
16/08/2025
స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రివర్యులు 150వ జయంతి సందర్భంగా ఆదోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్ల సర్కిలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించడం జరిగింది. ఆదోని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.సాయినాథ్ మాట్లాడుతూ విజయ భాస్కర రెడ్డి గారు కేంద్రంలో ఎన్నో పదువులను పొంది కేంద్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా మచ్చలేని మహా మనిషిగా పేరొందారు అని కొనియాడారు. కర్నూలు జిల్లా పెద్దాయనగా పేరు సంపాదించారన్నారు. కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా రాష్ట్రంలో ఎన్నో సేవలందించారన్నారు..
ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ మునిసిపల్ కౌన్సిలర్ దిలీప్ దోక, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ రావు, యువజన అధ్యక్షులు దేవి శెట్టి వీరేష్,NSUI రాష్ట్ర నాయకులు శ్రీనిథ్, చేతన్ దోక, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాయన్న తదితరులు పాల్గొన్నారు