Tirumala Tirupati Temple TTD తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం

  • Home
  • India
  • Tirumala
  • Tirumala Tirupati Temple TTD తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం

Tirumala Tirupati Temple TTD తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tirumala Tirupati Temple TTD తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం, News & Media Website, Tirumala.
(3)

Tirumala Tirupati Devasthanams TTD, Tirumala Ticket booking, Tirumala Hills Photos, Videos, Tirumala latest News, Tirumala Darshanam timings, Tirumala 300 Tickets, Tirumala free darshan tickets online booking (తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం)

21/03/2025

16/03/2025



Cc

ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలుతిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయ...
15/03/2025

ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్ప‌పై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు.

ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను క‌టాక్షించారు. మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.

తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటితిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర...
15/03/2025

తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి శుక్రవారం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా కుమారధార తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా తీర్థానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకుల సహకారంతో పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, సాంబారు అన్నం, పెరుగన్నం, పులిహోర, మజ్జిగ, తాగునీరు అందించారు. టీటీడీ విజిలెన్స్, పోలీస్, అటవీ విభాగాలు సమన్వయంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించారు.

ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు.

కుమారధార సందర్భంగా మార్గంలో చేసిన ఏర్పాట్లను అన్న ప్రసాదం, ఆరోగ్య విభాగం, అటవీశాఖ, విజిలెన్స్, శ్రీవారి సేవ, పోలీసు శాఖ అధికారులు పర్యవేక్షించారు.

ప్రాశస్త్యం

వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ద బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు.శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏం చేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చింది.

పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోక సేనాధిపతి శ్రీ కుమారస్వామి రాక్షసుడైన తారకాసురిని సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షాత్తు శ్రీ కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.
---------------------------------------------------------

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది.రాత్రి 7 నుండి 9 గం...
15/03/2025

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది.

రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

27,000 మంది భక్తులు శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని తిలకించేలా ఏర్పాట్లు: టిటిడి ఈవో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష శ్రీనివాస క...
15/03/2025

27,000 మంది భక్తులు శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని తిలకించేలా ఏర్పాట్లు: టిటిడి ఈవో

ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష

శ్రీనివాస కళ్యాణోత్సవానికి 300 బస్సులు

Address

Tirumala

Website

Alerts

Be the first to know and let us send you an email when Tirumala Tirupati Temple TTD తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share