28/07/2025
🙏 మనకు మధ్యే ఉన్న మానవత్వ దేవుడు – బిజ్జల నగేశ్ గారు! 🙏
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆళ్లగడ్డకు చెందిన బిజ్జల నగేశ్ గారు…తండ్రిని చిన్నతనంలోనే కోల్పోయి, తల్లిని హమాలీ కూలి పనితో పోషిస్తూ, తానూ జీవన పోరాటంలో నడుస్తూనే మానవత్వ మార్గాన్ని ఎంచుకున్న ఒక అరుదైన వ్యక్తి.
👉 గత పది సంవత్సరాలుగా సమాజానికి తన వంతు సేవ చేయాలని, తన సంపాదనలోంచే చిన్న చిన్న సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు.ఈ నిబద్ధతతోనే "అమ్మ సేవా సమితి" అనే సంస్థను స్థాపించి—
✅ కుష్టురోగులు✅ మతిస్థిమితం లేని వృద్ధులు✅ ఆకలితో ఉన్న నిరుపేదలు✅ హెచ్ఐవి బాధితులకుసహాయం చేస్తూ, వారిని తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
✅ఎన్నో అనాధ శవాలను తన సొంత ఖర్చులతో దహన కార్యాలు చేయించి వారి ఆత్మ శాంతికి కారకుడయ్యాడు
🚐 తన స్వంతంగా ఒక ఆటో కొనుగోలు చేసి, గర్భిణీ స్త్రీలకు ఉచిత రవాణా అందించడం,🧣 చలికాలంలో అభాగ్యులకు దుప్పట్లు పంచడం,🍛 ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం వంటి అనేక రూపాల్లో సేవ చేస్తున్నాడు.
🌟 2025 సంక్రాంతి రోజున, హైదరాబాద్‌కు చెందిన సహారా చారిటబుల్ ట్రస్ట్ వారు నగేశ్ గారిని గౌరవిస్తూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.
🙏 ప్రస్తుతం చుట్టుపక్కల పెద్దలు, అధికారులు, నాయకులు ఆయన్ను సత్కరించి అభినందనలు తెలుపుతున్నారు.
ఇలాంటి నిజమైన సేవకులకు మనమందరం చిరు సహాయం చేస్తే, ఎంతోమందికి జీవితం లో వెలుగు కనిపిస్తుంది.
బిజ్జల నగేష్ ని సంప్రదించాలనుకునే వారు
7569906113 ఈ నెంబర్ పై మాట్లాడండి కలవండి..మీలోని మానవత్వపు హృదయంతో ఇతనికి జతగా తోడు అవ్వండి