08/06/2025
*👉 కేకే సర్వే నేపద్యంలో జనసేనానికి అక్షర సందేశం 👈*
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి సంబంధించి లేదా సేనకు సంబంధించి కేకే సర్వే చెప్పిన ప్రధాన అంశాలు (నాకు అర్ధం అయినంతవరకు):
1. ఏపీ డిప్యూటీ సీఎంగాని, డిప్యూటీ సీఎం పేషీ గాని నిజాయితీ విషయంలో, ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో అందరికంటే ముందు ఉన్నది.
2. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, అలానే అన్ని పార్టీల కార్యకర్తలు కూడా కోరుకొంటున్నారు.
3. బాబు తరువాత పవన్ కళ్యాణ్ మాత్రమే సీఎం కావాలని ఏపీ ప్రజలు కోరుకొంటున్నారు.
4. అయితే సీఎం బాబు, డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు కలిసినట్లుగా సేన నాయకులూ, టీడీపీ నాయకులూ కలవడం లేదు. అలానే తెలుగు తమ్ముళ్లుకు, జనసైనికులకు అస్సలు పొసగడం లేదు.
5. పవనేశ్వరుని జనసేన ఆఫీస్ కి వెళ్లడం కంటే బొందుతో పరమేశ్వరుని కైలాసంకి వెళ్లడం సులభం. సేనాని తరువాత బాధ్యతలు తీసికొని పనిచేసేవారు సేనలో ప్రస్తుతం కనిపించడం లేదు. కార్యకర్తల కష్టాలను వినే యంత్రాంగం జనసేన పార్టీలో కనిపించడం లేదు.
6. అధికార వికేంద్రీకరణ జరగాలి. సేనాని బాధ్యతలను నలుగురికీ పంచాలి. కార్యకర్తలకు సేనాని దగ్గర అవ్వాలి. పార్టీని బలోపేతం చెయ్యాలి. లేకపోతే సేనాని లేదా సేన బలహీనతతో కూటమి కూడా బలహీనం అవుతుంది. అప్పుడు మరొక్కసారి వైసీపీ బలపడి, జగన్ సీఎం అయ్యినా ఆశ్చర్యం పోనక్కరలేదు.
*అక్షర సందేశాలు సమ్మిళితమే నేటి కేకే సర్వే:*
7. శంఖంలో పోస్తేనే తీర్ధం అన్నట్లు అక్షర సత్యాలు కంటే కేకే సర్వే రిపోర్టునే నేడు తీర్ధం లాంటిది?
8. కేకే సర్వేలో చెప్పిన పై అంశాలను అక్షర సత్యం ఆగష్టు 2024 నుండీ చెబుతూనే ఉన్నదీ.
9. అక్షర సత్యం యొక్క వివిధ ఆర్టికల్స్ ద్వారా, వెబ్సైటు ద్వారా, వివిధ పోస్ట్లు ద్వారా, డిబేట్లు ద్వారా, ప్రెసిడెంట్ టీంకి పంపుతున్న రహస్య సందేశాలు ద్వారా సేనకు, టీడీపీకి తీవ్రమైన గ్యాప్ ఉంది అనే చెబుతూనే ఉన్నాను. దిద్దుబాటు చర్యలు తీసికోవాలి అని వేడుకొంటూనే ఉన్నాను.
10. నాటి నుండి నేటి వరకు చెవిన ఇల్లుకట్టుకొని కఠోర వాస్తవాలను దేవుడు పవనేశ్వరుడికి పంపుతూనే ఉన్నాను. వినే నాధుడు సేనాని చుట్టూ ఎవ్వరు లేరు అనే నిర్లిప్తత ఉన్నప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా అక్షర పోరాటం చేస్తూనే ఉన్నాను.
*పవనేశ్వరా!*
11. నేను కమ్మ వ్యతిరేకిని కాదు అలానే టీడీపీ వ్యతిరేకిని కాదు. టీడీపీ చూపే వివక్షతకు వ్యతిరేకిని. పొత్తుల వ్యూహంతోనే మనం ఎదగాలి అని భావించి మీకు సంపూర్ణ మద్దతు నిస్తున్నవాడిని.
12. కూటమి నుండి సేనానిని బయటకు రమ్మని కోరే అజ్ఞానిని కాదు నేను. ప్రస్తుత కూటమిలో సేనానిగాని, సేనగాని ఎదగకపోతే, మనల్ని గెలిపించిన వర్గాలే తిరిగి వైసీపీని గెలిపించవచ్చు అని భావించి హెచ్చరిస్తున్న మీ మద్దతుదారుడిని.
13. నేను చెప్పే విషయాలు, లేదా నేడు కేకే సర్వే చెబుతున్న విషయాలు మీ చుట్టూ ఉన్నవారికి కూడా తెలుసు. కానీ వారికి వాళ్ళ ఎదుగుదలనే ముఖ్యం. వీరికి మీ ఎదుగుదల లేదా మీ పార్టీ ఎదుగుదల అవసరం లేదు అని సమస్త జనులు కూడా నేడు అపోహలు పడుతున్నారు.
*అంజనీపుత్రా! ఇప్పటికీ మించిపోయింది లేదు?*
14. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా లేదా సేన భవిత దృష్ట్యా కూటమిలో కొనసాగుతూనే జనసేన పార్టీ పటిష్ఠతకు చర్యలు తీసికోగలరు. జనసైనికులతో మమేకం అవ్వడానికి ప్రయత్నం చేయగలరు. పొత్తుల పేరుతో సేనకు జరుగుతున్న అన్యాయాన్ని, అణచివేతలను తెలుసుకొని హెచ్చరికలు (అప్పుడప్పుడు) చేయవలసిన అవసరం ఉంది.
15. జనసైనికులకే కాదు మెజారిటీ ప్రజలకు కూడా జనసేనాని అంటే దేవుడు లేదా దేవుడుతో సమానం. అటువంటి మీ భక్తులు నేడు ఏమి కోరుకొంటున్నారో, పార్టీ బలోపేతానికి మీరు ఏమి చర్యలు తీసికోవాలో తెలిసికోవడం కూడా మీ బాధ్యత అని మీకు తెలియంది కాదు. కానీ వాటిని ఆచరణంలో పెట్టడం తక్షణ అవసరాలు అని గ్రహించగలరు.
చరిత్ర సృష్టించడమా లేక చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోవడమా అనేది మీ చేతుల్లోనే ఉన్నది. *మీరు చర్యలు తీసుకొన్నా, తీసిపోకపోయినా మీరు మాత్రం ఎప్పడికీ దేవుడే సామి. విషాన్ని మీ కంఠంలో పెట్టుకొని, చంద్రుణ్ణి నెత్తిన మోస్తున్న పవనేశ్వరుడివే సామి. ఆలోచించండి (It's from Akshara Satyam)*