10/07/2025
సత్యం 1970 జూలై 10న చావలేదు. సత్యానికి చావు లేదు. కురుపాం కొండల్లో ఒరిగిపోయిన సత్యం దేశమంతా పునర్జీవిస్తూనే ఉన్నాడు. ఈ ఐదు దశాబ్దాలలో తిరిగి తిరిగి పునర్జీవితం సాధిస్తూనే ఉన్నాడు. సత్యం ఫీనిక్స్ పక్షిలా చితాభస్మంలోంచి పదే పదే రెక్క విప్పుతూనే ఉంది. యాబై ఏళ్ల కిందటి పాలకులు మాత్రమే కాదు, ఈ యాబై ఏళ్లలో అనేక మంది పోలీసు అధికారులు, మంత్రులు, హోం మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ప్రచారసాధనాల వ్యాఖ్యాతలు సత్యం మరణించాడని, సత్యం ఇక రాడని, మరణశాసనాలు రాస్తూనే ఉన్నారు. కాని సత్యం చావలేదు, సత్యానికి చావు లేదు. దోపిడీ పీడనలు ఉన్నంతవరకూ ఆ దోపిడీ పీడనల మీద ప్రజాపోరాట సత్యం నిత్య చిరంజీవి.
సరిగ్గా యాబై సంవత్సరాల కింద ఈ రోజున శ్రీకాకుళ విప్లవోద్యమ నిర్మాతలు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – ల.....