
06/08/2025
ఘర్షణలు జోలికి వెళ్తే చర్యలు తప్పవు - అనంతపురం డీఎస్పీ వెంకటేశ్వర్లు
పుట్లూరు మండలం సంజీవపురం గ్రామంలో జరిగిన ఘర్షణపై అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. డీఎస్పీ కార్యాలయంలో ఘర్షణ పడ్డ వారిని పిలిపించి ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పుట్లూరు, ఎల్లనూరు సీఐ సత్యబాబు, ఎస్సైలతో గ్రామాల్లోని పరిస్థితులపై ఆరా తీశారు.