03/09/2025
*గురువారం.. మన పూండి గోవిందపురం గ్రామం పల్లివీధిలో _మహా అన్నదాన_ కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే*
పూండి - గోవిందపురం పల్లివీధి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలలో భాగంగా గురువారం (04.09.2025) *మహా అన్నదాన* కార్యక్రమం మధ్యాహ్నం 12.00 నుండి జరుగును. కావున ఈ అన్నదాన కార్యక్రమంలో గోవిందపురం గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల భక్త మహాశయలు పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించి, ఆ గణనాధుని ఆశీస్సులు స్వీకరిస్తారని కోరుకుంటున్నాం.
🔴 వినాయక నిమజ్జన శోభాయాత్ర తేది 05.09.2025 అనగా శుక్రవారం సాయంత్రం 2.30 నుండి డి.జె సౌండ్ టపాసులతో, యువతీ యువకుల డాన్సులతో మరియు ప్రత్యేక సినీ కోయ డాన్సులతో ఘనంగా *నిమజ్జన శోభాయాత్ర* జరుగును కావున యావన్మంది ప్రజలు ఈ శోభాయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం.
ఇట్లు
*గణేష్ ఉత్సవ కమిటీ*
_పల్లివీధి - పూండి_