
14/11/2024
మందస హరిపురం రోడ్డు మరమ్మత్తు పనులు గతంలో హడావుడిగా నాసిరకంగా చేయడంతో పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. ప్యాచ్ వర్క్ చేసిన ప్రదేశాల్లో భారీ వాహనాల రాకపోకలతో మళ్లీ గతుకులు ఏర్పడుతున్నాయి.కొత్త ప్రభుత్వం వచ్చి రహదారులు బాగు చేస్తారని ఆశపడ్డ ప్రజలు, ప్రయాణికులకు ఈ రోడ్లు పరిస్థితి చూసి కొంత నిరాశ కలుగుతుంది.కనుక మంచిప్రభుత్వం గా పేరు గాంచిన ప్రస్తుత ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మత్తు పనులు ప్రారంభించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.