Vizag updates

Vizag updates Blog

విశాఖ స్టీల్స్టాంట్ ఉద్యోగులకు సెలవులు రద్దుAP: విశాఖ స్టీల్స్టాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా కార్మిక ...
12/04/2025

విశాఖ స్టీల్స్టాంట్ ఉద్యోగులకు సెలవులు రద్దు

AP: విశాఖ స్టీల్స్టాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా కార్మిక సంఘాలు ఈ నెల 16 నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో యాజమాన్యం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా ఈ నెల 15 నుంచి 30 వరకు ఉద్యోగులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. అందరూ విధులకు హాజరవ్వాలని ఆదేశించింది.

నర్సింగ్ కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం..
10/04/2025

నర్సింగ్ కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం..

విశాఖలో మరో ప్రేమోన్మాది దాడివిశాఖలో మరో ప్రేమోన్మాది బాలిక తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఫోర్త్ టౌన్ పోలీసులు తెలిపిన వి...
10/04/2025

విశాఖలో మరో ప్రేమోన్మాది దాడి

విశాఖలో మరో ప్రేమోన్మాది బాలిక తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఫోర్త్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకకు చెందిన ఇంటర్ విద్యార్థి, అక్కయ్య పాలెంకు చెందిన బాలిక ప్రేమించుకున్నారు. బాలికకు పెళ్లి సంబందాలు చూస్తున్నారని యువకుడు 7వ తేదీన ఆమె ఇంటికి వెళ్లి తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఆమె గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం రాత్రి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ జిల్లా ప్రధాన న్యాయ మూర్తిగా చిన్నంశెట్టి రాజు నియామకం..!!ప్రస్తుతం విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న...
08/04/2025

విశాఖ జిల్లా ప్రధాన న్యాయ మూర్తిగా చిన్నంశెట్టి రాజు నియామకం..!!

ప్రస్తుతం విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆలపాటి గిరిధర్.. నగరంలోని వ్యాట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు అదనపు జిల్లా జడ్జిలకు బదిలీ జరిగింది. విశాఖ పదో అదనపు జిల్లా జడ్జి ఎన్.శ్రీవిద్య కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తిగా వెళుతున్నారు. అమలాపురం రెండో అదనపు జిల్లా జడ్జి వి.నరేష్ విశాఖ జిల్లా పదో అదనపు జిల్లా జడ్జిగా బదిలీపై వస్తున్నారు. నగరంలోని వ్యాట్ ట్రిబునల్ చైర్మన్ జి.గోపి మచిలీపట్నం ఒకటో అద నపు జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. రెండో అద నపు జిల్లా కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి వి.వాణి ఏలూరు పోక్సో కోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్నారు. విశాఖలోని 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.గోవర్ధన్ కాకినాడలోని ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీపై వెళు తున్నారు. నగరంలోని పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది కాకినాడ రెండో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఏలూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి పి.మంగాకుమారి వస్తున్నారు.

నేడు జూ పార్కు ని సందర్శించనున్న డిప్యూటీ సీఎంరాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజులు విశాఖ పర్యటనలో భాగంగా మంగళ...
08/04/2025

నేడు జూ పార్కు ని సందర్శించనున్న డిప్యూటీ సీఎం

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజులు విశాఖ పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ జూ పార్కు రానున్నారు. ఈ మేరకు జూ పార్కు క్యూరేటర్ మంగమ్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడ జరిగే ఎకో టూరిజం మీటింగ్లో పవన్ కళ్యాన్ పాల్గొంటారని చెప్పారు.

విశాఖ: యువతీ యువకులకు ఉచిత శిక్షణ.. ఉపాధినేక్ ఆధ్వర్యంలో ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్గా ఉపాధి కోసం ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు...
07/04/2025

విశాఖ: యువతీ యువకులకు ఉచిత శిక్షణ.. ఉపాధి

నేక్ ఆధ్వర్యంలో ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్గా ఉపాధి కోసం ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు నేక్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సోమవారం తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 18- 44 సంవత్సరాలలోపు ఎస్సీ అభ్యర్థులకు మాత్రమే 2 నెలల శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. పెద్దగంట్యాడలోని నేక్ సెంటర్లో శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.

విశాఖలో ఏసీబీ దాడులుజ్ఞానాపురంలోని జీవీఎంసీ జోన్- 5 కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు జరిగాయి. మరణ ధ్రువీకరణ పత్రానికి రూ...
07/04/2025

విశాఖలో ఏసీబీ దాడులు

జ్ఞానాపురంలోని జీవీఎంసీ జోన్- 5 కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు జరిగాయి. మరణ ధ్రువీకరణ పత్రానికి రూ.40,000 లంచం అడిగిన డేటా ఆపరేటర్ చంద్రశేఖర్, ఔట్సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.20,000 లంచం తీసుకుంటుండగా రెడ్్యడెండ్గా పట్టుపడ్డారు. ప్రస్తుతం కార్యాలయంలో రికార్డులు తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం: ఆర్.నారాయణ మూర్తి నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగు...
07/04/2025

డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం: ఆర్.నారాయణ మూర్తి

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం భారీ కుట్రకు తెరతీసిందని ఆయన ఆరోపించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'డీలిమిటేషన్ ఉత్తరాది రాష్ట్రాలకు మేలు, దక్షిణాది రాష్ట్రాలకు చెడు చేసేలా ఉంది. దురుద్దేశంతోనే కేంద్రం పునర్విభజనకు పూనుకుంటోంది' అని ఆయన ఫైర్ అయ్యారు

కొత్త సమీకరణాలతో శ్రీకాకుళం పై గురి పెట్టిన వైసీపీ శ్రీకాకుళం జిల్లా రాజకీ యాలలో సామాజిక సమీకర ణలను మార్చాలని వైసీపీ చేస...
07/04/2025

కొత్త సమీకరణాలతో శ్రీకాకుళం పై గురి పెట్టిన వైసీపీ

శ్రీకాకుళం జిల్లా రాజకీ యాలలో సామాజిక సమీకర ణలను మార్చాలని వైసీపీ చేసిన ప్రయత్నాలూ ప్రయోగాలూ చాలానే ఉన్నాయి. అయితే దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల ముందు అవి ఏ మాత్రం సాగలేదు. టీడీపీలో నాలుగున్నర దశాబ్దాలుగా కింజరాపు కుటుంబం కుదురుకుంటే కాంగ్రెస్ వయా వైసీపీగా ధర్మాన కుటుంబం గట్టిగా నిలబడింది. వెలమ సామాజికవర్గానికి చెందిన ఈ రెండు కుటుంబాలదే జిల్లాలో రాజకీయ ఆధిపత్యం. కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా ఉన్న కాలంలో ఒకరు అధికార పక్షం మరొకరు ప్రతిపక్షంగా ఉండేవారు.

ఇపుడు వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతోంది. అయిదే ధర్మాన సోదరులలో మాజీ మంత్రి ప్రసాదరావు సందడి చేయడంలేదు. కృష్ణదాస్ హడావుడి తగ్గింది. దాంతో వైసీపీ కాళింగ సామాజికవర్గాన్ని నమ్ముకున్నా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అలక పానుపు ఎక్కారు. అదే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దూకుడు మైనస్ గా మారింది. దాంతో జిల్లాలో అతి కీలకమైన సామాజికవర్గంగా ఉన్న తూర్పు కాపులనే వైసీపీ నమ్ముకుంటోంది. దివంగత మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కుటుంబమే ఇపుడు వైసీపీకి అండదండగా ఉంది. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి రాష్ట్ర స్థాయిలో కీలకమైన క్రమశిక్షణా సంఘం సభ్యురాలిగా చేసిన వైసీపీ ఆమె సోదరుడు ఎమ్మెల్సీ విక్రాంత్ను జిల్లాలో మరింత కీలకం చేయనున్నారని తెలుస్తోంది.

వైసీపీ ఆశాకిరణం తనూజ రాణి అరకు నుంచి ఎంపీగా 2024 ఎన్నిక లలో గెలిచిన డాక్టర్ తనూజారాణి రాజకీ యాలకు కొత్త అయినా బాగానే రాణ...
07/04/2025

వైసీపీ ఆశాకిరణం తనూజ రాణి

అరకు నుంచి ఎంపీగా 2024 ఎన్నిక లలో గెలిచిన డాక్టర్ తనూజారాణి రాజకీ యాలకు కొత్త అయినా బాగానే రాణిస్తు న్నారు. ఆమె పార్టీ పట్ల విధేయురాలిగా ఉంటున్నారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె తన నియోజకవర్గం సమస్యల విషయంలోనూ పూర్తి అవగాహనతో ముందుకు సాగుతున్నారు. తాజాగా అరకు కాఫీని పార్లమెంట్ క్యాంటీన్లో ప్రారంభించినపుడు తనను ఆహ్వా నించలేదని ఆమె బాధపడ్డారు. అయితే ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూటమి నేతల మీద విరుచుకుపడలేదు. సున్నితంగానే వారికి ఎలా చెప్పాలో చెప్పారు. ప్రోటోకాల్ విషయమూ వివరించే ప్రయత్నం చేశారు. వైసీపీకి ఉన్న నలుగురు ఎంపీలలో ఆమెను కూడా పార్టీ తగిన విధంగా వినియోగించుకుంటే ఉత్తరాంధ్రాలో ఇబ్బంది పడుతున్న పార్టీకి ఆమె మంచి బలంగా మారుతారని అంటున్నారు. నిజానికి చూస్తే వైసీపీకి అరకు ఎంపీ సీటు మంచి పట్టున్నది.
ఇప్పటికి మూడు ఎన్నికలు జరిగితే మూడుసార్లూ మహిళలకే ఇచ్చి గెలిపించుకుంది. అయితే వారిని పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలతో పాటు పార్లమెంట్ చర్చావేదికల వద్ద వినియోగించుకోవడంలో కొంతమేర విఫలమే అయింది అని చెబుతారు. 2014లో గెలిచిన కొత్తపల్లి గీత పార్టీ గీత దాటి వేరే పార్టీలోకి జంప్ చేసినా 2019లో గెలిచిన గొడ్డేటి మాధవి పార్టీలోనే చురుకుగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ తనూజారాణి కూడా తన విధులతో సమర్థంగానే ఉన్నారు. వీరిని పార్టీయే మరింత బాధ్యతలను అప్పగించి చూస్తే వైసీపీకి ఏజెన్సీతో పాటు ఉత్తరాంధ్రలోనూ పటిష్టమైన పరిస్థితి ఉంటుంది అన్నది ఒక విశ్లేషణ.

29/01/2024

Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Vizag updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share