Shiva Studios

Shiva Studios interview and podcast latest News

గోపీనాథ్ మరణం సందర్భంగా వారి పార్థివ దేహాన్ని చూసిన కేసీఆర్ కళ్ళు చెమర్చి, ఉద్వేగానికి గురయ్యారు.
08/06/2025

గోపీనాథ్ మరణం సందర్భంగా వారి పార్థివ దేహాన్ని చూసిన కేసీఆర్ కళ్ళు చెమర్చి, ఉద్వేగానికి గురయ్యారు.

  cry
08/06/2025

cry

అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతూ అకాల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివదేహాన్ని బీఆర్ఎస్ అధినే...
08/06/2025

అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతూ అకాల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివదేహాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

08/06/2025

Transformation in 110 days approximately! 🤫
08/06/2025

Transformation in 110 days approximately! 🤫

Oohh 👌 Congratulations 🎉🎉🎉
08/06/2025

Oohh 👌 Congratulations 🎉🎉🎉

SuperStar  showers love and blessings on the newlyweds  &   at the grand reception ❤️‍🔥❤️‍🔥❤️‍🔥
08/06/2025

SuperStar

showers love and blessings on the newlyweds

& at the grand reception ❤️‍🔥❤️‍🔥❤️‍🔥

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో శుభశ్రీ రాయగురు ఒకరు. సీజన్ 7లో సాధారణ అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.....
08/06/2025

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో శుభశ్రీ రాయగురు ఒకరు. సీజన్ 7లో సాధారణ అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత గ్లామర్ షోతో మరింత పాపులర్ అయ్యింది. ఇక అమర్ దీప్ తో జరిగిన గొడవతో ఈ అమ్మడు పేరు నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. కానీ తక్కువ సమయంలోనే ఈ షో నుంచి బయటకు వచ్చిన శుభశ్రీ ఆ తర్వాత పలు సినిమాలు, ప్రైవేట్స్ సాంగ్స్ చేసింది. కానీ అంతగా గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న శుభశ్రీ.. తాజాగా తన ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ షేర్ చేసింది. తన ప్రియుడితో కలిసి నిశ్చితార్థం చేసుకున్నట్లు అభిమానులకు తెలియజేసింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో శుభశ్రీకి కాబోయే భర్త గురించి తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా.. ? అతడి పేరు అజయ్ మైసూర్.. అలియాస్ ఏజే మైసూర్.ఏజే మైసూర్.. సినీరంగంలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు, టెన్త్ క్లాస్ డైరీస్ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే అటు నిర్మాణ రంగంలోనూ కొనసాగుతున్నారు. శుభ శ్రీ రాయగురు, ఏజే మైసూర్ కలిసి ఇటీవల మెసెస్టీ ఇన్ లవ్ అనే కవర్ సాంగ్ చేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలెక్కనున్నారు. జూన్ 5న వీరిద్దరి నిశ్చితార్థ వేడక జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను శుభశ్రీ రాయగురు తన ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్.

  Wedding Pics
06/06/2025

Wedding Pics

Cannes 2025 లో ఆపరేషన్ సింధూర్ ని ప్రతిబింబించేలా రెడీ అయిన మన హీరోయిన్స్..!ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందిన కాన్స్‌...
22/05/2025

Cannes 2025 లో ఆపరేషన్ సింధూర్ ని ప్రతిబింబించేలా రెడీ అయిన మన హీరోయిన్స్..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందిన కాన్స్‌ వేదిక అంగరంగ వైభవంగా మొదలైంది. 78వ కాన్స్‌ 2025..చిత్రోత్స‌వ వేడుక మంగ‌ళ‌వారం ఫ్రాన్స్‌లో మొదలవ్వగా..ఈ సంద‌ర్భంగా హాలీవుడ్, బాలీవుడ్ సెల‌బ్రిటీలు సంద‌డి చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి సెలబ్రిటీలు అందరూ కూడా వివిధ వ‌స్త్ర‌ధార‌ణ‌ల్లో హాజ‌రై ఫెస్టివ‌ల్‌కు కొత్త‌ క‌ళ తీసుకువ‌చ్చారు. పది రోజులు జరుగుతూ ఉండే ఈవెంట్.. ఈ శనివారం అనగా మే 24న నువ్వు బియ్యనుంది.

ఇక మన దేశం నుంచి 1970ల‌లో సత్యజిత్‌ రే తెర‌కెక్కించిన‌ ‘అరణ్యేర్‌ దిన్‌ రాత్రి’ (Aranyer Din Ratri) చిత్రాన్ని మే 19న ‘కాన్స్‌ క్లాసిక్‌’ విభాగంలో 4కే వెర్షన్‌లో ప్రదర్శించారు. ఇదిలా ఉంటే మే 20, 21న అతిధి రావ్ హైదారి, ఐశ్వర్యారాయ్ వేసుకొచ్చిన వస్త్రధారణ అందరిని అలరిస్తోంది. అదితి రావ్ రెడ్ శారీలో అలరించగా.. ఐశ్వర్యరాయ్ క్రీమ్ డ్రస్సులో ఆకట్టుకుంది.

అయితే అన్నిటికన్నా ఎక్కువ.. అందరినీ ఆకట్టుకున్న విషయం ఏమిటి అంటే వీరిద్దరూ కూడా పాపటిలో సింధూరం పెట్టుకొని కనిపించారు. కాగా చాలామంది ఈ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూరిని ప్రపంచవ్యాప్తంగా ప్రతిబింబించేలా వీరు ఇలా రెడీ అయి ఉండొచ్చు అనే కామెంట్లను పెడుతున్నారు.

ఇక అతిధి ఫోటో కి సిద్ధార్థ.. సిద్దు కోసం అతిధి కుంకుమ అంటూ కామెంట్ కూడా పెట్టారు. మరోపక్క ఐశ్వర్యారాయ్ ఈవెంట్ కి తన కూతురితో హాజరయ్యింది. కాగా ఇలా నుదిటిన కుంకుమ పెట్టుకోవడంతో.. ఐశ్వర్యారాయ్ కథ కొద్దిరోజులుగా అభిషేక్ తో విడాకులు తీసుకుంటుంది అనే వార్త కూడా అబద్ధమే అని క్లారిటీ ఇచ్చినట్టు.. భావిస్తున్నారు అందరూ.

శోభిత పై సీరియస్ అయినా నాగచైతన్య..!తాజాగా నాగచైతన్య, శోభిత ఒక ఈవెంట్ కి అటెండ్ కాగా ఈ ఈవెంట్లో జరిగిన కొన్ని సంఘటనలను.. ...
22/05/2025

శోభిత పై సీరియస్ అయినా నాగచైతన్య..!

తాజాగా నాగచైతన్య, శోభిత ఒక ఈవెంట్ కి అటెండ్ కాగా ఈ ఈవెంట్లో జరిగిన కొన్ని సంఘటనలను.. వీడియో మీమ్ రూపంలో చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు సినీ ప్రేమికులు. అసలు విషయానికి వస్తే ఈ మధ్య నాగచైతన్య, శోభిత ఒక ఈవెంట్ కి హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో శోభిత.. తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో.. మాట్లాడుతూ కనిపించింది.

ఆ వీడియో వైరల్ అవుతుండగా ఆ వీడియోలో వెనక నాగచైతన్య రియాక్షన్ ప్రస్తుతం చర్చలకు దారితీసింది. ఈ వీడియో మొత్తం చూస్తే ముందుగా శోభిత విజయవర్మాతో మాట్లాడుతున్నప్పుడు నాగచైతన్య కొంచెం అసహనంగా కనిపించాడు.

ఇక ఆ తరువాత కూడా నాగచైతన్య.. ఒక క్లిప్పులో శోభిత సాయి కొంచెం అసహనంగా చూస్తూ కనిపిస్తున్నట్టు ఉంది. మళ్లీ విజయవర్మ వెళుతున్నప్పుడు కూడా నాగచైతన్య అదే రియాక్షన్ చూపించారు.

ఇక ఈ మూడు సన్నివేశాలను కలిపి ఒక చిన్న వీడియోని చేసి.. నాగచైతన్య యాంటీ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక దీనికి సమంతా అభిమానులు కామెంట్ సెక్షన్లో చూశారా నాగచైతన్య కేవలం శోభిత విజయవర్మతో మామూలుగా మాట్లాడినందుకు ఎలా చూస్తున్నారో అంటూ కామెంట్లో పెడుతున్నారు. ఇది చాలా సాధారణమైన వీడియో అయినప్పటికీ.. అందరూ చేస్తున్న కామెంట్స్ ఈ వీడియోని కాస్త చర్చకు దారితీసింది.

ఎన్టీఆర్ యాక్ట్ చేసిన టీవీ సీరియల్ గురించి మీకు తెలుసా.. ?తారక్.. తాత ఎన్టీఆర్ ఓన్ డైరెక్షన్ లో హిందీలో తెరకెక్కిన  'బ్ర...
22/05/2025

ఎన్టీఆర్ యాక్ట్ చేసిన టీవీ సీరియల్ గురించి మీకు తెలుసా.. ?

తారక్.. తాత ఎన్టీఆర్ ఓన్ డైరెక్షన్ లో హిందీలో తెరకెక్కిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాతో తొలిసారి ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఇందులో బాబాయి బాలకృష్ణ కూడా నటించారు. ముగ్గురు నందమూరి హీరోలు నటించినా.. ఈ చిత్రం విడుదలకు నోచుకోలేక పోయింది.

యంగ్ ఏజ్‌లోనే హీరోగా పరిచయమైన ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'స్టూడెంట్ నెం. 1' చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్నారు.ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'ఆది' సినిమాతో హీరోగా తన స్టామినా ఏమిటో చూపించాడు తారక్. అటు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన 'సింహాద్రి' సినిమాతో స్టార్‌డమ్ అందుకున్నారు.

ఆ తర్వాత హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తన కెరీర్ కొనసాగిస్తున్నాడు ఎన్టీఆర్. ఇక రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ ‘దేవర పార్ట్ -1’ మూవీతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఒక టీవీ సీరియల్‌లో నటించాడు. ఈటీవీ స్టార్ట్ అయిన కొత్తలో 'భక్త మార్కండేయ' సీరియల్‌లో నటించాడు తారక్. చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ టెలి సీరియల్ ఈ టీవీలో టెలికాస్ట్ అయింది.

ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ పై ‘మా టీవీ’ తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 1 హోస్ట్‌గా.. ఆ తర్వాత జెమిని టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ హోస్ట్‌గా సత్తా చూపెట్టారు. త్వరలో ఎన్టీఆర్ వార్ 2, డ్రాగన్, దేవర 2 సినిమాలలో పలకరించనున్నారు.

Address

Shadnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Shiva Studios posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share