Unnamaata

Unnamaata Part of the new Media initiative of veteran journalist , reputed Editor and author MVR Sastry.

11/07/2025
18/06/2025

నా కొత్త పుస్తకం రచన పూర్తయింది.
టైటిల్ : కరుణాచల రమణ
ప్రింటింగ్ పని నడుస్తున్నది. వచ్చేనెల మొదటి వారం మార్కెట్ లో ఉంటుంది. ధర: రు 200

పది వేల సంవత్సరాల పైచిలుకు చరిత్రపై నేను చేసిన మూడు దశాబ్దాల అధ్యయనంలో ఎందరో మహాత్ములు, ఎందరో మహర్షులు, ఎందరో మహా తపస్వులు, మహాయోగులు, మహా జ్ఞానులు, ఎందరో ఆచార్యులు, గొప్ప ఆధ్యాత్మిక గురువులు తారసిల్లారు. ఎవరి గొప్పతనం వారిది. కాని శ్రీ భగవాన్ రమణ మహర్షితో సరిపోల్చగలిగిన వారు అంటూ నాకు వారిలో ఒక్కరూ స్పురించటం లేదు. శ్రుతి, స్మృతి, పురాణ, కర్మ, యోగ, జ్ఞాన, వేదాంత గ్రంథాలలో బంధవిముక్తికి, ఆత్మజ్ఞానానికి, మోక్షానికి నిర్దేశించిన దారులన్నిటి లోకీ సులభమైనది, ఎవరైనా అనుసరించలిగినది రమణ మార్గం. అతి గహనం, మహా సంక్లిష్టం, అత్యంత కష్టం అని అందరూ సాధారణంగా తలచే ఆధ్యాత్మిక సాధనను ఈ కాలానికి తగ్గట్టు సులభతరం చేయటం మానవాళికి భగవాన్ చేసిన మహోపకారం.
నా రచన రెండుభాగాలు. శ్రీ రమణుల కరుణ, మహిమ, మహత్తు, లీలలతో కూడినది ఈ ‘కరుణాచల రమణ’ . ఏ దేశం, ఏ మతం, ఏ సిద్ధాంతం, ఏ మార్గం, ఏ వయసు, ఏ వృత్తి, ఏ ప్రవృత్తి, ఏ స్థితి అన్న వాటితో నిమిత్తం లేకుండా సార్వజనీనమైన, సార్వ కాలికమైన, సకల మానవులకు ఆచరణ సాధ్యమైన, సులభమైన, సూటి అయిన రమణబోధను, దాని ప్రభావాన్ని, ప్రయోజనాన్ని వివిధ కోణాల నుంచి పరామర్శించే మలిభాగం “జగద్గురు రమణ”. త్వరలో దానినీ పూర్తి చేయాలని కోరిక.

కొత్త పుస్తకం వివరాలకోసం :
దుర్గా పబ్లికేషన్స్, 9347015506

సుప్రీంకోర్టు రాజ్యాంగపరమైన హద్దు దాటి ఏకంగా భారత రాష్ట్రపతికే డైరెక్షను ఇవ్వటాన్ని మాన్య ఉపరాష్ట్రపతి గారు బహిరంగంగా అధ...
23/05/2025

సుప్రీంకోర్టు రాజ్యాంగపరమైన హద్దు దాటి ఏకంగా భారత రాష్ట్రపతికే డైరెక్షను ఇవ్వటాన్ని మాన్య ఉపరాష్ట్రపతి గారు బహిరంగంగా అధిక్షపించిన నేపథ్యంలో రాజ్యాంగ మూల స్తంభాల నడుమ ఘర్షణలు, వాటి పూర్వాపరాల గురించి, ఈ సంఘర్షణలో ఇమిడి ఉన్న మౌలిక అంశాలు గురించి భక్తి వన్ చానెల్ తరఫున మదన్ గుప్తా గారు నెల కింద నాతో చేసిన ఇంటర్వ్యూ ఇది.

⚖️ An Honest Take on Indian Judiciary by MVR SastryIn this exclusive and thought-provoking interview, senior journalist and public intellectual MVR Sastry sp...

"ఆర్తనాదములు శ్రవణానందకరముగా  ఉన్నవి" అని మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు అన్న మాట గుర్తొచ్చింది ఈ కమ్యూనిస్టు "మహామేధావి"...
17/02/2025

"ఆర్తనాదములు శ్రవణానందకరముగా ఉన్నవి" అని మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు అన్న మాట గుర్తొచ్చింది ఈ కమ్యూనిస్టు "మహామేధావి" రోదన చూస్తే .......
కమ్యూనిస్టు పార్టీయే కాదు, అంతకు నలభై ఏండ్ల ముందు పుట్టిన జాతీయ కాంగ్రెస్‌ ‌కూడా తమ ప్రయాణం గురించి చర్చించుకోవాలి. నలభైఏండ్లనాటి తెలుగుదేశం, పాతికేళ్లనాటి బిఆర్‌ఎస్‌ ‌కూడా తమ భవిష్యత్‌ ‌చిత్రపటాన్ని దర్శించుకోవాలి. ఇప్పుడు సర్పయాగం నడుస్తున్నది, నాగులకే కాదు, వారి రక్షకులకు, సహబాధితులకు కూడా రక్షణ ఉండదు…

సరిగ్గా వందేళ్ల కిందట ఆర్‌ ఎస్‌ఎస్‌, ‌కమ్యూనిస్టు పార్టీ ఒకేసారి ప్రయాణం ప్రారంభించాయి కదా, ఇప్పుడు వాళ్లెక్క....

09/02/2025

Every Hindu warrior should unequivocally condemn the concerted attack on Sri CS Rangarajan , High priest of Chilukur Balaji Temple in Greater Hyderabad. Though the Sikhandis used to hit firebrand Rangarajan are Hindus by name, it is a clear assault by Anti Hindu ecosystem .

09/02/2025

ఫిబ్రవరి 7 వ తేదీన చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణంలోని నివాస గృహంలో ఆలయ అర్చకులు, వాక్ పత్రిక సంపాదకులు, దేవాలయ వ్యవస్థ పరిరక్షణ ఉద్యమ మ నాయకులు శ్రీ సి.ఎస్.రంగరాజన్ గారిపై దాడి‌ని హిందూ సమాజం మీద,హిందూ దేవాలయ వ్యవస్థ మీద పథకం ప్రకారం జరిగిన దాడిగా పరిగణించాలి. భ్రష్ట హిందువులను ఉసి కొలిపి శిఖండులుగా ప్రయోగించిన హిందూ వ్యతిరేక దుష్టశక్తి ఏది, దాని ఎజెండా ఏమిటి అన్నది బట్టబయలు చేసేందుకు అవశ్యం కార్యోన్ముఖం కావాలి. ప్రతి హిందువూ, ప్రతి ధర్మ‌వీరుడూ, ప్రతి హైందవ సంస్థా బద్ధకం వీడి, అందరికీ పొంచివున్న పెనుముప్పు ను గుర్తెరిగి , రంగరాజన్ గారికి బాసటగా నిలవాలి. తొలి గురి అయినది తాము కాదు లెమ్మని ఎవరికి వారు ఉపేక్షించి ఉదాసీనంగా ఉంటే తరువాయి గురి తామే కావొచ్చు. ఇది గ్రహించి సకాలంలో సంఘటితమై సమైక్యంగా నిలబడితే అందరికీ మేలు.

మన హిందూ వ్యతిరేక రాజ్యాంగం గురించి మొన్నటి రిఫ్లెక్షన్ కాంక్లేవ్ లో నా ప్రసంగం ఈ వీడియోలో 9గంటల 53 నిమిషాల తర్వాత
05/02/2025

మన హిందూ వ్యతిరేక రాజ్యాంగం గురించి మొన్నటి రిఫ్లెక్షన్ కాంక్లేవ్ లో నా ప్రసంగం ఈ వీడియోలో 9గంటల 53 నిమిషాల తర్వాత

LIVE: Reflection Conclave Sanathana 2.0 2025 | Amogh Deshapathi | ReflectionJoin this channel to get access to perks:https://www.youtube.com/channel/UCvzkmYk...

30/01/2025
27/01/2025

Address


Alerts

Be the first to know and let us send you an email when Unnamaata posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share