Dynamic Leader Chinna Srinu Anna

Dynamic Leader Chinna Srinu Anna 𝐌𝐚𝐧𝐚 𝐊𝐨𝐬𝐚𝐦 𝐌𝐚𝐧𝐚 𝐂𝐡𝐢𝐧𝐧𝐚 𝐒𝐫𝐢𝐧𝐮 𝐀𝐧𝐧𝐚

16/07/2025

Jagan Sir Knolewdge On Irrigation Project..

16/07/2025
16/07/2025

హిందీ నేర్చుకోవటం తప్పు కాదు ...పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించటం చాల ముఖ్యం

విద్య వ్యవస్థను ఇంగ్లీష్ మీడియంగా మార్చేస్తే ...అది కొత్త మార్పుకి నాందిపలుకుతుంది @జగనన్న

16.07.2025తాడేపల్లిమాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను నివాసంలో కలిసిన ఉమ్మడి జిల్లాల జెడ్పీ ఛైర...
16/07/2025

16.07.2025
తాడేపల్లి

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను నివాసంలో కలిసిన ఉమ్మడి జిల్లాల జెడ్పీ ఛైర్మన్‌లు

మజ్జి శ్రీనివాసరావు (విజయనగరం), పిరియా విజయ (శ్రీకాకుళం),జల్లిపల్లి సుభద్ర (ఏఎస్‌ఆర్‌ జిల్లా), విప్పర్తి వేణుగోపాలరావు(తూర్పుగోదావరి), బూచేపల్లి వెంకాయమ్మ (ప్రకాశం),ఆనం అరుణమ్మ (ఎస్సీఎస్‌ నెల్లూరు),ముత్యాల రామగోవిందు రెడ్డి (వైఎస్సార్‌), యర్రబోతుల పాపిరెడ్డి (కర్నూలు), బోయ గిరిజమ్మ (అనంతపురం), గోవిందప్ప శ్రీనివాసులు (చిత్తూరు).

కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్మన్‌ హారికపై టీడీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండించి ఆమెకు సంఘీబావం తెలిపిన జెడ్పీ ఛైర్మన్‌లు, హారికకు అండగా నిలిచినందుకు వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఛైర్మన్‌లు

స్ధానిక సంస్ధలను బలోపేతం చేయాలని, అలాగే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని కూడా బూత్‌ లెవల్‌నుంచి బలోపేతం చేసేందుకు తగిన కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించిన వైయస్‌ జగన్‌

బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ - రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో కార్యక్రమం జరుగుతున్న తీరుపై వివరాలు తెలుసుకుని, మరింత ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించిన వైయస్‌ జగన్.

Majji Srinivasarao

పెడన మండలం, కూడూరు గ్రామం.16 జులై 2025.ఎక్కడ మహిళ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనే సామెత ఈ ఆంధ్రప్రదేశ్ రాష...
16/07/2025

పెడన మండలం, కూడూరు గ్రామం.
16 జులై 2025.

ఎక్కడ మహిళ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనే సామెత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు అనే విధంగా ఈ కూటమి పాలన లో జరిగిన ఈ సంఘటన నిరూపిస్తుంది అని తెలియపరిచిన సంఘటన ఇది.

అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం నడవడం లేదు, కూటమి ప్రభుత్వం రాసిన రెడ్బుక్ రాజ్యాంగ నడుస్తుంది.

ఇటీవల టిడిపి గుండాల దాడికి గురైన కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారిని పరామర్శించిన విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి గుండాల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయని , ఒక బీసీ మహిళపై దాడులకు దిగిన టిడిపి గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు , బీసీలంతా ఏకమై రానున్న ఎన్నికల్లో టిడిపికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న శ్రీను గారు తన తోటి జిల్లా పరిషత్ అధ్యక్షులతో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

శ్రీమతి ఉప్పాల హారిక గారిని పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీ చైర్మన్లు మరియు చైర్ పర్సన్లు.

పెడన మండలం కూడూరు గ్రామంలో కృష్ణాజిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక గారి మీద ఇటీవల జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకుని ఖండిస్తూ చైర్ పర్సన్ ను పరామర్శించి మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీ చైర్మన్లు.

ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాల్ గారు,చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ జి శ్రీనివాసులు గార, అనంతపురం జిల్లా చైర్మన్ బోయ గిరిజమ్మ గారు, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, కడప జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి గారు, కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర పోతుల పాపిరెడ్డి గారు,నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్,ఆనం రమణమ్మ, విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్మన్ జల్లి సుభద్ర శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ గారు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాదరావు గారు తదితరులు పాల్గొన్నారు.
Majji Srinivasarao

గౌరవ రాష్ట్ర శాసనమండలి  ప్రతిపక్ష నేత, మాజీ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యన్నారాయణ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.మం...
09/07/2025

గౌరవ రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యన్నారాయణ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

మంచి నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఓడినా గెలిచినా ప్రజల హృదయాలలో ఆయన స్థానం పదిలం.

ప్రభుత్వాలు మారవచ్చు, ప్రజలు మారవచ్చు అంతెందుకు ప్రజాభిప్రాయాలు కూడా మారవచ్చు కానీ సమాకాలీనా రాజకీయాలలో ఆయన గీసిన గీత,వేసిన బాట మారే అవకాశమే లేదు.

అందుకే ఆనాటి నుంచి నేటి వరకు ఆయనకు ప్రజల హృదయాలలో ఇచ్చే స్థానం ఎల్లప్పుడు పదిలంగానే ఉంటుంది.

మీరు ఎల్లపుడు ఆనందంగా వుంటూ ఇటువంటి మరోసారి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకుంటూ.

మీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి.








చెరిగిపోని నీ చిరునవ్వు.. ఈ ప్రపంచం ఉన్నంత కాలం సజీవంగానే ఉంటుంది రాజన్నా మీ 76 వ జయంతి నాడు మిమ్మల్ని స్మరించుకుంటూ... ...
07/07/2025

చెరిగిపోని నీ చిరునవ్వు.. ఈ ప్రపంచం ఉన్నంత కాలం సజీవంగానే ఉంటుంది రాజన్నా

మీ 76 వ జయంతి నాడు మిమ్మల్ని స్మరించుకుంటూ...

We miss you, Rajanna 😔💔🙏

Here's the special CDP on the occasion of YSR Jayanthi !



👉

ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్యసమావేశంలో చించి ఆరేసిన జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను!విజయనగరం, 04/జూలై/...
04/07/2025

ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్యసమావేశంలో చించి ఆరేసిన జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను!

విజయనగరం, 04/జూలై/2025..

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) స్క్రోలింగ్ పాయింట్స్..

- కూటమి వైఫల్యాలను అధికారులతోనే చెప్పించి , చెడుగుడు ఆడుకున్న చిన్న శ్రీను.

- డీఈఓ గారు మాట్లాడుతూ... జిల్లాలో ఈ సంవత్సరం విద్యా రంగం మెరుగైన స్థాయిలో ఉందంటూ తల్లికి వందనం 13,000 తల్లి అకౌంట్లో వేశారని చెప్పారు.

- వెంటనే జడ్పీ చైర్మన్ గారు మాట్లాడుతూ మిగతా 2,000 ఎవరు ఎకౌంట్లో క్రెడిట్ అయ్యాయి? అవుతున్నాయా ? అయితే ఎంతమంది అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి ? ఇప్పటివరకు ఎందరి ఎకౌంట్లకి డబ్బులు వచ్చాయి..? అని ప్రశ్నలవరం వర్షం కురిపించారు.

- దీంతో జిల్లా మంత్రిగారు డిఇఓ గారికి అయ్యాయని చెప్పండి" అని సైగ చేశారు.

- డీఈఓ గారు అయ్యాయి సార్, అవుతాయి సార్,అవ్వలేదు సార్.. అంటూ తత్తర పడుతూ , బిత్తర చూపులు చూస్తూ,చెమటలు కక్కుతూ పలు విధాలుగా సమాధానాలు ఇచ్చారు.

- అంతటితో ఆగకుండా జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను గారు మాట్లాడుతూ గత సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ జిల్లాలో ఎన్ని అడ్మిషన్లు వచ్చాయి..? ఈ సంవత్సరం ఎన్ని అడ్మిషన్ వచ్చాయి ..? అని ఒక ప్రశ్న సంధించారు.

- గత సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లు 1,04,000 ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లు 96,000, 8000 మంది విద్యార్థులు అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయి అని అధికారులచేతే అసలు నిజాన్ని కక్కించారు.

- తర్వాత మన్యం జిల్లాలో స్టేట్ ఫస్ట్ వచ్చారు టెన్త్ క్లాస్లో అని మంత్రిగారు,డీఈవో గారు గొప్పగా చెప్పుకోగా.

- వెంటనే జెడ్పీ చైర్మన్ గారు కల్పించుకుని చాలా సంతోషం సార్ గత మూడు సంవత్సరాలు స్టేట్ ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది..?"అని అడిగారు.

- గత మూడు సంవత్సరాల నుంచి కూడా మన్యం జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్" అని అధికారులు చేతే గత జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన సంస్కరణల యొక్క ఫలితాన్ని మెప్పించారు.

- దీంతో అక్కడున్న ప్రజాప్రతినిధులు ఇతర అధికారులు అక్కడ ఉన్నది చిన్న శ్రీను ఆయన ల్యాండ్ అయితే వార్ వన్ సైడ్ అక్కడ సోది చెబుదాం అంటే అవ్వదు. సూటిగా సుత్తి లేకుండా చెప్పాల్సిందే నిజాలు కక్కాల్సిందే అని గుసగుసలాడుకున్నారు!!!

🔴 ట్రెండ్ అలెర్ట్ 🔴🔴 ట్రెండ్ అలెర్ట్ 🔴హ్యాష్ ట్యాగ్ :-   Dear YSRCP సోల్జర్స్ ప్రజలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్...
03/06/2025

🔴 ట్రెండ్ అలెర్ట్ 🔴
🔴 ట్రెండ్ అలెర్ట్ 🔴

హ్యాష్ ట్యాగ్ :-




Dear YSRCP సోల్జర్స్

ప్రజలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటిని అమలు చేయకుండా మోసం చేశాడు.

ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలకు మరియు అన్యాయలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమం జరగబోతోంది.

చంద్రబాబు చేస్తున్న మోసాలపై మనమందరం సోషల్ మీడియాలో ట్రెండ్ నిర్వహించి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దాం.




https://drive.google.com/drive/folders/1vF6lAAdABW0vlZNbrfTh73jfZ41ZoWeP

02/04/2025
విజయనగరం, 02ఏప్రిల్ 2025...వెల్లువెత్తిన అభిమానం... ప్రముఖులు, అభిమానుల రాష్ట్ర మరియు ఉత్తరాంధ్ర నలుమూలలు నుంచి వచ్చి జి...
02/04/2025

విజయనగరం, 02ఏప్రిల్ 2025...

వెల్లువెత్తిన అభిమానం... ప్రముఖులు, అభిమానుల రాష్ట్ర మరియు ఉత్తరాంధ్ర నలుమూలలు నుంచి వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భీమిలి అసెంబ్లీ ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి కుమారుని కీర్తి శేషులు ఆదిత్య ప్రణీత్ బాబు పెద్ద కర్మ కార్యక్రమంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

స్వార్థం కోసం కాక, ప్రజా సంక్షేమం కోసం రాజకీయం చేసే నాయకుడే నిజమైన ప్రజానేత.అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారం లేనప్పటికీ ప్రజల మధ్య ఉండి,వారి కష్టసుఖాలను పంచుకుంటూ, వారి సమస్యలకు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే నాయకుడే ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. ఈ మాటకు నిజమైన నిదర్శనంగా నిలిచిన వ్యక్తి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) గారు.

అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేశిన "చిన్న శ్రీను, ఉత్తరాంధ్రలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా, ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల రీజినల్ ఉప కోఆర్డినేటర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.రాజకీయాల్లో ఉన్నప్పటికీ మానవీయతను మరిచిపోకుండా ప్రజల కష్టసుఖాల్లో నిత్యం పాలుపంచుకుంటూ, ప్రజా సేవను తన ధ్యేయంగా మార్చుకున్నారు.

ఇటీవల జరిగిన విషాద ఘటనలో ఆయన తన కుమారుడిని కోల్పోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయనకు ఉన్న ప్రజాభిమానాన్ని మరోసారి రుజువు చేశాయి. ఆయన కుమారుడు ఆదిత్య ప్రణీత్ బాబు కొద్దిరోజుల క్రితం పరమపదించగా, ఈ రోజు దినకర్మ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఒక నేతకు రాజకీయాలకు అతీతంగా ప్రజల మద్దతు ఉండాలంటే,ఆయన నడవడిక,సేవా లక్ష్యం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటుందో తెలియజేసే ఘటన ఇది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాల నుండి వచ్చిన తండోపతండాలుగా తరలివచ్చిన అభిమాన జనసందోహం "చిన్న శ్రీను" గారి ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచింది.

ఒక తండ్రిగా కుమారుడి కోసం ఏకక్షణం వెనుకాడకుండా, అత్యుత్తమ వైద్యం అందిస్తూ ప్రాణాలను నిలుపుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, విధి తన కఠినతరమైన తీర్పును ఇచ్చింది. అయినప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా,పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించటం, తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ సహాయసహకారాలు అందించటం నిజమైన నాయకునిగా *చిన్న శ్రీను* గారి గొప్పతనాన్ని వెల్లడిస్తోంది.

ఆయన తన కుటుంబాన్ని కోల్పోయిన సమయంలో, దుఃఖ సమయాల్లో ప్రజల అండగా నిలవడం మరోసారి ఆయనకున్న ప్రజాదరణను రుజువు చేసింది.రాజకీయాల్లో గెలుపోటములు సహజమే, కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోవడం చాలా అరుదు. చిన్న శ్రీను గారు అది సాధించారు.జనంలో ఆయనకు ఉన్న స్థానం, ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలు చూసినప్పుడు, నిజమైన నాయకుడు ప్రజలలోనే జీవిస్తాడనే వాస్తవం మరోసారి నిరూపితమైంది.

ఈ సందర్బంగా తనకు అండగా నిలుస్తున్న ప్రజానీకానికి, తన కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్న వారికి చిన్న శ్రీను గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. నిజమైన నాయకునికి ప్రజలే బలమైన ఆయుధం, ప్రజలే ఆయుష్షు. ఈ ప్రేమాభిమానాలే చిన్న శ్రీను గారి రాజకీయ ప్రయాణానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి.

ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు,మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్న దొర, బూడి ముత్యాలు నాయుడు,శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి, ధర్మాన కృష్ణ దాస్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, మాజీ మంత్రివర్యులు మరియు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, విశాఖపట్నం జడ్పీ చైర్మన్ శ్రీమతి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, శంబంగి వెంకట చిన్నఅప్పల నాయుడు,పేట్ల ఉమాశంకర్ గణేష్, అదీపురాజ్,కంబాల జోగులు,కడుబండి శ్రీనివాసరావు,గొర్ల కిరణ్ కుమార్, నిమ్మకు జయరాజు,శ్రీమతి విశ్వసరాయి కళావతి,తిప్పల నాగిరెడ్డి, తిప్పల దేవాన్ రెడ్డి, బడ్డుకొండ అప్పలనాయుడు, తలారి వెంకట్రావు, కొట్టుగుల్ల భాగ్యలక్ష్మి,రాజాం అసెంబ్లీ ఇంచార్జ్ డా.రాజేష్ తలే, మన్యం జిల్లా YSR పార్టీ అధ్యక్షులు శత్రుసర్ల పరీక్షిత్ రాజు, శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, అనంత బాబు,పాలవలస విక్రాంత్, ఇందుకూరి రఘురాజు,మాజీ ఎమ్మెల్సీ పి.వి.మాధవ్, పాకలపాటి రఘువర్మ, విజయనగరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరిచర్ల బాబుజి నాయుడు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్ మోహన్ రావు,మాజీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), గోడ్డేటి మాధవి, మాజీ విజయనగరం జడ్పీ చైర్మన్ స్వాతిరాణి,ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్విని మరియు మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, జిల్లా పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ హాజరై కీర్తి శేషులు ఆదిత్య ప్రణీత్ బాబుకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఇలా ప్రముఖులు రాకతో జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి కార్యకర్తల తాకిడితో మెట్రో కన్వెన్షన్ జనసముద్రంగా మారింది.

Address

Main Street
Rajam
532127

Alerts

Be the first to know and let us send you an email when Dynamic Leader Chinna Srinu Anna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dynamic Leader Chinna Srinu Anna:

Share

Category