28/07/2025
గాజాలో మానవీయ విషాదం: భారత్ తక్షణం స్పందించాలి!
న్యూఢిల్లీ, జూలై 28, 2025:
ప్రెస్ రిలీజ్
భారతదేశంలోని ప్రముఖ ముస్లిం సంస్థలు, మత పండితులు, పౌర సంఘాలు నేడు న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. ఈ సందర్భంగా వారు గాజాలో మానవీయ విపత్తు మరింత ఉద్ధృతమవుతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం ధైర్యమైన, నైతికంగా స్థిరమైన పాత్ర పోషించాలని వారు విజ్ఞప్తి చేశారు.
మీడియాతో మాట్లాడిన వారంతా గాజాలో పరిస్థితిని "అభూతపూర్వ మానవీయ విపత్తు"గా అభివర్ణించారు. “గాజా ఆకలితో చనిపోతోంది. సమయానికి చర్యలు తీసుకోకపోతే అది చరిత్రపరమైన నేరంగా నిలుస్తుంది” అని హెచ్చరించారు.
ప్రస్తుతం 20 లక్షలకుపైగా ప్రజలు తీవ్రమైన ఆకలితో, వైద్య సేవల లేకపోవడంతో, శుభ్రతా సదుపాయాల లేకుండానే బతుకుతున్నారు. 90 శాతం హాస్పిటల్లు బాంబుల దాడులతో ధ్వంసమై మూతపడ్డాయి. పిల్లలూ, బిడ్డలూ ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లు అనస్థీషియా లేకుండా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఇది ఆత్మరక్షణ కాదు – ఇది ప్రజలపై వ్యూహాత్మక విధ్వంసం అని వారు స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితిలో భారత స్థాయి ప్రతినిధి యుద్ధవిరమణపై చేసిన ప్రకటనను వారు స్వాగతించారు. "గాజా కోసం మన దేశం తాజాగా ఇచ్చిన ప్రకటనను మేము హర్షిస్తున్నాం. ఇది స్వతంత్ర పాలస్తీన పట్ల మన నిబద్ధతను తెలియజేస్తోంది" అని పేర్కొన్నారు.
అయితే భారతం కేవలం ఆందోళన వ్యక్తం చేయడం కాక, అంతర్జాతీయంగా నైతిక నాయకత్వాన్ని చేపట్టాలని వారు కోరారు. "పౌరులపై బాంబు దాడులు, ఆసుపత్రులు, పాఠశాలలను లక్ష్యంగా చేసుకోవడం వంటి యుద్ధ నేరాల్ని ఖండించాలి. భారత్‌కు ఈ విధ్వంసాన్ని నిరసించడానికి చరిత్రతో కూడిన ప్రతిష్ట కూడా ఉంది, అంతర్జాతీయ మద్దతు కూడగట్టే సామర్థ్యం కూడా ఉంది" అని వివరించారు.
గాజాకు సహాయం అందించే మానవీయ మార్గాలను వెంటనే ప్రారంభించాలని, ఇజ్రాయెల్‌తో ఉండే అన్ని రకాల సైనిక, వ్యూహాత్మక సహకారాన్ని యుద్ధం పూర్తయ్యే వరకు నిలిపివేయాలని సూచించారు. "భారత్ చరిత్రలో ఎప్పుడూ అణచివేతకు గురైన వారి పక్షంలో నిలిచింది. అదే వారసత్వాన్ని ఇప్పుడు నిలబెట్టాల్సిన సమయం ఇది" అని వారు పేర్కొన్నారు.
పాలస్తీన పట్ల మద్దతు కేవలం ముస్లింల అంశం కాదని, ఇది మానవత్వం, న్యాయం, గౌరవం పట్ల ప్రతి ఒక్కరిదీ బాధ్యత అని వారు అన్నారు. విద్యార్థులు, పౌరులు, మత నాయకులు, ప్రొఫెసర్లు – అందరూ ఫిలిస్తీన్ కోసం తమ స్వరం వినిపించాలని వారు కోరారు.
కొన్ని చోట్ల పాలస్తీన పట్ల మద్దతును అణచివేయడం లేదా నేరంగా పరిగణించడం జరుగుతోందన్న వార్తలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా పట్ల మద్దతు ఇవ్వడం ఉగ్రవాదం కాదు. ఇది మానవహక్కుల, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ. ప్రజలు భయపడకుండా, నిర్బంధం లేకుండా వారి అంతరాత్మ స్వరాన్ని వినిపించే స్వేచ్ఛను కలిగి ఉండాలి" అని అన్నారు.
ఇజ్రాయెల్‌తో ఉన్న సంబంధాలను తెంచి, ఒకతాటిపై ఏర్పడి బర్బర దాడులకు అడ్డుకట్ట వేసే విధంగా ముస్లిం దేశాలనూ వారు కోరారు.
కాన్ఫరెన్స్ చివర్లో గాజాలో తక్షణం యుద్ధవిరమణకు, నిర్బంధంలో ఉన్న ప్రజలకు ఆహారం, నీరు, ఇంధనం, వైద్య సాయం అందించే మానవీయ మార్గాలను సృష్టించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమీయత్ ఉలమా-ఎ-హింద్, జమాఅతె
ఇస్లామీ హింద్, జమీయత్ అహ్లె హదీస్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తదితర ముస్లిం సంస్థల నాయకులు ఉద్దేశించి, మీడియాకు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
-