20/10/2025
హనుమకొండ
తేది: 20.10.2025
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య..
దీపావళి పర్వదినం సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రజలందరికీ ఆనందభరితమైన దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ,..
దీపావళి అనేది చీకట్లపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి గెలిచిన ప్రతీక అన్నారు. ఈ పండుగ మన జీవితాల్లో ఆశ, ఆనందం, సత్సంకల్పాలను నింపుతుందని తెలిపారు. భగవంతుడు శ్రీరాముడు రాక్షసరాజు రావణుడిని సంహరించి అయోధ్యకు చేరిన సందర్భాన్ని స్మరించుకుంటూ జరుపుకునే ఈ దీపోత్సవం, మనలోని అంధకారాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం, ప్రేమ, శాంతి వెలుగులను పంచాలనే సందేశాన్ని ఇస్తుంది అని తెలిపారు.
ప్రతి ఇంటా వెలిగే దీపం ఒక కొత్త ఆశాకిరణం. సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం, సానుభూతి బలపడేలా పండుగ జరుపుకోవాలన్నారు. చిన్నారులు, యువకులు బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పటాకులు కాల్చాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుతూ, సురక్షితంగా, ఆనందంగా దీపావళిని జరుపుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు..