13/08/2024
#జిల్లా_మంత్రులకు_AMRP_ద్వారా_సాగు_నీరిచ్చే_సోయిలేదు: #మాజీ_ఎంఎల్ఏ_కంచర్ల_భూపాల్_రెడ్డి.
AMRP కాలువ ద్వారా.. సాగు నీటి విడుదల చేయాలంటూ.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలో.. నల్లగొండ, కనగల్, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాలకు డి25, డి37, డి39, డి40 కాలువలకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. ఏడాది కాలంగా.. AMRP కాల్వ ద్వారా నియోజకవర్గ రైతులకు సాగునీరు అందలేదని.. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టు ద్వారా వందల టీఎంసిల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నా.. AMRP కాలువల ద్వారా. సాగునీరు అందించడం లేదన్నారు. ఇప్పటికే రైతులు నారుమళ్లు పోసుకున్నరని.. వారంతా ఆందోళనలో ఉన్నారన్నారు. సీజన్ కు ముందే పంపు రిపేర్లున్న.. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారులు అలసత్వం తో తీవ్ర జాప్యం చేశరన్నారు. ఆగస్టు రెండో వారం వచ్చినా.. ఇంతవరకు సాగు నీటి విడుదల చేయలేదని.., జిల్లాకు చెందిన మంత్రులు చోద్యం చూస్తున్నారని.. స్థానిక మంత్రి విదేశాలలో కాలం గడుపుతున్నారని ఆరోపించారు.
Sharat Reddy Kancharla II