27/05/2026
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంగా అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (Amended BharatNet) సజావుగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలక అంశాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya M. Scindia) గారి దృష్టికి తీసుకెళ్లారు.
✅ ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి సాధ్యమైనంత తొందరగా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, పెండింగ్‌లో ఉన్న నిధులను సత్వరం విడుదల చేయడంపై వంటి అంశాలను ముఖ్యమంత్రి గారు చర్చించారు.
✅ అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుపై ముఖ్యమంత్రి గారు మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారితో చర్చించారు.
✅ మండలం నుండి గ్రామ పంచాయతీ రింగ్ నెట్‌వర్క్ వ్యవస్థలను డిజిటల్ భారత్ నిధి (Digital Bharat Nidhi) కి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఉండాలని కేంద్ర మంత్రిని కోరారు. వీటిపై సింధియా సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
✅ ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నాణ్యమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే తెలంగాణ దార్శనికతపై ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. తెలంగాణ ఆశిస్తున్న లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
✅ ABP లో భాగంగా తెలంగాణ ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం, తద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా విస్తృతమైన హై-స్పీడ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి పరుచుకోవడానికి వీలుంటుంది.
✅ రాష్ట్రంలో ఏకీకృత డిజిటల్ విధానం వల్ల టీ-ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానిస్తూ రింగ్ ఆర్కిటెక్చర్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా ఒక మార్గంలో నెట్‌వర్క్ అంతరాయం ఏర్పడినా, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సేవలు నిరంతరం కొనసాగుతాయి. తద్వారా గ్రామీణ తెలంగాణకు అంతరాయం లేకుండా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
✅ ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో, నెట్‌వర్క్ దెబ్బతిన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరిస్తారు.
✅ అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద గ్రామాలను అనుసంధానిస్తూనే, భవిష్యత్తు అవసరాలకు సరిపడే ఫైబర్ నెట్ వర్క్ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్రంలోని హై-స్పీడ్ నెట్‌వర్క్ అందుతున్న ఇతర ప్రాంతాలకు సమంగా సేవలు అందించవచ్చు.
✅ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు గారు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి. అజిత్ రెడ్డి గారు, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ డి. అనుదీప్ గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chief Minister Sri A. Revanth Reddy discussed the implementation of the Amended BharatNet Programme in Telangana with Union Minister Sri Jyotiraditya Scindia through a video conference attended by Minister Sri Duddilla Sridhar Babu.
* The discussions focused on early ex*****on of the agreement, release of pending funds, and strengthening rural digital connectivity through the T-Fiber project.
* Telangana proposed a ring network architecture to ensure uninterrupted high-speed broadband services to villages and households across the state.
* In the first phase, digital connectivity will be restored in 3,089 villages across the erstwhile districts of Nizamabad, Rangareddy, and Khammam. The Centre assured full cooperation for achieving Telangana’s digital connectivity goals.
RVR Digital Media Rapaka Vijayaraju - journalist Telangana CMO