Overseas News Live

  • Home
  • Overseas News Live

Overseas News Live Overseas News [P] Ltd is a multi platform News and information media company and Digital collection

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి పుష్పాంజల...
02/10/2025

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.

స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సాయంత్రం దసరా వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య...
02/10/2025

స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సాయంత్రం దసరా వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Chief Secretary Sri K.Ramakrishna Rao held a Teleconference with officials.
25/09/2025

Chief Secretary Sri K.Ramakrishna Rao held a Teleconference with officials.

రూ. 525.36 కోట్లతో మున్నేరుకు రిటైనింగ్ నిర్మాణం - పనుల ప్రగతిని రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్న మంత్రులు పొంగులేటి శ్...
25/09/2025

రూ. 525.36 కోట్లతో మున్నేరుకు రిటైనింగ్ నిర్మాణం - పనుల ప్రగతిని రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు .

HONOURABLE CHIEF MINISTER SHRI REVANTH REDDY - MEDARAM VISIT - REVIEW OF TEMPLE DEVELOPMENT WORKS. Date: 23-09-2025
23/09/2025

HONOURABLE CHIEF MINISTER SHRI REVANTH REDDY - MEDARAM VISIT - REVIEW OF TEMPLE DEVELOPMENT WORKS. Date: 23-09-2025

HONOURABLE CHIEF MINISTER SHRI REVANTH REDDY - MEDARAM VISIT - REVIEW OF TEMPLE DEVELOPMENT WORKS. Date: 23-09-2025.
23/09/2025

HONOURABLE CHIEF MINISTER SHRI REVANTH REDDY - MEDARAM VISIT - REVIEW OF TEMPLE DEVELOPMENT WORKS. Date: 23-09-2025.

నవరాత్రి & బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్, శ్రీమతి నేరెళ్ళ శారద గారి ఆదేశాల మేరకు మహిళా కమీషన...
22/09/2025

నవరాత్రి & బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్, శ్రీమతి నేరెళ్ళ శారద గారి ఆదేశాల మేరకు మహిళా కమీషన్ ఆధ్వర్యంలో "కూతుళ్ల భద్రత – కూతుళ్ల విద్య" అనే అవగాహన కార్యక్రమాన్ని అన్నోజిగూడ, ఘటకేసర్ మండలం , మేడ్చల్ జిల్లాలో ఘనంగా నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో శ్రీమతి ఈశ్వరి భాయి,మహిళా కమీషన్ మెంబర్ గారు ముఖ్య అతిథిగా హాజరై సమాజంలో బాలికల రక్షణ, బాలికలకు నాణ్యమైన విద్య అందించడంపై అవగాహన కల్పించారు. బాలికలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మహిళా కమిషన్ సెక్రటరీ, పద్మజ రమణ గారు మాట్లాడుతూ –
కూతుళ్లను భద్రంగా, సమాన హక్కులతో చదివించడం ప్రతి కుటుంబం కర్తవ్యమని,
విద్య ద్వారానే బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలరని,చట్టపరమైన రక్షణలు, 181 , 100 హెల్ప్‌లైన్ సదుపాయాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలియజేశారు.
మరియు ఈ కార్యక్రమంలో షి టీమ్ అధికారులు మహిళలు మరియు బాలికలకు సైబర్ సేఫ్టీ మరియు సామాజిక మాధ్యమాల వినియోగం మీద అవగాహన కలిగించారు అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ గారు మహిళలు మరియు బాలికలకు ఎటువంటి పోషకాహరం తీసుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత ,మరియు ఆరోగ్యం పైన అవగాహన కలిగించారు.
నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలు మహిళా శక్తి, ఆడబిడ్డల ప్రాధాన్యతకు ప్రతీకలని, ఈ సందర్భంలో సమాజం మొత్తం కూతుళ్ల భద్రత, విద్యకు కట్టుబడాలని మహిళా కమిషన్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో షి టీమ్,మెడికల్ ఆఫీసర్,అంగన్వాడీ టీచర్స్ , ఆడాల్సెంట్ గర్ల్స్ , మహిళలు మరియు అల్వాల్ సి డి పి ఓ, శ్రీమతి స్వాతి, ఐసీడీఎస్ supervisors, మహిళా కమీషన్ అధికారులు పాల్గొనడం జరిగింది.

His Excellency Mr. Azamat Yeskarayev, Ambassador of the Republic of Kazakhstan to the Republic of India, along with memb...
19/09/2025

His Excellency Mr. Azamat Yeskarayev, Ambassador of the Republic of Kazakhstan to the Republic of India, along with members of his delegation, called on the Hon’ble Governor of Telangana, Shri Jishnu Dev Varma, at Raj Bhavan, Hyderabad, today.

During the courtesy meeting, avenues to further strengthen bilateral relations and enhance cooperation across various sectors of mutual interest were discussed.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తండ్రి స్వర్గీయ ఎన్. పురుషోత్తం రెడ్డి గారి “సంవత్సర విమోకం” కార్యక్రమానికి హాజరైన ముఖ్...
19/09/2025

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తండ్రి స్వర్గీయ ఎన్. పురుషోత్తం రెడ్డి గారి “సంవత్సర విమోకం” కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం. తేదీ: 18-09-2025.

A British delegation led by High commissioner Lindy Cameron meets CM Revanth Reddy. Date: 18-09-2025.
19/09/2025

A British delegation led by High commissioner Lindy Cameron meets CM Revanth Reddy. Date: 18-09-2025.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేసిన మిర్యాలగూడ ఎంఎల్ఏ బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యు...
19/09/2025

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేసిన మిర్యాలగూడ ఎంఎల్ఏ బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులు. తేదీ: 18-09-2025.

Date: 17-09-2025. తెలంగాణ విద్యా విధానం పైన బుధవారం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.  హాజర...
18/09/2025

Date: 17-09-2025.
తెలంగాణ విద్యా విధానం పైన బుధవారం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హాజరైన కమిటీ సభ్యులు కె కేశవ రావు, ఆకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాల కిష్టా రెడ్డి. ఎంఎల్సీ లు కోదండరాం, శ్రీపాల్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, మల్క కొమరయ్య, విద్యావేత్తలు, అన్ని యూనివర్సిటీ ల వైస్ చాన్సలర్స్ లు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఉన్నతాధికారులు.
తెలంగాణ నూతన విద్యా విధానం సమీక్ష లో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్..
 విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది..
 నూతన పాలసీ వల్ల విద్యా విధానం లో మార్పు లతో పాటు పేదరిక నిర్మూలన జరగాలి..
 గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయి
 ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదు..
 ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు
 వారిలో 15 శాతం మంది కి మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు..
 విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతుంది..
 విద్యా శాఖకు 21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుంది ..
 పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం..
 విద్యా విధానం లో సమూల మార్పులు తీసుకురావడమే నా ధ్యేయం..
 అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వాలి..
 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా లక్ష్యం..
 దేశ విద్య విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలి..
 పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక బద్దంగా పనిచేయాలి..
 స్కూల్ ఎడ్యుకేషన్ లో లోపాలు ఉన్నాయి..
 11 వేల ప్రైవేట్ స్కూల్స్ లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు..
 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు..
 విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్.ఆర్.బీ.ఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరాను..
 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలి..
 విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా నేను సిద్ధం..
 నూతన విద్యా విధానం పైన విద్యా వేత్తలు, నిపుణులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, ఎంఎల్సీ ల అభిప్రాయాలను తెలుసుకున్న సిఎం.

Address


Alerts

Be the first to know and let us send you an email when Overseas News Live posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share