మీ రాజమహేంద్రవరం - Yours Rajahmundry

మీ రాజమహేంద్రవరం - Yours Rajahmundry Rajahmundry or Rajamahendri , Rajamahendravaram is a cultural city and GUDA godavari urban development authority of the Andhra Pradesh .

రాజమండ్రి అసలైన ఫేమస్ ఫుడ్ ❤️❤️❤️
26/12/2024

రాజమండ్రి అసలైన ఫేమస్ ఫుడ్ ❤️❤️❤️

అందరకి నాగుల చవితి శుభాకాంక్షలు    😍            👌👌               ❤️  😍
05/11/2024

అందరకి నాగుల చవితి శుభాకాంక్షలు

😍 👌👌
❤️ 😍

దీపావళి దగ్గరపడుతొండి! మీరు దీపావళి క్రాకర్లు కొన్నారా? ఈ సారి ధరలు ఎలా ఉన్నాయి?    😍  😍❤️
28/10/2024

దీపావళి దగ్గరపడుతొండి! మీరు దీపావళి క్రాకర్లు కొన్నారా? ఈ సారి ధరలు ఎలా ఉన్నాయి?

😍 😍❤️

08/09/2024

హెచ్చరిక - పులి సంచారం తూర్పుగోదావరి జిల్లా,రాజానగరం జిల్లా అటవీశాఖ అధికారి భరణి మీడియా సమావేశం ముఖ్య విషయాలు .సాయంత్రం ఆరు దాటాక ఒంటరిగా బయటకు రావద్దు..ప్రతి ఒక్కరు టార్చ్ లైట్ తోనే బయటకు రండి.. ఆరు బయట ప్రదేశాల్లో కూర్చోవద్దు.స్వరూప్ నగర్, పద్మావతి నగర్, రూప నగర్, శ్రీ రామ్ నగర్, తారకరామానగర్, ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.తప్పకుండా ఈ ప్రదేశాల్లో చిరుత పులి ఉందని ధ్రువీకరించిన అధికారులు.చిరుత పులి బిహేవియర్ ను బట్టి ఎన్ని రోజుల్లో పట్టుకోగలం అనేది ఇప్పుడే నిర్ధారించలేము.చిన్నపిల్లలను ట్యూషన్లకు చీకటి పడిన తర్వాత పంపవద్దు.ఇప్పటివరకు మనుషులపై ఎటువంటి దాడులు జరగలేదు.చిరుతపై సమాచారం ఉంటే వెంటనే తెలియజేయమని టోల్ ఫ్రీ నెంబర్ తెలిపిన అధికారులు..
టోల్ ఫ్రీ నెంబర్: 18004295909

భారీ వర్ష హెచ్చరిక : ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
31/08/2024

భారీ వర్ష హెచ్చరిక : ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. అందువల్ల, ప్రజల సౌకర్యార్థం రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కంట్రోల్ రూమ్‌లో భారీ వర్షములుకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులకైనా 9494060060 నెంబర్‌కు సమాచారం ఇవ్వవచ్చు. ఈ 5 రోజులు కంట్రోల్ రూమ్ 24/7 అందుబాటులో ఉంటుంది.

Collector EastGodavari Municipal Department Govt of Andhra pradesh Andhra Pradesh CM

నేత్రదానం - అమరత్వం పొందిన మహాదానంఒక చిన్నారి యొక్క మహోన్నత నిర్ణయం రెండు కొత్త జీవితాలకు వెలుగు నింపింది. రాజమహేంద్రవరం...
29/07/2024

నేత్రదానం - అమరత్వం పొందిన మహాదానం
ఒక చిన్నారి యొక్క మహోన్నత నిర్ణయం రెండు కొత్త జీవితాలకు వెలుగు నింపింది. రాజమహేంద్రవరం మండలం ఉడుముడి/కోటిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల కె.వి.వి. సాయి గణేష్, రామచంద్రపురం ST అన్నస్ గ్లోరియా ఎం స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి సత్యనారాయణ కార్ డ్రైవర్.

గత కొన్ని నెలలుగా సాయి గణేష్‌కు తీవ్రమైన మెదడు రక్తస్రావం సంభవించింది. రాజమహేంద్రవరం బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే తన మేనమామ సోమేశ్వరరావు ఇంటి వద్ద చికిత్స పొందుతున్నాడు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, చిన్న వయసులోనే అతను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తన చిన్న కొడుకును కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ, సాయి గణేష్‌ తల్లిదండ్రులు అతని అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు.

నిన్న, జూలై 28న సాయి గణేష్ తుది శ్వాస విడిచాడు. అతని రెండు నేత్రాలను రామయ్య ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్, నిడదవోలు c/o ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌కు దానం చేశారు. తమ ప్రియమైన కొడుకు ద్వారా ఇద్దరు అంధులకు కంటి వెలుగును ఇవ్వగలిగినందుకు సాయి గణేష్‌ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు.

సాయి గణేష్‌ ఒక చిన్న వయసులోనే మనకు గొప్ప పాఠం నేర్పాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం."

గోదావరికి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద ప్రస్తుత  ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 11.36 లక్షల క్యూసెక్కులుకొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరి...
22/07/2024

గోదావరికి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 11.36 లక్షల క్యూసెక్కులు
కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
రాత్రికి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం

లోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

ముఖ్య గమనిక.గోదావరి నదికి వరద పోటెత్తడం వల్ల పంపుల్లో, తేలియాడే వ్యర్థాలు మూసుకుపోవడంతో ముడి నీటిని తోడేందుకు ఇబ్బందులు ...
20/07/2024

ముఖ్య గమనిక.
గోదావరి నదికి వరద పోటెత్తడం వల్ల పంపుల్లో, తేలియాడే వ్యర్థాలు మూసుకుపోవడంతో ముడి నీటిని తోడేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అందువల్ల రానున్న రెండు రోజులు ఉదయం పూట మాత్రమే నీటి సరఫరా ఉంటుంది.

పోస్ట్ : రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్

భారీ వర్ష హెచ్చరిక! ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ శాఖ కోస్తా ఆంధ్రా ప్రాంతములకు రాన్నున్న 3 రోజులు భారీ వర్ష సూచన చేసియున్నది కా...
13/07/2024

భారీ వర్ష హెచ్చరిక!
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ శాఖ కోస్తా ఆంధ్రా ప్రాంతములకు రాన్నున్న 3 రోజులు భారీ వర్ష సూచన చేసియున్నది కానుక ప్రజల సౌకర్యార్థం రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కంట్రోల్ రూమ్ నందు భారీ వర్షములుకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులుఐనా ఈ యొక్క కంట్రోల్ రూమ్ నందు గల 94940 60060 ఫోన్ నెంకు తెలియజేయగలరు ఈ 3 రోజులు కంట్రోల్ రూమ్ 24/7 అందుబాటులో ఉందును. #24/7
Collector EastGodavari Municipal Department Govt of Andhra pradesh Andhra Pradesh CM

Address

Rajahmundry
533101

Website

Alerts

Be the first to know and let us send you an email when మీ రాజమహేంద్రవరం - Yours Rajahmundry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share