
24/07/2024
కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో ఆవ ప్రాంతాల ఇళ్ల పట్టాల పరిశీలన
కాపవరం, జూలై 23 : బురుగుపూడి గ్రామాల్లో అధికారులతో కలసి కలెక్టర్ ప్రశాంతి పర్యటించారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ పై ప్రజా ప్రతినిధుల సూచనల నేపధ్యంలో భూములను పరిశీలించారు. ముంపు ప్రమాదం నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.కలెక్టర్ వెంట ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఇరిగేషన్ డి.ఈ. కే. ఆనంద బాబు, కోరుకొండ తహశీల్దార్ సుమలత తదితరులు ఉన్నారు.