All India Radio News Hyderabad

  • Home
  • All India Radio News Hyderabad

All India Radio News Hyderabad Official Page of All India Radio News, Hyderabad Official account of Regional News Unit Hyderabad, All India Radio News

హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఐటీ, పరిశ్రమల...
12/08/2025

హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి Duddilla Sridhar Babu స్వాగతించారు. సీబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.

12/08/2025

చందానగర్ లోని ఓ బంగారం నగల దుకాణంలో కాల్పులు కలకలం రేపాయి. ఉదయం పదిన్నర గంటల సమయంలో ఆరుగురు దుండగులు షాపు లోపలికి వచ్చి మేనేజర్ పై కాల్పులు జరిపారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. ఒక రౌండ్ బుల్లెట్ మేనేజర్ శరీరంలోకి ఇంకో రౌండ్ బులెట్ షోరూం రూఫ్ లోకి దూసుకెళ్లిందని కమిషనర్ వెల్లడించారు.

12/08/2025

నీటిపారుదల శాఖలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ విభాగాన్ని బలోపేతం చేయాలని, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పలు సూచనలు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, ప్రాజెక్ట్ డిజైన్ల కోసం సమయపాలనను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున రహదారులను అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu తెలిపారు. హైదరాబాద్ హైటెక్స...
12/08/2025

రాష్ట్రంలో పెద్ద ఎత్తున రహదారులను అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమంలో హైబ్రిడ్ యాన్యుటి మోడల్ ( ) విజన్ డాక్యుమెంట్ ను ఉప ముఖ్యమంత్రి విడుదల చేశారు. ప్రతి గ్రామాన్ని మండల కేంద్రానికి, ప్రతి మండలాన్ని జిల్లా కేంద్రానికి, ప్రతి జిల్లాను రాష్ట్ర రాజధానికి కలిపే విధంగా రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. తెలంగాణ రైజింగ్ లో కాంట్రాక్టర్లు భాగస్వాములు కావాలని, హ్యామ్ రోడ్డు పనుల్లో చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తామన్నారు.

మంచిర్యాల జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఇంచార్జీగా విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాస్ ఓ రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన 2...
12/08/2025

మంచిర్యాల జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఇంచార్జీగా విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాస్ ఓ రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన 2డీఏల నిధులు విడుదల కోసం 6000లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ డిఎస్పి మధు అధికారులు లంచాల పేరుతో వేధిస్తే తమను సంప్రదించాలని కోరారు.

79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏటూరునగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా...
12/08/2025

79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏటూరునగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బస్ స్టాండ్ వరకు హర్ గర్ తీరంగా ర్యాలీ నిర్వహించారు.

Source : PTC

12/08/2025

సంగారెడ్డిలోని సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక, కార్మిక, బాయిలర్స్ విభాగాల నుంచి ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం మొదటగా సంగారెడ్డి జిల్లాలోని హై రిస్క్ పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టనుంది.

BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు సహా పలువురు పార్టీ నేతలను ఈ ఉదయం గృహ నిర్బంధం చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. బం...
12/08/2025

BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు సహా పలువురు పార్టీ నేతలను ఈ ఉదయం గృహ నిర్బంధం చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. బంజారాహిల్స్‌ లోని పెదమ్మ గుడికి సంబంధించి కొన్ని సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు తనను గృహనిర్బంధం చేశారని రామచంద్ర రావు మీడియాకు వెల్లడించారు.

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ  వెల్లడించింది. పలు జిల్ల...
12/08/2025

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

దళితుల భూముల ఆక్రమణలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామ్ చందర్ సూచించార...
12/08/2025

దళితుల భూముల ఆక్రమణలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామ్ చందర్ సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ, భూవివాదాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, దళితులపై అన్యాయం జరిగితే కమిషన్ తక్షణ న్యాయం అందిస్తుందన్నారు.

 11.165 కి.మీ.ల పొడవుతో లక్నో మెట్రో రైలు ప్రాజెక్టు దశ-1బికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదంMinistry of Information & Broadcas...
12/08/2025


11.165 కి.మీ.ల పొడవుతో లక్నో మెట్రో రైలు ప్రాజెక్టు దశ-1బికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం
Ministry of Information & Broadcasting, Government of India
Press Information Bureau - PIB, Government of India

 దేశంలో నాలుగు కొత్త సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం.ఏపీ సహా ఒడిశా, పంజాబ్‌లో సెమ...
12/08/2025


దేశంలో నాలుగు కొత్త సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం.
ఏపీ సహా ఒడిశా, పంజాబ్‌లో సెమీ కండక్టర్‌ యూనిట్లను ఏర్పాటు రూ.4,594 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి Ashwini Vaishnaw మీడియాకు వెల్లడించారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when All India Radio News Hyderabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share