
12/09/2024
12-9-2024
*అమలాపురం విజయదశమి ఉత్సవ కమిటిల సమావేశం*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు విజయదశమి ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏడు వీధులు కొంకాపల్లి, మహిపాల వీధి, గండు వీధి, రవణం మల్లయ్య వీధి, రవణం వీధి, నల్లా వీధి, మరియు శ్రీరాంపురంలకు సంబంధించిన ఉత్సవ కమిటీ పెద్దలు పాల్గొని దసరా ఊరేగింపు అక్టోబర్ 12 శనివారం చేసుకొనుటకు కమిటీ సభ్యులు అందరూ నిర్ణయించుకున్నారు మరియు దసరా ఉత్సవాలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమిష్టిగా ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని కమిటీల వారు సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.