13/04/2024
సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్
నేడు గుడివాడ, పెడనలో కొనసాగాల్సిన మేమంతా సిద్ధం యాత్రకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్ విరామం ప్రకటించారు. గాయం తగ్గేవరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్కు సంబంధించిన వివరాలను నేడు వైసీపీ వెల్లడించనుంది. ప్రస్తుతం జగన్ కేసరపల్లి క్యాంప్లో బస చేస్తున్నారు. మరోవైపు జగన్పై దాడి ఘటనపై నివేదిక పంపాలని సీపీని ఈసీ ఆదేశించింది.