CBC BIBLE CLASS GGM

CBC BIBLE CLASS GGM బైబిల్ మాటలు

27/09/2024
🌹 *దావీదు*  🌹🌹 *5వ భాగము* 🌹  🌹 *పరిపాలన*  🌹సౌలు రాజు లాగే దావీదు కూడా 30 ఏళ్ల వయస్సులో రాజు అయినాడు. 30 యేండ్లు ప్రభువైన...
25/09/2024

🌹 *దావీదు* 🌹

🌹 *5వ భాగము* 🌹

🌹 *పరిపాలన* 🌹

సౌలు రాజు లాగే దావీదు కూడా 30 ఏళ్ల వయస్సులో రాజు అయినాడు. 30 యేండ్లు ప్రభువైన యేసు క్రీస్తు పరిచర్య చూపిస్తుంది. 2 సమూ 2:4 - దావీదు యూదావారి మీద రాజుగా అభిషేకం చేయబడినాడు. ఈ విషయంలో సౌలు కుమారుడైన ఇష్బోషేతు కొంత ఆటంకముగా ఉన్నాడు. కానీ అదే సమయంలో అబ్నేరు ఇష్బోషేతు మరణములు వారి పరిపాలనను అధోగతి పట్టించినది.ఏది ఏమైనా ఇష్బోషేతు అబ్నేరు ఆ దినాలలో రెండేళ్లు పరిపాలన చేశారు కానీ వీరి పరిపాలన దేవుని లెక్కలలో లేదు.

ఆ దినాలలో దావీదు పరిపాలన ఎంత చక్కగా ఉన్నదో 2సమూయేలు 2:11 హెబ్రోనులో యూదా వారి మీద ఏలిన కాలం *ఏడు సంవత్సరములు ఆరు* *నెలలు* .. అదేవిధంగా 2 సమూ 5:4,5 ప్రకారం యెరూషలేము ఇశ్రాయేలు యూదా వారి మీద ముప్పది మూడు సంవత్సరములు అనగా మొత్తం వెరచి 40 సంవత్సరముల ఆరు నెలలు ప్రజలు ఆనందంగా సుఖసంతోషాలతో ఉన్నారు.

దావీదు రాజు అన్నింటికంటే ముఖ్యంగా తన పరిపాలన విధానంలో దేవుని మందసమును ఎంతగానో ప్రేమించాడు. ఏలీ కాలంనాటి మందసమునకు ఎంతో ఉజ్జీవాన్ని తెచ్చాడు. అభీనాదాబు ఇంటిలో నుండి యెరూషలేము పురమునకు తెచ్చి ఆ తర్వాత 2 సమూయేలు6:12 -22 ఒబేదేదోము ఇంటిలో నుండి ఉత్సాహముతో నాట్యముతో తెచ్చిన సమయాన్ని చూడగలం. ఆ సమయంలో యాజకులు ప్రజలు ఎంతో ఉల్లాసించారు. దావీదు నాట్యం చేశాడు. అసలు దేవుని మందిరం కట్టాలని ప్రయాసపడ్డాడు గాని దేవుడు అనుమతించలేదు.ఎందుకంటే తను ఎన్నో యుద్ధాలు చేసి రక్తం చిందించాడు. అయినప్పటికీ తన కుమారుని ద్వారా మందిరము కట్టబడుతుందని దేవుని సెలవునందుకొని 1దినవృత్తాంతం 29: 7 చెప్పబడినట్లు పదివేల మణుగుల బంగారమును ఇరువది వేల మణుగుల బంగారపు ద్రావణమును రెండు లక్షల మణుగుల ఇనుమును ఇంకా దేవదారు గూర్చి చెప్పవీలు కాదు. ఇలా మందిరమునకు కావలసిన వాటినన్నిటిని సిద్దపరిచాడు. దేవుడు మనుష్యులందరినీ ఎలా ప్రేమించాడో దావీదు కూడా అలాగే నడుచుకున్నాడు. 1దినవృత్తాంతం 22:1 లో చెప్పబడినట్లు దావీదు ఇశ్రాయేలీయుల దేశమందుడు అన్య జాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కువారిని నియమించెను. తరువాత దేవుడు తన కుమారుడైన సొలొమోను ద్వారా నెరవేర్చినట్లు చూడగలం.

తన పదవిని బట్టి ఎవ్వరిని తృణీకరించలేదు.విసర్జించలేదు రక్తసంబంధీకులను దగ్గరకు తీసుకున్నాడు. తన సోదరియైన సెరూయా కుమారులను తన రాజ్యంలో సైన్యాధిపతులుగా నియమించాడు. యోవాబును సైన్యాధిపతిగా నియమించాడు. తన స్నేహితుడైన యోనాతానును బట్టి 2సమూ 9 :11 ప్రకారం యోనాతాను కుమారునికి రాజు బల్ల యొద్ద కూర్చుని భుజించే అవకాశం ఇచ్చాడు. ఇది దేవుని సంఘములోని ఐక్యతను చూపిస్తుంది. అన్య రాజులు సహితం దావీదుకు కప్పం చెల్లించేవారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఎదిగే కొలది ఒదిగే ఉన్నాడు

✍️....
ప్రభువు పరిచర్య లో...
రెవ.టి.డేవిడ్ రాజు
కల్వరి బాప్టిస్టు చర్చి
గుంపెళ్ళగూడెం - రాజ్యాతండా
9949366859

13/12/2023

*దేవుని కొరకు నిలబడితే....*

1.సింహముల నోరు మూయబడుతుంది - దాని 6:22

2.అగ్ని నుండి రక్షిస్తాడు - దాని 3:16

3.విజయమును ఇస్తాడు - 1 సమూ 17:49-51

4.అద్బుతాలు చేస్తాడు - 1రాజు 18:37,38

5.హెచ్చిస్తాఢు - దాని 3:30

✍️.,...
ప్రభువు పరిచర్యలో...
రెవ.టి.డేవిడ్ రాజు
కల్వరి బాప్టిస్టు చర్చి
గుంపెళ్ళగూడెం - మామిడి గుండాల
9949366859

బైబిల్ కాలేజీ లో.....నేను చదువుతున్న సమయంలో
13/12/2023

బైబిల్ కాలేజీ లో.....నేను చదువుతున్న సమయంలో

Address

Singareni

Telephone

+919949366859

Website

Alerts

Be the first to know and let us send you an email when CBC BIBLE CLASS GGM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category