16/10/2025
title https://www.prajamantalu.com/article/7410/kharif-monsoon-season-grain-purchase-plans-should-be-prepared-district
జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)
గురువారం జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయములో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బి.ఎస్ లత వానాకాలం & యాసంగి 2024-2025 CMR చెల్లింపుల పై మరియు ప్రస్తుతం వానాకాలం 2025-26 యొక్క వరిధాన్యం కొనుగోలు విషయములో రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశము నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
వానాకాలం 2025-26 సీజన్ నందు 666500 MTs ల వరిధాన్యం కొనుగోలు కొరకు ప్రణాళిక సిద్దం చేయడం జరిగిందని తెలిపారు.
ఈ వానాకాలం సీజన్ లో వరి ధరలు గ్రేడ్ A- 2389/-, కామన్ ధరలు – 2369/- కలవు. ఈ సీజన్ కు గాను IKP – 137, PACS- 285 MEPMA -1 మొత్తం – 423 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు.
ఈ వానాకాలం లో (92) బాయిల్డ్ మిల్లులు పాల్గొంటున్నందున ప్రతి ఒక్క రైస్ మిల్లు వారు తప్పనిసరిగా 100% బ్యాంకు గ్యారెంటి DMCSC కార్యాలయములో సమర్పించాలి మరియు రైస్ మిల్లులో 50-60 హమలిలను సమకుర్చుకోవలన్నారు.
ఎప్పటికప్పుడు మిల్లుకు వచ్చిన లారిని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలతో లేకపోతే సంబంధిత పౌరసరఫరా క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారము ఇవ్వవలసినదిగా తెలిపారు.
ఈ సమావేశములో అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా మేనేజర్ పౌరసరఫరా సంస్థ జితేంద్ర ప్రసాద్, జిల్లా రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్ అసోసియేషన్, ఇతర రైస్ మిల్లర్లు మరియు పౌరసరఫరా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
RSS Feed of Praja Mantalu