Telugu Film Directors Association

  • Home
  • Telugu Film Directors Association

Telugu Film Directors Association Stay tuned

TFDA is a platform where you get to know about the film director updates, movie information, film making, direction information and more...
Stay connected with our FB page to have a track on our activities and updates!

థాట్ టు థియేటర్ - స్క్రీంప్లే రైటింగ్ వర్క్షాప్ - శ్రీ కోన వెంకట్ గారు, రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ https://www.youtube....
30/08/2026

థాట్ టు థియేటర్ - స్క్రీంప్లే రైటింగ్ వర్క్షాప్ - శ్రీ కోన వెంకట్ గారు, రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్

https://www.youtube.com/watch?v=y0UGwMS8Km0

TFDA ఆధ్వర్యంలో మన సభ్యుల కోసం 23 ఆగస్ట్ 2026 న ఫిల్మ్ ఛాంబర్ లో ఉదయం 10 నుండి సాయంత్రం 7 వరకు ‘థాట్ టు థియేటర్ - స్క్రీంప్లే రైటింగ్’ పైన వర్క్ షాప్ శ్రీ కోన వెంకట్ గారు, రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారి ద్ర్వార నిర్వహించబడినది.

TFDA అధ్యక్షులు శ్రీ VN ఆదిత్య గారు, జనరల్ సెక్రటరీ శ్రీ రామారావు గారు, మిగతా కమిటీ సభ్యులతో పాటుగా ప్రముఖ రచయిత శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు తదితరులు ఈ వర్క్షాప్ లో పాల్గొన్నారు. ఉదయం 10 కి ప్రారంభమైన ఈ వర్క్ షాప్ లో అందరూ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని లంచ్ అనంతరం జరిగిన Q&A session లో కూడా అంతే ఉత్సాహంగా పాల్గొని తమకు కలిగేలా సందేహాలను నివృత్తి చేసుకున్నారు .

అనంతరం ప్రముఖ రచయిత నటులు దర్శకులు శ్రీ తనికెళ్ళ భరణి గారు తాను నిర్దేశకత్వం వహించిన సూపర్ సక్సెస్ వహించిన ‘మిథునం’ సినిమా పై రాసిన పుస్తకాన్ని మనసభ్యులకు పంపిణీ చేసారు. ఈ పుస్తకాలకు అయినా ఖర్చుతోపాటు, ఈ వర్క్ షాప్ కి భోజనాలకు అయిన మొత్తం ఖర్చును TFDA అధ్యక్షులు శ్రీ VN ఆదిత్య గారు తన సొంతంగా వితరణ చేసారు…. సభ్యుల అభివృద్ధికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు తన సొంత టీమ్ కోసం చేసినట్లుగా భావించి చేస్తున్న అధ్యక్షులు ఉండటం ఎంతో గర్వకారణం…. మున్ముందు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను TFDA చేపట్టాలని హాజరైన సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు…

పదహారేళ్ల వయసుకు మాతృక అయినా 16 వయతినిలే, ఎర్రగులాబీలు వంటి అనేక సినిమాలు తీసి కొత్త తరం నటులను సృష్టించిన వెటరన్ లెజెండ...
10/06/2026

పదహారేళ్ల వయసుకు మాతృక అయినా 16 వయతినిలే, ఎర్రగులాబీలు వంటి అనేక సినిమాలు తీసి కొత్త తరం నటులను సృష్టించిన వెటరన్ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూశారు…
ఆయన వయసు 84… కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు….

16 వయతినిలే ఆయన తొలి సినిమా…

భారతి రాజాగారి సినిమాలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి సినిమా ఫీల్డ్ కి డైరెక్షన్ కోసం వచ్చిన మాట వాస్తవం …
పదహారేళ్ల వయసు ఒరిజినల్ గా ఈయనే తీశారు అని తెలుసుకున్న వెంటనే అభిమానినయ్యాను…

భారతి రాజా ఎన్నో ఎక్స్పేరిమెంట్స్ చేశారు… ఆరోజుల్లోనే సైకలాజికల్ థ్రిల్లర్స్ తీసి యువతను ఉర్రూతలూగించారు…
రజని కమల్ శ్రీదేవికి స్టార్డం ఇచ్చిన వారిలో ఈయనే ప్రథముడు…
6 జాతీయ అవార్డులు 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు 4 ఫిలింఫేర్ అవార్డులు ఇంకా ఎన్నో అవార్డులు ఆయనను సత్కరించుకున్నాయి.
భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సన్మానించింది

ఆయన మంచి నటుడు కూడా…
తూరుపువెళ్లే రైలు కి తమిళ మాతృక కూడా ఈయనే తీసారు… ఈయన కేవలం గ్రామీణ జీవితాలనే చిత్రీకరిస్తారు అనే అపవాదును చెరిపెయ్యడానికి ఎర్రగులాబీలు అనే సైకాలజికల్ థ్రిల్లర్ పూర్తి అర్బన్ లైఫ్ ని ప్రతిబింబిస్తూ తీశారు ఆ తర్వాత టిక్ టిక్ టిక్ తీసి యువతని ఉర్రూతలూగించారు…

నిలాల్గల్ - నీడలు అనే సినిమా తో ఈయన పరిణితి పైన అందరికీ అనుమానాలు పోయాయి … ఆత్మబంధువు తో సున్నితమైన మానసిక, మానవీయా కోణాలను కూడా అంతే ప్రతిభతో చిత్రించగలరు అనేది నిశ్చయం అయింది.

తెలుగులో డైరెక్టుగా సీతాకొక చిలకలు కొత్త జంటతో తీసి సృజనకు భాష భేదాలు ఎల్లలు కేవు అని నిరూపించుకున్నారు. దీనికి జాతీయ వుత్తమా చిత్రం అవార్డుతో పాటుగా 5 నందులు కూడా దక్కాయి.

ఆరాధన - చిరంజీవి, సుహాసిని, జమదగ్ని, కొత్తజీవితాలు, యువతరం పిలిచింది, ఈతరం ఇల్లాలు వంటివి ఆయన నేరుగా తెలుగులో డైరెక్టు చేసిన సూపర్హిట్ సినిమాలు ….

భానుమతి బాలయ్య బాబు కాంబినేషన్ లో వచ్చిన సూపర్హిట్ సినిమా మంగమ్మగారి మనుమడు కి కథను అందించారు… అలాగే రాజశేఖర్ నటించిన పల్నాటి పౌరుషం సినిమాకి స్క్రీంప్లే అందించారు…

భారతీయ సినిమాకి పేరుప్రతిశలు తెచ్చిన దర్శకులలో ముందువరుసలో తప్పకుండా వుంటారు… భారతీరాజా సినిమాలు ఫిల్మ్ స్టూడెంట్స్ కి రీసెర్చ్ మెటీరియల్ అనడంలో సందేహం లేదు …
ముఖ్యంగా స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ టెక్సినికాలిటీస్ తప్పనిసరి పాఠాలు…

మేటి దర్శకులు తన మార్క్ ని వదిలి తరలి పోయారు….
శ్రద్ధాంజలి

సద్గతి ప్రాప్తిరస్తు

- ప్రియదర్శిని

09/05/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర మరియు టెలివిజన్ పరిశ్రమల అభివృద్ధి కమిషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ భరత్ భూషణ్ గారికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీ.ఎన్. ఆదిత్య,
ప్రధాన కార్యదర్శి పీ.వీ.రామారావు, కోశాధికారి నీలం సాయి రాజేష్ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. వారి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా చలనచిత్ర పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.

04/05/2026

Mana TFDA సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి ఇదే మా కమిటీ ఆహ్వానం 🙏🏻

Happy Birthday Director   Garu.
31/03/2026

Happy Birthday Director Garu.

A union of forces comes together for a storm of epic proportions 💥💥  brings together the man with a following of boundle...
30/03/2026

A union of forces comes together for a storm of epic proportions 💥💥

brings together the man with a following of boundless madness and National Award winning Blockbuster Filmmaker ❤️‍🔥❤️‍🔥

shoot begins in April.

Hero   looks simply stunning as he joins media along with his team in a bus to launch   First Single at Allu Cinemas, HY...
30/03/2026

Hero looks simply stunning as he joins media along with his team in a bus to launch First Single at Allu Cinemas, HYD ❤️

Vibe 🎧

మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు 🙏✨️
27/03/2026

మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు 🙏✨️

19/03/2026

అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
19/03/2026

అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

Address


Opening Hours

Monday 10:00 - 18:00
Tuesday 10:00 - 18:00
Wednesday 10:00 - 18:00
Thursday 10:00 - 18:00
Friday 10:00 - 18:00
Saturday 10:00 - 18:00

Telephone

+914023743414

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Film Directors Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telugu Film Directors Association:

Shortcuts

  • Want your business to be the top-listed Media Company?

Share