
12/10/2025
పోలియో దినం 💧💧.
ఈరోజు కడిపికొండ గ్రామంలో 44 & 45వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని బూత్ సెంటర్లో పోలియో దినం పురస్కరించుకొని పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పి.ఏ.సి.ఎస్ వైస్ చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి బాలబాలికలకు పోలియో చుక్కలు వేయించండి.
ఇది మీ పిల్లల ఆరోగ్యం కోసం చాలా అవసరం.
మీ సమీపంలో ఉన్న బూత్ వెళ్లి పోలియో చుక్కలు వేయించండి అని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మార్కండేయ, కడిపికొండ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్కూరి రమేష్,ఆశ వర్కర్లు,అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..
#పోలియో