16/08/2024
'ఇస్మార్ట్ శంకర్'తో రామ్లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఆ కలయికలో కొనసాగింపుగా 'డబుల్ ఇస్మార్ట్' రూపొందింది. సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర పోషించడం సినిమాకి మరింత ఆకర్షణగా నిలిచింది. మరి సినిమా ఎలా ఉంది? పరాజయాలతో సతమతమవుతున్న పూరి, రామ్ (double ismart) విజయాన్నిచ్చిందా?
Double iSmart Story (కథేంటంటే): బిగ్ బుల్
(సంజయ్త్) విదేశాల్లో విలాసాలతో జీవిస్తూ చీకటి
సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. భారతదేశాన్ని ముక్కలు
చేయాలనేది అతని కల. అతని కోసం ఇంటెలిజెన్స్ ఏ
'రా' వేట కొనసాగుతూ ఉంటుంది. ఇంతలో బిగుల్
మెదడులో కణితి ఉందని, దాని ప్రభావంతో కొన్ని నెలలు
మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు చెబుతారు.
మరో వందేళ్ల ప్రణాళికలతో బతుకుతున్న బిగ్ బుల్ తాను
చనిపోకూడదని, ఎలాగైనా బతకాలనుకుంటాడు. అందుకు
మార్గాల్ని అన్వేషించినప్పుడు మెదడులో చిప్ పెట్టుకుని
హైదరాబాద్ లో జీవిస్తున్న ఒకే ఒక్కడు ఇస్మార్ట్ శంకర్
(రామ్) పేరు తెరపైకొస్తుంది. బిగ్ బుల్ మెమొరీస్
అన్నీ కాపీ చేసి, ఇస్మార్ట్ శంకర్ మెదడులోని చిప్లో పేస్ట్
చేస్తారు. దాంతో శరీరం ఇస్మార్ట్ శంకర్ అయినా,
ఆలోచనలన్నీ బిగ్ బుల్వే కాబట్టి అతనికి మరణం
ఉండదనేది వాళ్ల ప్లాన్. మరి ఇస్మార్ట్ శంకర్ లోకి బిగ్
బుల్ ఆలోచనలు వచ్చాక ఏం జరిగింది? ఇస్మార్ట్
ఎలాంటి లక్ష్యంతో ఉంటాడు? అతని సొంత జ్ఞాపకాలు,
అతని ప్రేమ, లక్ష్యాలు ఏమయ్యాయి? (Double iSmart) అన్నది చిత్ర కథ.
Double iSmart Story analysis (ఎలా ఉందంటే): 'ఇస్మార్ట్ శంకర్' కొనసాగింపునకు తగ్గ సరకున్న కథనే రాసుకున్నాడు పూరి జగన్నాధ్. ఒక లక్ష్యంతో ఉన్న కథానాయకుడి మెదడులోకి మరో వ్యక్తి వస్తే ఎలా అనే కాన్ప్లిక్ట్ తొలి సినిమాకి దీటుగానే అనిపిస్తుంది. మరోవైపు ఇస్మార్ట్ పాత్రకు బ్రాండ్గా మారిపోయిన రామ్ ఉండనే ఉన్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఎక్కువ జాగ్రత్తపడ్డారో లేక, తన పాత సినిమాల్ని గుర్తు 3. (Double iSmart Review) అర్థవంతంగా లేని అలీ ట్రాక్ తోనూ.. తన శైలి వేగం, పదును లేని కథనంతో చాలా చోట్ల సన్నివేశాల్ని పూరి జగన్నాథ్ సాగదీశాడు. పోశమ్మ కథని పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది. ఆ ఎపిసోడ్తోనే హీరో ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడని, ఇదొక ప్రతీకార కథ అని అర్థమైపోతుంది. తొలి సన్నివేశంలోనే దాదాపుగా కథ రివీల్ అయిపోయి, చాలా సేపు అక్కడే ఆగిపోతుంది.