
10/09/2022
ఓటరు కార్డుకు ఆధార్ ని అనుసంధానం చేయాలి.
భీమ్‌గల్ టౌన్, సెప్టెంబర్ 10. SSD news
ఆధార్ కార్డు నెంబర్ ని ఓటరు కార్డుకు అనుసంధానం చేయాలని మున్సిపల్ కౌన్సిలర్ సతీష్ గౌడ్ అన్నారు. శనివారం భీమ్‌గల్ పట్టణంలోని 8వ వార్డ్ లో గోడ ప్రతులను ఆవిష్కరించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఓటర్ కార్డు ని ఆధార్ తో లింకప్ చేయాలన్నారు. అందుకొరకు మెప్మా అధికారులు ఇంటింటికి వెల్లి ప్రక్రియ ను వారం లోపు పూర్తి చేయాలన్నారు. బూత్ లెవల్ అధికారులు, మెప్మా సిబ్బంది సమన్యయం తో పనిచేయాలని సూచించారు. ఫారం 6ఏ లో 18 ఏండ్లు నిండిన కొత్త వారిని ఓటరు నమోదులో చేర్చాలని అన్నారు. ఓటరు కార్డులో మార్పులు, చేర్పులకు ఫారం 8, ఆధార్ అనుసంధానం చేయడానికి ఫారం 6బి ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమం లో మోప్మా సిబ్బంది వసంత, రాధ, లక్మీ, రోమా, ఫౌజియా తదితరులు పాల్గొన్నారు.