voice of siddu

voice of siddu welcome to my page iam entertainment and fun and details people connect with you ���

Amazonపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీఅమెజాన్ సంస్థకు కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ ...
22/10/2025

Amazonపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ

అమెజాన్ సంస్థకు కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ వినియోగదారుడు అమెజాన్లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15+ ఆర్డర్ పెట్టగా.. ఐక్యూ ఫోన్ డెలవరీ అయ్యింది. కస్టమర్ కేర్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాధితుడు కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి ఐఫోన్ డెలవరీ చేయని పక్షంలో రూ.80 వేలు+ రూ.25వేలు చెల్లించాలని కన్స్యూమర్ ఫోరం తీర్పు ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖకు సంబంధించిన అన్ని చెక్ పోస్టులను తక్షణం మూసివేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత...
22/10/2025

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖకు సంబంధించిన అన్ని చెక్ పోస్టులను తక్షణం మూసివేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రవాణా కమిషనర్ గారు డీటీఓలకు ఆదేశాలు విడుదల చేశారు.

✅ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రవాణా అధికారులు (డీటీఓ) స్వయంగా చెక్ పోస్టుల వద్ద ప్రస్తుతం ఉన్న బోర్డులను, బారికేడ్లను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించి, చెక్ పోస్టులు మూసి వేయబడినట్టుగా కొత్త బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

✅ చెక్ పోస్టుల వద్ద విధుల్లో సిబ్బంది ఎవరూ లేకుండా తక్షణమే ఉపసంహరించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులను సూచిస్తూ ఉన్న బోర్డులు, బారికేడ్లను తక్షణం తొలగించాలని డీటీఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తొలగింపు ప్రక్రియను మొత్తం వీడియో తీసి దాన్ని భద్రపరచాలని చెప్పారు.

✅ చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, ఫర్నీచర్, ఇతర సామగ్రి, కంప్యూటర్లు, ఇతర వస్తువులను తక్షణం డీటీఓ కార్యాలయాలకు తరలించాలని, అలాగే పరిపాలనకు సంబంధించిన రికార్డులు, క్యాష్ బుక్స్, రిసిప్టులు, చాలాన్లను అన్నింటినీ డీటీవో కార్యాలయంలో భద్రపరచాలని ఆదేశించారు.

✅ ఇంతకాలం చెక్ పోస్టులు నిర్వహించిన స్థలాల్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. చెక్ పోస్టులను మూసివేసినట్టుగా, సిబ్బందిని రీడిప్లాయ్ చేసినట్టు, రికార్డులను భద్రపరిచిన విషయాలన్నింటిపైనా ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు నివేదిక అందించాలని డీటీఓలను ఆదేశిస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

*_Telangana Government: ఇద్దరు పిల్లల రూల్‌ను ఎత్తివేసేందుకు ఆర్డినెన్స్‌_*_రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఆర్డినెన్స్‌ బిల...
22/10/2025

*_Telangana Government: ఇద్దరు పిల్లల రూల్‌ను ఎత్తివేసేందుకు ఆర్డినెన్స్‌_*

_రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఆర్డినెన్స్‌ బిల్లుపై సీతక్క సంతకం_

*_క్యాబినెట్‌ ఆమోదం తర్వాత గవర్నర్‌కు_*

_ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను ఎత్తివేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది._

_ఈ మేరకు ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు పైన మంగళవారం నాడు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం అయిన తర్వాత క్యాబినెట్‌ ముందుకు రానుంది. ఆర్డినెన్సు బిల్లును క్యాబినెట్‌ ఆమోదించిన తర్వాత గవర్నర్‌ వద్దకు పంపనున్నారు. గవర్నర్‌ ఆ బిల్లును ఆమోదిస్తే..._

_వచ్చే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 21(3) ప్రకారం ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు గ్రామీణ స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు. 1995కు ముందు ఇద్దరు మించి పిల్లలు ఉన్న వారికి మాత్రం సడలింపు ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలవుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయాలంటూ కొంత కాలంగా స్థానిక నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు._

_ఇటీవల రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో ఈ అంశంపైన చర్చించింది. ఆ నిబంధనను ఎత్తివేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. కానీ, ఈ నిర్ణయం అమల్లోకి రావాలంటే తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018కు సవరణ చేసి అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. శీతాకాలం అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఇంకా సమయం ఉండటం, హైకోర్టు ఆదేశాల మేరకు త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో చట్ట సవరణను ఆర్డినెన్సు రూపంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు గురువారం రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆ భేటీలో పంచాయతీరాజ్‌ చట్ట సవరణ ఆర్డినెన్సును రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించి.. గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపనుంది._

20/10/2025

ఉద్యోగులకు యజమాని 51 కార్లు గిఫ్ట్

దీపావళి సందర్భంగా ఉద్యోగులకు కంపెనీలు గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపరచడం చూస్తుంటాం. అయితే చండీగఢ్లోని ఓ ఫార్మా కంపెనీ యజమాని తన ఉద్యోగులకు ఏకంగా 51 కొత్త కార్లు బహుమతిగా ఇచ్చి ఆశ్చర్య పరిచారు. మొత్తం 51 SUV& స్కార్పియో వాహనాలను అందించారు ఎంకే భాటియా. కంపెనీ అభివృద్ధికి కృషి చేసినందుకు కృతజ్ఞతగా ఈ బహుమతిని ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గతంలోనూ ఆయన మరికొందరికి కార్లను అందించారు

రూ.7 వేలు కోట్లు దాటిన బాణసంచా అమ్మకాలుదేశవ్యాప్తంగా దీపావళి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో బాణసంచా అమ్మకాలు జరిగాయి....
20/10/2025

రూ.7 వేలు కోట్లు దాటిన బాణసంచా అమ్మకాలు

దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో బాణసంచా అమ్మకాలు జరిగాయి.

బాణసంచా వ్యాపారుల సమాఖ్య నివేదికల ప్రకారం.. పండుగ సీజన్లో సుమారు రూ.7 వేల కోట్ల విలువైన బాణసంచా అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం రూ.6 వేల కోట్ల టర్నోవర్తో పోలిస్తే, ఈ ఏడాది రూ. వెయ్యి కోట్ల పెరుగుదల నమోదయ్యింది. తమిళనాడులోని శివకాశి, విరుదునగర్, సత్తూరులో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి.

ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యంగ్రాఫ్ 2 అమలు చేసిన ప్రభుత్వం..దీపావళికి ముందు కాలుష్య స్థాయిలు పెరగడంతో ఢిల్లీ-ఎన్...
20/10/2025

ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం
గ్రాఫ్ 2 అమలు చేసిన ప్రభుత్వం..

దీపావళికి ముందు కాలుష్య స్థాయిలు పెరగడంతో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో GRAP స్టేజ్-II ఆంక్షలు విధించిన ప్రభుత్వం

కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఆదివారం దేశ రాజధాని మరియు దాని ప్రక్కనే ఉన్న NCR ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) యొక్క రెండవ దశను అమలు చేస్తున్నట్లు ప్రకటన

ఈరోజు సాయంత్రం (ఆదివారం) 7 గంటలకు దేశ రాజధానిలో వాయు నాణ్యత సూచిక (AQI) 302 (చాలా పేలవంగా)కి పడిపోయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న

సాయంత్రం 4:00 గంటలకు 296 మరియు 7:00 గంటలకు 302 గా నమోదైంది.

IMD/IITM అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో AQI మరింత క్షీణించే అవకాశం ఉందని తన నోటిఫికేషన్‌లో తెలిపిన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM)

దేశ రాజధానిలోని 38 పర్యవేక్షణ కేంద్రాలలో, 12 గాలి నాణ్యత "చాలా పేలవమైన" పరిధిలో ఉందని నివేదించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు

ఆనంద్ విహార్ 430 వద్ద అత్యధిక AQIని నమోదు...

తరువాత వజీర్‌పూర్ (364), వివేక్ విహార్ (351), ద్వారక (335), మరియు RK పురం (323) ఉన్నాయి.

సిరి ఫోర్ట్, దిల్షాద్ గార్డెన్, జహంగీర్‌పురి వంటి ఇతర ప్రాంతాలలో AQI 318 గా నమోదైంది.

పంజాబీ బాగ్ 313 వద్ద, నెహ్రూ నగర్ 310 వద్ద, అశోక్ విహార్ 305 వద్ద, బవానా 304 వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదయిందని తెలిపిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB)

ఈ వారం ప్రారంభంలో ఈ సీజన్‌లో GRAP-1 కింద పరిమితులు మొదటిసారిగా అమలు చేసిన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్
(CAQM)

ఒక చట్టబద్ధమైన సంస్థ అయిన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM), దశ IIని అమలు

రద్దీ ప్రదేశాలలో ట్రాఫిక్ సిబ్బందిని మోహరించడం...

ప్రైవేట్ రవాణాను నిరుత్సాహపరిచేందుకు వాహనాల పార్కింగ్ ఫీజులను పెంచడం మరియు అదనపు బస్సు మరియు మెట్రో సేవలు ప్రారంభించబడతాయి.

ఈ చర్యలు అక్టోబర్ 14 నుండి అమలులో ఉన్న GRAP స్టేజ్ 1 చర్యలకు అదనంగా ఉంటాయి.

20/10/2025

*రెప్ప పాటు పేలుడు... గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 97 మంది మృతి*

గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు చెలరేగాయి.

పీస్ డీల్ అమల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఆదివారం భారీ స్థాయిలో బాంబు దాడులు జరిపింది.

గాజా మీడియా ప్రకారం

అక్టోబర్ 10న జరిగిన సీజ్ఫైర్ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 97 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా, 230 మందికి పైగా గాయపడ్డారు.

IDF (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) ఒప్పందాన్ని 80 సార్లు ఉల్లంఘించిందని హమాస్ ఆరోపిస్తుండగా.. సీజ్‌ ఫైర్‌కి కట్టుబడి ఉన్నామని IDF చెప్తోంది.

20/10/2025

_నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో విషాద ఘటన..!_

కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలను చంపి ఉరివేసుకుని తల్లి ఆత్మహత్య..!

మృతులు కుంచాల నాగలక్ష్మి (27), కుమార్తె అవంతిక (9), కుమారుడు భవన్ సాయి (7)

ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా జనగాల గ్రామానికి చెందిన కుటుంబం గా గుర్తింపు...

భర్త కుంచాల రమేష్ — మేస్త్రి పనులతో జీవనోపాధి...

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాలుగేళ్లుగా నివాసం...

తల్లే ఇద్దరు పిల్లల గొంతు నమిలి చంపి తను ఉరివేసుకుని ఆత్మహత్య...

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభం...

స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది...

18/09/2025
22/08/2025

సూర్యాపేట జిల్లాలో దారుణం

పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం

బైక్ మీద వెళ్తున్న ముగురిని చంపేందుకు కారులో వెంబడించిన ఐదుగురు వ్యక్తులు

సూర్యాపేటలో ఖమ్మం క్రాస్ రోడ్ నుండి బైక్ పై వెళ్తున్న ముగ్గురిని (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) కారులో వెంబడించగా బీబీ గూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ ముందు బైక్ బయటపడవేసి అందోళనతో వైన్స్ లోపలికి వెళ్లిన ఆ ముగ్గురు

ఆముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్స్ వైపు పరుగెత్తిన దుండగులు

వైన్స్ షాప్ లో ఉన్న వారు అకస్మాత్తుగా బయటికి రావడంతో వారిని చూసి కారెక్కి పారిపోయిన దండగులు

*ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. సంచలన తీర్పు*భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి కోర్టు యావ జీవ కారాగార శిక్ష విధించ...
22/08/2025

*ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. సంచలన తీర్పు*

భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి కోర్టు యావ జీవ కారాగార శిక్ష విధించింది. ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపిన వివరాలు.. భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన స్వప్న, ఆమె ప్రియుడు కళ్యాణ్ కలిసి తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త మారపాక దేవేందర్ను 2020 ఆగస్టు 21న మద్యంలో విషం ఇచ్చి చంపింది. నేడు నిందితులకు డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి సీహెచ్ రమేశ్ బాబు శిక్ష విధించారు.

*టీటీడీకి చరిత్రలో ఎన్నడూ లేనంత విరాళం..!!*  *రూ.140 కోట్ల విలువైన 121 కేజీల బంగారం టీటీడీకి విరాళంగా అందించనున్న అజ్ఞాత...
22/08/2025

*టీటీడీకి చరిత్రలో ఎన్నడూ లేనంత విరాళం..!!*

*రూ.140 కోట్ల విలువైన 121 కేజీల బంగారం టీటీడీకి విరాళంగా అందించనున్న అజ్ఞాత భక్తుడు..*

*విరాళం గురించి నిన్న స్వయంగా వెల్లడించిన సీఎం చంద్రబాబు..*

Address

Tarnaka
5000027

Website

Alerts

Be the first to know and let us send you an email when voice of siddu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share