Telugu E News

  • Home
  • Telugu E News

Telugu E News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu E News, News & Media Website, .

22/04/2025

కురుక్షేత్ర యుద్ధం గుర్తులను కనుకొని వెలికి తీస్తున్న A I వీడియో S M లో బాగా వైరల్ అవుతున్న సందర్భంగా ఇంతటి అద్భుత వీడియో మీ కోసం.

27/03/2025

పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్ నందు ఆర్టీసీ బస్సు టర్నింగ్ తిరుగుతున్న సమయంలో ఓ మహిళ కాలు మీద నుంచి వెళ్లిపోవడం జరిగింది కాళ్లు నుజ్జు అవడం జరిగింది వివరాల్లోకి వెళితే బంగారమ్మ గుడి వీధి బత్తిన మురళీకృష్ణ భార్య భారతి ప్రతిరోజూ ఈమె వర్క్ నియమంతో వెళ్లడం జరుగుతుంది కానీ ఈ రోజు అనుకోకుండా ఈ సంఘటన జరగడం వల్ల కుటుంబ అంతా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందని తమ కూతురు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది తమ కుటుంబాన్ని ఆర్టీసీ సిబ్బంది గానీ ప్రభుత్వ అధికారులు గానీ చర్య తీసుకుని ఆదుకోవాలని తెలియజేసింది

23/03/2025

*ఐపీఎల్ లో కాకినాడ కుర్రాడు*

*ఆల్ ది బెస్ట్ సత్యనారాయణ రాజు అంటున్న గోదారోళ్ళు*

క్రికెట్ లో అత్యంత ఉత్సాహభరితమైన
ఐపీఎల్ పండగ ప్రారంభ మైంది. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కాకినాడ కుర్రాడు పెన్మత్స సత్యనారాయణ రాజు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున తన ప్రతిభ చూపటానికి సిద్దమవుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్ లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది.రంజీ పోటీల్లో ఎనిమిది మ్యాచ్ ల్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మన కాకినాడకు చెందిన కుర్రాడు ఎలా ఆడతాడో వేచి చూద్దాం.

తిరుపతి గ్రామం, పెద్దాపురం మండలం, కాకినాడ  జిల్లాలో తొలి  తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగారవల్లభ స్వామి దేవస్థానము ...
15/03/2025

తిరుపతి గ్రామం, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లాలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగారవల్లభ స్వామి దేవస్థానము నకు భక్తులు శ్రీస్వామి వారిని ఈ రోజు అనగా ది.15-03-2025 శనివారం సందర్భంగా సుమారు 15 వేలు మంది భక్తులు దర్శించుకొనుట జరిగినది. శ్రీ స్వామివారిని పుష్పాలతో అలంకరణ వైభవంగా చేయడమైనది. ఈరోజు ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ. 2,15,030=00
మరియు అన్నదాన విరాళములు ద్వారా రూ 1,51,947=00 మరియు కేశ ఖండన ద్వారా రూ 6,960=00 తులాభారం ద్వారా రూ 500=00 ,లడ్డు ప్రసాదం 27,150=00,
వెరశి రూ 4,01,587=00 ఆదాయం సమకూరినది. దేవస్ధానం తరుపున భక్తులకు ఉదయం పులిహోర ప్రసాదం ఉచితంగా పంపిణీ మరియు సుమారు ఐదు వేలు మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించడ మైనది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ పెద్దింటి పురుషోత్తమా చార్యులు,శ్రీ పెద్దింటి నారాయణాచార్యులు మరియు గ్రామస్తులు సహకారంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడమైనది. అని కార్యనిర్వాహణాధికారి వడ్డి శ్రీనివాసరావు తెలిపారు.

స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణపెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ఘనంగా...
15/03/2025

స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ

పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ రమణి గారు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో గారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని పర్యావరణ పరిరక్షణకు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అలాగే, ప్రజలు శుభ్రతను ప్రోత్సహించి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నెలకొల్పేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు

- రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, పెద్దాపురం

పక్బండీగా లిఃగనిర్ధారణ   చట్టాన్ని కఠినంగా అమలుచేసేందుకు కమిటీ సభ్యులు తరచు తనిఖీలు నిర్వహించాలని ఆర్డీవో కె.శ్రీరమణి పే...
13/03/2025

పక్బండీగా లిఃగనిర్ధారణ చట్టాన్ని కఠినంగా అమలుచేసేందుకు కమిటీ సభ్యులు తరచు తనిఖీలు నిర్వహించాలని ఆర్డీవో కె.శ్రీరమణి పేర్కొన్నారు.పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ డీ ఎం హెచ్ వో పి.సరిత ఆధ్వర్యంలో గర్బిణీ శిశు లింగ నిర్ధారణ చట్టం అమలు తీరుపై కమిటీ సమావేశం నిర్వహించారు.ఆర్డీవో శ్రీరమణి కమిటీ సభ్యులకు పలుసూచనలు చేశారు.సమావేశంలో న్యాయవాధి సత్యరవికుమార్, ఎన్జీవో మెంబర్ పళ్ళ వాసవి, డాక్టర్ అనూషా, డాక్టర్ పి.సత్యవంశీ, జ్యోత్స్న, ఆర్కే ప్రిన్సిపాల్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when Telugu E News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share