
19/03/2025
మరో లంగిచెర్ల ఉద్యమల రూపొందిస్తాం..
మొండి గౌరెల్లి భూములను ప్రభుత్వానికి ఇచ్చేదే లేదు...
గ్రామంలో బహిరంగ సభ..
ఆర్డీవో తాసిల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు...
వినతి పత్రాలు అందజేత...
మొండి గౌరెల్లి రెవెన్యూ పరిధిలో అసైన్ భూములతో పాటు మరికొంత పట్టా భూములను కలుపుతూ ఫ్యూచర్ సి. పారిశ్రామిక పార్కుల కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదంటూ గ్రామ ప్రజలు ఏకకంఠంతో ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరికలుజారీ. చేశారు. మంగళవారం రోజున మొండి గౌరెల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులు సమావేశం ఏర్పాటు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మొండిగౌరెల్లి భూములను ఇవ్వబోమని సమావేశంలో తీర్మానం చేసుకున్నారు అనంతరం సంతకాలతో కూడిన వినతి పత్రాలను స్థానిక తాసిల్దార్ కు ఆర్డిఓ కు. వినతి పత్రాలు అందజేస్తూ ధర్నా నిర్వహించారు.అనంతరం మొండిగౌరెల్లి గ్రామ రైతులు మాట్లాడుతు గ్రామ రెవెన్యూ పరిధిలో అధిక శాతం వ్యవసాయం చేసుకునే భూములే ఉన్నాయని ఆట్టి భూములలో దళితులు,బీసీలు, గిరిజనులు వ్యవసాయం చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని ప్రభుత్వం వారిని గుర్తించి తక్షణమే భూసేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గుర్తు చేశారు. లేనిపక్షంతో గ్రామములోని ప్రతి రైతు కుటుంబం తాసిల్దార్ కార్యాలయాలను ఆర్డిఓ కార్యాలయాలను కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించి మరో లంగిచెర్ల ఉద్యమం రూపంలో చేయవలసి వస్తుందని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మొండి గౌరెల్లి గ్రామంలో రైతులు పండించే ఆకుకూరలు కాయకూరలా పంటలతో హైదరాబాదులో ప్రతి ఒక్కరి కుటుంబానికి ఆహార సరకులు గా.అందిస్తున్నామని గుర్తు చేశారు హైదరాబాద్ మార్కెట్లలో ఏ ఒక్కరిని అడిగినా మొండి గౌరెల్లి కొత్తిమీర పుదీనా కూరగాయలు వస్తేనే మార్కెట్లో రేట్లు తక్కువగా వస్తాయని చాలామంది కొనుగోలుదారులు మొండిగౌరెల్లి గ్రామాన్ని ఆరాధిస్తారు అలాంటి గ్రామంలో వ్యవసాయ యోగ్యమైన భూములను పారిశ్రామిక వాడలకు తీసుకోవడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం మొండిగౌరెల్లి గ్రామాన్ని పైలెట్ వ్యవసాయ పరిశ్రమగా ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ తీసుకుందని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వము అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం అధికారులను గ్రామానికి పంపించి వ్యవసాయ యోగ్యానికి ఉపయోగపడే భూములు గుర్తించాలని అలాంటి భూములు ఉన్న స్థానంలో పరిశ్రమలు పెట్టడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇప్పటికే ధరణి రావడంతో ఎంతోమంది రైతుల భూములు ఆన్లైన్లో లేక రైతుబంధు రాక తమ కోతుల పెళ్లిలకు భూములు అమ్ముకొని అప్పులు లేకుండా పెళ్లిళ్లు చేసుకుందామంటే భూములు అమ్ముడుపోక ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారని ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చేస్తున్నామని తెలపడంతో రైతుల ఎంతో సంతోషపడ్డారని దాంతోపాటు ఫుచర్ సిటీలో మా గ్రామం విలీనం అవుతుందని దీంతోపాటు మా భూముల రేట్లు మరింత అభివృద్ధి చెందుతాయని సంతోషపడడంతో ఇట్టి విషయంపై జిల్లా అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశామన్నారు ఆ వినతి పత్రాల పైన ఎలాంటి స్పందన లేకుండానే గ్రామ రైతులకు గ్రామ ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం లేకుండా భూములను సేకరిస్తున్న మట్లు సేకరిస్తున్నట్లు నోటిఫికేషన్లు పత్రికల్లో జారీ చేయడం చాలా సిగ్గుచేటని గుర్తు చేశారు. అనంతరం ఆర్డిఓ అనంతరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి మాట్లాడుతూ నోటిఫికేషన్ వేసిన విషయము భూములు తీసుకుంటున్న విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందని. మొండి గౌరెల్లి గ్రామంలో ప్రభుత్వ భూముల.68.19.127.సర్వే నెంబర్లలో 600 ఎకరాల భూమి సాగుకు ఉపయోగపడకుండా గుట్టలు పొదల తో ఉందని అలాంటి భూములను గుర్తించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు ప్రభుత్వ అధికారుల సర్వే ప్రకారం 800 ఎకరాలలో. సుమారు 650 ఎకరాలు. గుట్టలు రాళ్లతో కూడిన భూమి ఉందని అక్కడ వ్యవసాయం ఎవరు చేయడం లేదని అధికారులు గుర్తించారని తెలిపారు ప్రజాల. రైతుల.ఫిర్యాదు మేరకు గురువారం రోజున స్వయంగా నేనే పరిశీలించి ప్రభుత్వ తో మాట్లాడి వ్యవసాయాన్ని కి యోగ్యమైన భూములను మినాయింప చేస్తానని తెలిపారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు రైతులు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని గుర్తు చేస్తూ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల బాగోగుల కోసమే ప్రజా అభివృద్ధిని కోసమే నిర్ణయాలు తీసుకుంటుందని గుర్తు చేస్తూ ఒక దిక్కు అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాల్సిందే పరిశ్రమలకు ప్రతి ఒక్కరు భూములు ఇవ్వాల్సిందేనని అప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు లోబడి పని చేయాలంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో మొండిగారిల్లు గ్రామ రైతులు, వివిధ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల యువకులు తదితరులు పాల్గొన్నారు.