే, తానూ, కూతురు ఇద్దరూ అల్లుడితో కాపురం చేస్తామని అత్త చెప్పింది. కొసమెరుపుగా తమ పెళ్లి వీడియో తీసి, తమను ఆశీర్వదించమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..

మద్యం లారీ ప్రమాదం అంటే ఇక చెప్పాలా.? 10 నిమిషాల్లో ట్రక్కులో మద్యం. మొత్తం మాయం చేసేసారు. అదీ మనోళ్ల నీతి, నిజాయితీ.. చ...
06/06/2026

మద్యం లారీ ప్రమాదం అంటే ఇక చెప్పాలా.? 10 నిమిషాల్లో ట్రక్కులో మద్యం. మొత్తం మాయం చేసేసారు. అదీ మనోళ్ల నీతి, నిజాయితీ.. చిత్తూరు జిల్లా బసిరెడ్డి పల్లి దగ్గర జరిగిన ప్రమాదంలో ఇలా నీచమైన పనికి ఒడిగట్టారు. ఈ చోరీలో కారుల్లో పోయేవాళ్ళు కూడా కార్లు ఆపి, మద్యం కేసులు తీసుకెళ్లారు.. చీ చీ..

05/06/2026

తిరుపతి, నాయుడుపేట హైవేపై భారీ వర్షం, సాయంత్రం ఐదు గంటలకు రోడ్డు కనిపించత చిమ్మ చీకట్లు..

05/06/2026

వీడెవడయ్యా బాబు, గాంధీ వేషంలో యాచన కోసం వచ్చి స్టేజి షోలో పాటలకు కింద డ్యాన్స్ వేసుకుంటున్నాడు..

తన చోరీకి అతడు రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాడు. అవంటే మోజు, అందులో అమ్ముకుంటే రేటెక్కువ .. శంషాబాద్ ఎయ...
04/06/2026

తన చోరీకి అతడు రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాడు. అవంటే మోజు, అందులో అమ్ముకుంటే రేటెక్కువ .. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో బైకులు చోరీ చేసే విశ్వకర్మ మోహన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. రాయచూర్, కర్నూల్ , ఆదోనీలలో కూడా యితడు బైక్ చోరీలు చేసాడు. ప్రస్తుతానికి అతనివద్దనుంచి మూడు బులెట్ బైకులు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు.

కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు స్వామి వారి దర్శనానికి చేరుకున్న హీరోయిన్ జాన్వీ కపూర్..
04/06/2026

కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు స్వామి వారి దర్శనానికి చేరుకున్న హీరోయిన్ జాన్వీ కపూర్..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గుమాస్తాలు, లైన్ మెన్లు, ఇంజనీర్లు , ఏస్థాయిలో వాళ్ళైనా సరే కనీసం పాతిక వేల నుంచి లక్షలవరకు లం...
03/06/2026

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గుమాస్తాలు, లైన్ మెన్లు, ఇంజనీర్లు , ఏస్థాయిలో వాళ్ళైనా సరే కనీసం పాతిక వేల నుంచి లక్షలవరకు లంచాలకు రేటు పెట్టేసారు. ఇటీవల తెలంగాణాలో ఒక ఎమ్మార్వో 40 లక్షలు లంచం అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనోళ్లు మరీ కాస్ట్ లీ లంచగొండులు అయిపోయారు. అయితే కర్ణాటకలో బెంగుళూరు సిటీ సెషన్స్ పిపి సవిత ఐదువేల రూపాయలు లంచం తీసుకుంటూ చిక్కిపోయి జైలుకెళ్లింది. ఈ లెక్కన మన రాష్ట్రాల్లో లంచగొండులకు ఎలాంటి శిక్షలు వెయ్యాలో..?

03/06/2026

నిప్పులు చెరిగే 47 డిగ్రీల ఎండలో జాతీయ రహదారి ఖాళీగా ఉంది. వాహనాల డ్రైవర్లు రోడ్డుపక్క చెట్లు కింద వాహనాలు ఆపేసి విశ్రాంతి తీసుకుంటున్నారు.

తనపై సిఐ చిన్న మల్లయ్య బలవంతంగా బలత్కారం చేసాడని ధనలక్ష్మి అనే మహిళ ఫిర్యాదుతో పరారీలో ఉన్న సిఐని డిస్మిస్ చేసారని తెలుస...
03/06/2026

తనపై సిఐ చిన్న మల్లయ్య బలవంతంగా బలత్కారం చేసాడని ధనలక్ష్మి అనే మహిళ ఫిర్యాదుతో పరారీలో ఉన్న సిఐని డిస్మిస్ చేసారని తెలుస్తోంది. ఆ మహిళ ఏప్రిల్ 29 న పోలీసులకు సిఐపై ఫిర్యాదు చేసింది..మహిళ ఫిర్యాదుతో సిఐ చిన్నమల్లయ్యపై అత్యాచారం కేసు నమోదు చేసారు. కేసు నమోదైన తర్వాత చిన్న మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లి హైకోర్టు, సుప్రీంకోర్టు ల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తన న్యాయవాది ద్వారా కోరగా. రెండు కోర్టు లు మల్లయ్య బెయిల్ పిటిషన్ లు డిస్మిస్ చేసాయి.
ఈ నేపథ్యంలో సిఐ చిన్న మల్లయ్య సుమారు నెల రోజులపైగా విధులకు హాజరు కాకపోవడంతో ఉన్నతాధికారులు అతన్ని శాశ్వతంగా ఉద్యోగం నుండి తోలగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేస్తూ పల్నాడు జిల్లా ఎస్పి కార్యాలయానికి డిస్మిస్ అర్డర్ పంపినట్లు సమాచారం .

Address

Nellore
523004

Telephone

+919440207109

Alerts

Be the first to know and let us send you an email when ADN News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share