27/10/2025
జంగారెడ్డిగూడెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పరిసరాల్లో సోమవారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు పలు ప్రాంతాల్లో ఉన్న పుట్టల్లో పలు పోసి పూజలు నిర్వహించారు. స్థానిక పెరంపేట రోడ్డులో బాట గంగమ్మ ఆలయ సమీపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద పుట్ట వద్ద పూజలు చేస్తుండగా నాగు పాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు కొంత భయాందోళనకు గురయ్యారు. అయితే సాక్షాత్తు స్వామివారు నాగుపాము రూపంలో దర్శనమిచ్చారని భక్తులు పాముకి పూజలు చేశారు. కార్తీక మాసంలో ఇలా నాగు పాము దర్శనంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.