28/06/2024
Kalki 2898 ADv Ustad Review✍️
CBFC: U/A 2024 ‧ Sci-fi
నా భావన.
మహాభారతం గొప్పదనం ఏందోగని..ఈ భారతీయ ఇతిహాసానికి సంబంధించిన దృశ్యాలు ఎక్కడ కనబడ్డా ఒల్లంత పులకరించి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఏదో నా పూర్వీకులను చూసుకున్నంత సంబురం కలుగుతది. ఇయ్యాల మా పోరగాల్లని తీసుకొని కల్కి సినిమాకు పోయిన. ఆట మొదలైనప్పటిసంది నాకో తెలువని క్యూరియాసిటీ మొదలైంది. సాధారణంగా సినిమాను సైలెంట్ గా అబ్జర్వ్ చేసే నేను కథ మధ్య మధ్యల మహాభారతం సీన్స్ వచ్చినప్పుడల్లా పట్టరాని సంతోషంతో అరుస్తూ చెప్పట్లు కొట్టడం అనేది కొంత సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. డైరెక్టర్ నాగ అశ్విన్ తను ఎంచుకున్న కథను మహాభారతానికి అనుసంధానం చేయడంలో సక్సెస్ అయ్యిండని చెప్పాలె. మహాభారతం జరిగిందా లేదా అనే తర్కాన్ని కాస్త పక్కన పెడితే మహాభారతం ఆధారంగా వర్తమాన ప్రేక్షకులకు కరువున్న భవిష్యత్తును చూపించిన దర్శకుని పనితీరును టక్కున చెప్పాలంటే అద్భుతః.
నటీనటవర్గం (IMP).🎭🕺💃
నటీనటవర్గం ఎవరికి వారు, వారివారి పాత్రలలో మునిగి జీవించిండ్రు. ముఖ్యంగా ప్రభాస్ కటౌట్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అయితే, మొదటి భాగం కథానాయకుడు మాత్రం అమితాబ్ బచ్చన్ అనే చెప్పాలి. తన వృద్ధాప్యాన్ని ఎక్కడ బయటకు కనపడనివ్వకుండా వృద్ధావస్థలో వున్న అశ్వద్ధామ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిండు. దీపిక సుమతి క్యారెక్టర్ ను అవలీలగా అవతలకేసింది. చివరగా కమల్ హాసన్ పాత్ర నిడివి మొదటి భాగంలో తక్కువగా ఉన్నా, పాత్ర పరంగా తన పరకాయ ప్రవేశం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. (Extraordinary). మధ్య మధ్యలో RGV, జక్కన్న, విజయ్ దేవరకొండ, అనుదీప్, చిన్ని లాంటి వారు తారసపడ్డప్పుడు సోంపులో మిష్రీ నమిలిన ఫీల్ కలిగింది. Crunchy approach 😊
సంగీతం 🎙️🎧🎷🥁🎺🎻
సంగీత దర్శకుడు Santhosh Narayanan
పాటల పరంగా సగటు ప్రేక్షకుణ్ణి కొంత నిరాశపరిచిన బీజీమ్, RR పరంగా కిర్రుమనిపించిండు. కొనసాగుతున్న కథనానికి అనుగుణంగా పదునైన నేపథ్య సంగీతాన్ని అందించి ప్రేక్షకుణ్ణి కథలో లీనమయ్యేటట్టు చేసిండు. Rocky approach 👍
Visual effects 🧞🧜♂️🎩
సాంకేతిక పరిజ్ఞానాన్ని దర్శకుడు ఒడుపుగా వాడుకొని ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిండనడంలో సందేహం లేదు. కానీ విజువల్ ఎఫెక్ట్ మీద అవగాహన ఉన్న ప్రేక్షకులు తీక్షనంగా గమనించే నాలాంటి వారికి అక్కడక్కడ చోటా భీమ్ దృశ్యాలు మదిలో మెదులుతాయి. రానున్న కాలంలో దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన చిన్న చిన్న లోపాలు సరి చేసుకుంటే హాలీవుడ్ తో కంపారిజన్ అవసరం ఉండదు.
భరత వాక్యం. 🕵️♂️✍️
తెరకెక్కించే దర్శకులకు దమ్ము, ధైర్యం, ఒడుపు ఉంటే మన ఇతిహాసాలు, పురాణాలు ఆస్కార్లను తోలుకువచ్చే పుష్పకాలు అని నా అభిప్రాయం.
మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్. 3.5/5