24/08/2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం
విజయవాడ
పత్రికా ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి వచ్చిన విషయమేమనగా, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలకు జరగనున్న 2వ సాధారణ ఎన్నికలకు సంబంధించిన తేదీలు మరియు షెడ్యూళ్లతో కూడిన తప్పుడు, తప్పుదారి పట్టించే వార్తలు/సమాచారం వాట్సాప్ ద్వారా ప్రచారం చేయబడుతున్నది. ఈ సమాచారం శాఖ/సంస్థ పేరుతో, అధికారిక అనుమతి లేకుండా అధికారిక చిహ్నాలను ఉపయోగించి ప్రచారం చేయబడుతున్నట్లు గమనించబడింది. దీంతో ప్రచారంలో ఉన్న సమాచారం నిజమైనదా కాదా అనే విషయంపై వివరణ కోరుతూ వివిధ వర్గాల నుంచి కమిషన్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
ఇది స్పష్టంగా తెలియజేయబడుతున్నది ఏమనగా, పై సమాచారం నకిలీది, ధృవీకరణ లేనిది మరియు అసలైనది కాదు. ప్రజలు ఇలాంటి ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని లేదా ఇతరులకు షేర్ చేయవద్దని కోరుతున్నాము. తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించే, ప్రచారం చేసే లేదా వ్యాప్తి చేసే వ్యక్తులపై వర్తించే సైబర్ చట్టాలు/నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి.
ఎన్నికలకు సంబంధించిన ఏదైనా నిజమైన మరియు అధికారిక సమాచారం కమిషన్ అధికారిక పత్రికా ప్రకటన/సమావేశం ద్వారా మాత్రమే ప్రజలకు తెలియజేయబడుతుంది. అనధికారిక వనరులు లేదా సోషల్ మీడియా వేదికల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని అధికారికమైనదిగా పరిగణించరాదు. ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించి, ధృవీకరించబడిన అధికారిక సమాచారంపైనే ఆధారపడాలని సూచించబడుతున్నారు.
అందువల్ల, ప్రజలు మరియు మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోవాలని, తదుపరి సమాచారం కోసం అధికారిక పత్రికా ప్రకటన/సమావేశం కోసం వేచి ఉండాలని కోరుతున్నాము.
తేదీ: 24.08.2026
అనిల్ చంద్ర పునేథా, IAS (Retd)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్
ఆంధ్రప్రదేశ్