25/11/2025
మత్తు పదార్థాలపై ఉక్కుపాదం! డ్రగ్స్ నిర్మూలనకు మీడియా కీలకం: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి | Ibrahimpatnam | CM News TV
హయత్‌నగర్–కుంట్లూరు రోడ్లో కొత్తగా ఏర్పాటు చేసిన పెద్దఅంబర్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
🔹 “మత్తు పానీయాలు, గుట్కా, నకిలీ లిక్కర్, డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి”
🔹 “గాంజా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు అవసరం”
🔹 “సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా — ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలకం”
అని పేర్కొన్నారు.
👉 గాంజా, డ్రగ్స్‌కి సంబంధించిన సమాచారం ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం మీడియా బాధ్యత అని ఎమ్మెల్యే సూచించారు.
👉 నూతన ఎక్సైజ్ స్టేషన్‌తో అక్రమ రవాణా, మద్యం దందాలు తగ్గుతాయని, శాంతి భద్రత మెరుగుపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ దశరథ, సూపరింటెండెంట్ ఉజ్వలారెడ్డి, AMC చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ భాస్కర చారి మరియు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
📺 CM News TV — నిజమైన స్థానిక వార్తలకు మీ ప్రథమ ఎంపిక