
25/06/2025
తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి పంచాయతీ సర్పంచ్ బొల్లినేని సుభాషిణి మృతి బాధాకరం.
సర్పంచ్ బొల్లినేని సుభాషిణి ఆధ్వర్యంలో శక్తి పంచాయతీ, నేత్రి అభియాన్ ఉత్తమ పంచాయతీగా అవార్డులు అందుకుంది.
* కూటమి నాయకులతో కలిసి సుభాషిని పార్థివదేహానికి
పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.*
తిరుపతి,
తిరుపతి రూరల్ మండలం పరిధిలోని చెర్లోపల్లి పంచాయతీకి చెందిన కాంట్రాక్టర్ బొల్లినేని శుభగిరి భార్య బొల్లినేని సుభాషిణి మృతి చెందిన విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని గారు వారితో కలిసి బొల్లినేని సుభాషిణి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.