30/05/2024
నాట్య మయూరి వసుంధర వల్లభనేని || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express ప్రజా నాయకుడు వల్లభనేని వంశీ
కృష్ణాజిల్లా గన్నవరం నేత వల్లభనేని వంశీ కుమార్తె లక్షీవసుంధర వల్లభనేని భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం సాధించింది..చిన్నప్పట్నుంచే భరతనాట్యంపై మక్కువ పెంచుకున్న వసుంధర తల్లిదండ్రులు వల్లభనేని వంశీ , పంకజశ్రీ ప్రోత్సాహంతో భరతనాట్యంలో పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుంది..ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి, శిక్షకురాలైన శ్రీమతి భాగవతుల సౌమ్య ఆధ్వర్యంలో లక్షీవసుంధర భరతనాట్య సాధన ప్రారంభించింది..అనతి కాలంలోనే మంచి ప్రావీణ్యం సాధించిన ఆమె, ఆరంగేట్ర కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసారు..లక్షీవసుంధర భరతనాట్య ఆరంగేట్రం తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు..ఈ సందర్భంగా వసుంధర చేసిన వివిధ రకాల ఘట్టాలను స్ఫురుణకు తెస్తూ నర్తించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది..అందం, అభినయం మేళవింపుతో చూడముచ్చటగా వసుంధర చేసిన భరతనాట్యం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది..తమ కుమార్తె చిన్న వయసులోనే భరతనాట్యంలో రాణించిన తీరు చూసి వల్లభనేని వంశీ దంపతులు మురిసిపోయారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ భరతనాట్యం శిక్షకురాలు, నంది అవార్డు గ్రహీత శ్రీమతి ఇందిరాహేమ, అన్విత గ్రూప్ ఛైర్మన్ బొప్పన అచ్యుతరావు, ప్రముఖ సినీ నిర్మాత నల్లమలుపు బుజ్జి, మాజీ మంత్రి కొడాలి నాని, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..లక్షీ వసుంధర ప్రతిభతో తుమ్మలపల్లి కళాక్షేత్రం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.