28/10/2022
ప్రధాని ..*నరేంద్ర మోడీ పర్యనట ఎవరికి లాభం*
నవంబర్ 11 న ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ కు బిజెపి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది .ఈ పర్యటన కోసం అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.ఒక ప్రక్క తెలంగాణ లో మునగోడ్ ఉప ఎన్నిక ఫలితం అనంతరం అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు హిట్టెక్కి మారుతున్న పరిణామాలు నేపథ్యం లోప్రధాని బహిరంగ సభ జరగటం నిజంగానే అందరకు ఆసక్తి కలగడం సహజమే.ఆంధ్ర లో ఇంకా రెండు సంవత్సర కాలం లో జరిగే ఎన్నికల తరుణం లో పొత్తులు,సమీకరణలు వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న హోం వర్క్ చేస్తున్న వాతావరణం లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ఎవరికి లాభం చేకూరుతుంది అని రాజకీయ విశ్లేషకులు కసరత్తు చేస్తున్నారు.ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి కి మిత్ర పక్ష మైన జన సేన కు ఈ మీటింగ్ కొంత హుషారు చెప్పించినా రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ప్రస్ఫుటం గా కనిపిస్తుంది...
*టిడిపి - జన సేన - బిజేపి*
కలిసి పోటీ చేస్తుందా...!
ఇప్పటికే జన సేన పార్టీ టిడిపి తో పొత్తు పెట్టుకొని అలాగే బిజేపి తో కలుపు కొని ఎన్నికల బరిలో దిగాలని యెత్తు గడలు చేస్తుండగా... బీజేపీ మాత్రం చీమ కుట్టి నట్లు కూడా అనిపించటం లేదు.పవన్ కళ్యాణ్ కు మాత్రం ఎట్టి పరిస్థతుల్లోనైనా తెలుగు దేశం తో పొత్తు పెట్టు కొని ప్రయాణం చేయాలని భావిస్తుండగా..జన సేన లో ఎక్కువ శాతం క్యాడర్ మాత్రం తెలుగు దేశం తో జత కట్టడం ఇష్టం లేనట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే బీజేపీ తెలుగు దేశం ను ఇప్పటికీ తన శత్రువు గానే చూస్తుంది.గత 2014 ఎన్నికల టిడిపి కి మద్దతు ఇచ్చినా తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో బిజేపి అగ్ర నేత అమిత్ షా మీటింగ్ పై దాడి చేయించటం లాంటి అంశాలు బిజేపి శ్రేణుల్లో తెలుగు దేశం పై కోపం తగ్గ లేదు. అలాగే తెలుగుదేశాన్ని ఈ రాష్ట్రం లో బలహీన పర్చాలని ఎత్తు గడలో ఉంది. ఈలాంటి రాజకీయ సంక్లిష్ట పరిస్థితుల్లో రేపు ప్రధాని మోడీ వైజాక్ లో అయన ప్రసంగం ఎలా ఉండ బోతుంది..అన్ని పార్టీలలో ఒకంత టెన్షన్ వాతావరణం ఉంది..
*తెలుగుదేశంకు పొత్తు పై క్లారిటీ వచ్చిందా?*
రేపు ఏపి లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం తప్పనిసరిగా జన సేన తో పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.తెలుగు దేశం ఒంటరిగా పోటీచేస్తే తన బలం సరిపోదని సీనియర్లు సైతం చంద్ర బాబు చెపుతున్నారు.అయితే బిజేపి తో కూడా సయోధ్యా గా ఉంటూ అడుగులు వేస్తుంది.బిజేపి నాయకత్వం తెలుగుదేశం తో కలిసి పోటీ చేస్తానని ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా కూడా ప్రెస్ మీట్ లలో చెప్పటం లేదు.చంద్రబాబు మాత్రం బిజేపి నీ కూడా ఒప్పెంచే పనిలో ఉండి తన రాజకీయ చతురత తో అడుగులు వేస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ప్రధాని మోడీ రేపు 11 న జరిగే సభలో పొత్తులపై ఒక క్లారిటీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.సీనియర్ రాజకీయ పరిశీలకులు మాత్రం బిజేపి తెలుగు దేశం తో జట్టు కట్టటానికి ఆసక్తి కనిపించటం లేదని దీనికి కారణం ప్రధాని మోడీ సీఎం జగన్ కు అంతర్గతం గా అండ గా ఉంటూ రాజకీయాలు నడుపుతున్నారని చెపుతున్నారు.
*వైసీపీ వ్యూహం ఏమిటి*
వైస్సార్ పార్టీ మాత్రం తెలుగుదేశం,జన సేన ఎలాంటి అడుగులు వేస్తుంది..వారి ఎత్తుగడలు ఏమిటి..లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి తో వ్యూహరచన చేస్తుంది.ఒకవేళ బిజేపి,జన సేన,టిడిపి కలిసి పోటీ చేస్తే..ఈ సారి ఒంటరి పోరుకు సిద్ధం అయ్యే ఆలోచన కనిపించటం లేదు..కొత్త ఎత్తు గడలు తో ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది..చూద్దాం ఏమి జరుగుతుందో..