Sathrughna

Sathrughna a Mechanical Engineer, Working in HAL . A Social Service Activist,an Environmentalist, Blood donar

29/01/2023

*కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు. అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడటం లేదు. దౌర్భాగ్యకరమైన పరిస్థితి*
*ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ తూ మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుష్యులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతుంది దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు. కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కొన్ని ప్రధానమైన కారణాలు:*

*1.అతి తెలివి*
*2.చిన్న తప్పును కూడా భరించే శక్తి, సహనం లేవు.*
*3.అందరూ సమానమే అనే వింత భావన పెరగటం ( డెమాక్రసి).*
*4.పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకొనక పోవడం.*
*5.ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈరోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు. కానీ, ఇంట్లోని వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది.*
*6.చిన్నదానికీ అలిగి దగ్గరి వారికి కూడా దూరం జరుగుతున్నారు.*
*7.ఎవరో ఒకరి నోటి దురుసుతనం కుటుంబం మొత్తం చిన్నాభిన్నం కావడానికి కారణం అవుతుంది.*
*8.ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా, దృఢంగా, బలంగా మేనేజ్ చేయలేక పోవడం కూడా ఒక కారణం.*
*9.ఇంట్లో భార్యా భర్తలు (తల్లి దండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు. అన్ని ఫ్యామిలీలల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసు కుంటున్నారు. అన్యోన్యంగా, ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడక పోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకం పోయింది. అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. 31దాటినా పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు. గత 30, 40 ఏళ్ళల్లో మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెబుతున్నారు.*
*10.ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు,పోల్చుకోవడం తదితర కారణాల వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలబడ లేకుండాపోతుంది.*
*11.మనుష్యులు అంటేనే విలువ లేదు. మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. అధిక జనాభా, సుఖ లాలస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెంపరితనం కూడా వచ్చింది.*
*12.మధ్య వర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు. దీంతో ఎవ్వరిష్టం వారిదే అయ్యింది.*
*13.కుటుంబ నిర్వహణ ఒక కళ. ఆ కళ అందరికీ లేకపోవడం వల్ల కూడా వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది.*
*14.మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది. మొరటుగా ప్రవర్తిస్తున్నారు. నేను నాభార్య/భర్త అనే సిద్దాంతం పోయి "నేనే నేను" "నేను నేనే"పాలసీ వచ్చింది. పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది. ఇంట్లో ఉంచుకోవాలంటే భయ పడుతున్నారు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు. కుటుంబ విలువలు, కట్టు బాట్లు ఇక ఉండవు. ఎవ్వడిష్టం వాడిదే అయ్యే రోజులు అప్పుడే వచ్చినవి. అన్నా దమ్ములు, అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ళ, భార్యా భర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేనే లేవు. సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది. ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో. ఒక నాటకం. ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది. ఇంకా పచ్చిగా అవుతారు.*
15 *డిజిటల్ ప్లాట్ఫాం పైన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే తమకి నిజమైనవి అని అపోహలో బతుకుతున్న జనం. ఎవరైనా చనిపోతే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ లేదా RIP అని పెట్టి అంతటితో వదిలేస్తున్నారు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి ఉండదు. దీనికి అందరూ, అన్నీ కారణములే. ఇక్కడ ఎవ్వరూ శ్రీరామచంద్రులు లేరు. ఎక్కడా సీతమ్మలు లేరు. ఉన్నవారంతా అటు ఇటు గానీ వింత జాతి. ఇది ఇంతే. అది అంతే. ఎవ్వరూ ఏమీ చేయ లేరు. ఇదంతా ఊరకే అనుకోవడం తప్ప ఏమీ చేయలేము. అరణ్య రోదన మాత్రమే.*

21/01/2023

🙏 *వయస్సు దాటుతున్న వేళ*🙏🙏👌👏👏

*1. ఈ సమయం ఇన్నాళ్ళూ సంపాదించినదీ, దాచుకున్నదీ తీసి ఖర్చు పెట్టె వయసు.తీసి ఖర్చు పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి.*

*దాన్ని ఇంకా దాచి అలా దాచడానికి మీరు పడిన కష్టాన్ని, కోల్పోయిన ఆనందాలనూ* *మెచ్చుకునేవారు ఎవరూ ఉండరు అనేది గుర్తు పెట్టుకోండి*

*2. మీ కొడుకులూ, కోడళ్ళూ మీరు దాచిన సొమ్ముకోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో? ఈ వయసులో ఇంకా సంపాదించి* *సమస్యలనూ, ఆందోళనలూ కొని తెచ్చుకోవడం అవుసరమా?*
*ప్రశాంతంగా ఉన్నది అనుభవిస్తూ జీవితం గడిపితే చాలదా?*

*3. మీ పిల్లల సంపాదనలూ, వాళ్ళ పిల్లల సంపాదనల గురించిన చింత మీకు ఏల?* *వాళ్ళ గురించి మీరు ఎంత వరకూ చెయ్యాలో అంతా చేశారుగా?* *వాళ్లకి చదువు, ఆహారం, నీడ మీకు తోచిన సహాయం ఇచ్చారు. ఇపుడు వాళ్ళు వాళ్ళ కాళ్ళమీద నిలబడ్డారు.ఇంకా వాళ్ళకోసం మీ ఆలోచనలు మానుకోండి. వాళ్ళ గొడవలు వాళ్ళను పడనివ్వండి.*

*4. ఆరోగ్యవంతమైన జీవితం గడపండి. అందుకోసం అధిక శ్రమ పడకండి. తగిన మోతాదులో వ్యాయామం చెయ్యండి. (నడక, యోగా వంటివి ఎంచుకోండి) తృప్తిగా తినండి. హాయిగా నిద్రపోండి.* *అనారోగ్య పాలుకావడం ఈ వయసులో చాలా సులభం, ఆరోగ్యం నిలబెట్టుకోవడం కష్టం. అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని గమనించుకుంటూ ఉండండి. మీ వైద్య అవుసరాలూ, ఆరోగ్య అవుసరాలూ చూసుకుంటూ ఉండండి. మీ డాక్టర్ తో టచ్ లో ఉండండి. అవుసరం అయిన పరీక్షలు చేయించుకుంటూ ఉండండి.* *(ఆరోగ్యం బాగుంది అని టెస్ట్ లు మానేయకండి)*

*5. మీ భాగస్వామికోసం ఖరీదైన వస్తువులు కొంటూ ఉండండి. మీ సొమ్ము మీ భాగస్వామితో కాక ఇంకెవరితో అనుభవిస్తారు?* *గుర్తుంచుకోండి ఒకరోజు మీలో ఎవరో ఒకరు రెండో వారిని వదిలిపెట్టవలసి వస్తుంది. మీ డబ్బు అప్పుడు మీకు ఎటువంటి ఆనందాన్నీ ఇవ్వదు. ఇద్దరూ కలిసి అనుభవించండి.*

*6. చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడకండి. ఇప్పటివరకూ జీవితం లో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నారు. ఎన్నో ఆనందాలూ, ఎన్నో విషాదాలూ చవి చూశారు. అవి అన్నీ గతం.*
*మీ గత అనుభవాలు మిమ్మల్ని వెనక్కులాగేలా తలచుకుంటూ ఉండకండి, మీ భవిష్యత్తును భయంకరంగా ఊహిచుకోకండి. ఆ రెండిటివలన మీ ప్రస్తుత స్థితిని నరకప్రాయం చేసుకోకండి. ఈరోజు నేను ఆనందంగా ఉంటాను అనే అభిప్రాయంతో గడపండి. చిన్నసమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి .*

*7. మీ వయసు* *అయిపొయింది అనుకోకండి. మీ జీవిత భాగస్వామిని ఈ వయసులో ప్రేమిస్తూనే ఉండండి. జీవితాన్ని ప్రేమిస్తూనే ఉండండి. కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉండండి. మీ పొరుగువారిని ప్రేమిస్తూ ఉండండి.*

*"జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలూ ఉన్నన్ని నాళ్ళూ మీరు ముసలివారు అనుకోకండి.* *నేను ఏమిచెయ్యగలనూ అని ఆలోచించండి. నేను ఏమీ చెయ్యలేను అనుకోకండి"*

*8. ఆత్మాభిమానం తో ఉండండి (మనసులోనూ బయటా కూడా) హెయిర్ కట్టింగ్ ఎందుకులే* *అనుకోకండి. గోళ్ళు పెరగనియ్యిలే అనుకోకండి. చర్మసౌందర్యం మీద శ్రద్ధ పెట్టండి. పళ్ళు కట్టించుకోండి. ఇంట్లో పెర్ఫ్యూమ్ లూ, సెంట్లూ ఉంచుకోండి. బాహ్య సౌందర్యం మీలో అంతః సౌందర్యం పెంచుతుంది అనే విషయం మరువకండి. మీరు శక్తివంతులే!*

*9. మీకు మాత్రమె ప్రత్యేకం అయిన ఒక స్టైల్స్ ఏర్పరచుకోండి. వయసుకు తగ్గ దుస్తులు చక్కటివి ఎంచుకోండి. మీకు మాత్రమె ప్రత్యేకం అయినట్టుగా మీ అలంకరణ ఉండాలి. మీరు ప్రత్యేకంగా హుందాగా ఉండాలి.*

*10. ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉండండి. న్యూస్ పేపర్లు చదవండి. న్యూస్ చూడండి. పేస్ బుక్ , వాట్సాప్ లలో ఉండండి. మీ పాత స్నేహాలు మీకు దొరకవచ్చు.*

*11. యువతరం ఆలోచనలను గౌరవించండి.*
*మీ ఆదర్శాలూ వారి ఆదర్శాలూ వేరు వేరు కావచ్చు. అంతమాత్రాన వారిని విమర్శించకండి* .

*సలహాలు ఇవ్వండి,* *అడ్డుకోకండి. మీ అనుభవాలు వారికి ఉపయోగించేలా మీ సూచనలు ఇస్తే చాలు. వారు వారికి నచ్చితే తీసుకుంటారు. దేశాన్ని నడిపించేది వారే!*

*12. మా రోజుల్లో ... అంటూ అనకండి. మీరోజులు ఇవ్వే!*
*మీరు బ్రతికి ఉన్నన్ని రోజులూ " ఈరోజు నాదే" అనుకోండి*

*అప్పటికాలం స్వర్ణమయం అంటూ ఆరోజుల్లో బ్రతకకండి.*
*తోటివారితో కఠినంగా ఉండకండి.*

*జీవితకాలం చాలా తక్కువ. పక్కవారితో కఠినంగా ఉండి* *మీరు సాధించేది ఏమిటి?* *పాజిటివ్ దృక్పధం,* *సంతోషాన్ని పంచే స్నేహితులతో ఉండండి.* *దానివలన మీ జీవితం సంతోషదాయకం అవుతుంది.* *కఠిన మనస్కులతో ఉంటె మీరూ కఠినాత్ములుగా మారిపోతారు.* *అది మీకు ఆనందాన్ని ఇవ్వదు. మీరు త్వరగా ముసలివారు అవుతారు.*

*13. మీకు ఆర్ధికశక్తి ఉంటె, ఆరోగ్యం ఉంటె మీ పిల్లలతో మనుమలతో కలిసి ఉండకండి. కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం మంచిది అని అనిపించవచ్చు. కానీ అది వారి ప్రైవసీకి మీ ప్రైవసీకి కూడా అవరోధం అవుతుంది.వారి జీవితాలు వారివి.*
*మీ జీవితం మీది. వారికి అవుసరం అయినా, మీకు అవుసరం అయినా తప్పక పిల్లలతో కలిసి ఉండండి.*

*14. మీ హాబీలను వదులుకోకండి.* *ఉద్యోగజీవితం లో అంత ఖాళీ లేదు అనుకుంటే ఇప్పుడు చేసుకోండి.*
*తీర్థ యాత్రలు చెయ్యడం, పుస్తకపఠనం, డాన్స్, పిల్లినో, కుక్కనో పెంచడం, తోట పెంపకం, పెయింటింగ్ ... రచనా వ్యాసంగం ... ఏదో ఒకటి ఎంచుకోండి.*

*15. ఇంటిబయటకు వెళ్ళడం అలవాటు చేసుకోండి. కొత్త పరిచయాలు పెంచుకోండి.* *పార్కుకి వెళ్లండి, గుడికి వెళ్ళండి, ఏదైనా సభలకు వెళ్ళండి. ఇంటిబయట గడపడం కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.*

*16. మర్యాదగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది.* *పిర్యాదులు చెయ్యకండి. లోపాలను ఎత్తిచూపడం అలవాటు చేసుకోకండి. విమర్శించకండి. పరిస్థితులను అర్ధం చేసుకుని ప్రవర్తించండి. సున్నితంగా సమస్యలను చెప్పడం అలవాటు చేసుకోండి.*

*17. వృద్ధాప్యం లో బాధలూ, సంతోషాలూ కలిసి మెలసి ఉంటాయి. బాధలను తవ్వి తీసుకుంటూ ఉండకండి.* *అన్నీ జీవితంలో భాగాలే*

*18. మిమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించండి*

*మీరు బాధపెట్టిన వారిని క్షమాపణ కోరండి*

*మీ తోపాటు అసంతృప్తిని వెంటబెట్టుకోకండి.*

*అది మిమ్మల్ని విచారకరం గానూ,*
*కఠినం గానూ మారుస్తుంది*
*ఎవరు రైటు అన్నది ఆలోచించకండి.*

*19. ఒకరిపై పగ పెట్టుకోవద్దు*
*క్షమించు, మర్చిపో, జీవితం సాగించు.*

*20. నవ్వండి నవ్వించండి. బాధలపై నవ్వండి*
*ఎందరికన్నానో మీరు అదృష్టవంతులు.*
*దీర్ఘకాలం హాయిగా జీవించండి.*

*ఈ వయసు వరకు కొందరు రాలేరు అని గుర్తించండి.*
*మీరు పూర్ణ ఆయుర్దాయం పొందినందుకు ...🌼👍😷🙏🇮🇳❤️🤝💐🌹💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

16/09/2022
16/09/2022

🔔‘ *నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు* .
*పైనున్న భగవంతుడికి తెలుసు. ....... *2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడైంది...*

*🔆--సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట.*

*తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట.*
*భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానిక ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు._*
*--భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు...*

*కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో కొడతారు కూడా !*

*ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులక ఉండదు --*

✳️ _*‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం వా మగానుభావులు..*

*ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక..అందరితో కలవలేక.. మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు !!_*
✳️_'‘ *నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు* .
*పైనున్న భగవంతుడికి తెలుసు.*
*ఒరే.. పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. ‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు.*
*ఆ తర్వాత నా సంగతి చూడు’*
*అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని.*
*‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా అని అనుకోకు... వుంటారు.*
*నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది.*
*చీకటంటే భయం.*
*ఉరిమితే భయం.*
*మెరుపంటే భయం.*
*నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ?*
అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని
లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు ?’’... *ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది !_*
_
✳️ *నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా ? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన ! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు._*
✳️ *_ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం.. భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిపోయిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు._*
✳️ *_సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని..*

*తాను తప్ప ఆమెకు దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు.*

*కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు.*

✳️🥎🥎 *భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది.*

*భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది.*
*భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు.*

✳️🟡_ *స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది*.

తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది.
*అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురుచూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది.*
*ఆ మనోబలమే... భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది._*
🌈_*భావోద్వేగ బలం ఆమెదే :-*_

_పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, *స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది*.
సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే..
ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌.
ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు.
ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది..

🌈 -- *అందుకే ఆడదే మగాడికి సర్వస్వం*...యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత....

*Save Girl Child and Respect women......*🙏🙏🙏🙏🙏

Azadi ka Amrit Mahotsav... Happy Independence day 15-08-2022
16/08/2022

Azadi ka Amrit Mahotsav... Happy Independence day 15-08-2022

సర్వరోగాస్త్రానికి విరుగుడు నమత్రేయాస్త్రం : శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయనమః, శ్రీ ముకుందాయనమఃఈ కలియుగంలో మనల్ని పడద్ర...
16/07/2022

సర్వరోగాస్త్రానికి విరుగుడు నమత్రేయాస్త్రం : శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయనమః, శ్రీ ముకుందాయనమః

ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మనమీద దాడికి దిగుతాడు. వీటిలో అనేకరకాలు. వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలనుసృష్టిస్తాడు. ఆరోగాలన్ని ఒక ఆయుధంగా మలిచి సంధిస్తాడు. దానిపేరు సర్వారోగాస్త్రం. దీనికి విరిగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలు, లక్షలు వదిలించుకోవడం. కాని మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాతా ఒక శస్త్రం సంధించింది, దానిపేరు నామత్రేయాస్త్రం.

నామత్రయం అంటే మూడు నామాలు. అవి

శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయ నమః,
శ్రీ ముకుందాయ నమః

ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి కలిప్రేరితమైన రోగాలు రావు. జబ్బులు ఏమైనా ఉంటే అనతికాలంలోనే తగ్గిపోతాయి. ఈ నామాలు ఒక దివ్యౌషధం.
🙏🙏🙏

18/05/2022
10/05/2022

సీతానవమి (సీతాదేవి జయంతి) :

వైశాఖమాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని సీతానవమి లేదా సీతా జయంతి గా జరుపుకుంటారు. సీతా నవమి హిందూ భక్తులకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. సీతమ్మ లక్ష్మీ దేవి అవతారం అని భావిస్తారు. ఆమె అందరి మానవులకు మరియు ఇతర జీవులకు తల్లిగా పేరు పొందింది. జనక మహారాజు యజ్ఞభూమి దున్నుతుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపాప ఉంది. నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత అనే నామకరణం చేశారు. సీతమ్మను జనక మహారాజు దత్తపుత్రిక 'జానకి' అని కూడా పిలుస్తారు. తన రాజ్యమైన మిథిలా నగరంలో జనక మహారాజు నిర్వహించిన 'స్వయంవరం'లో రాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. తన భర్త శ్రీ రాముడి పట్ల సహనానికి, అంకితభావానికి సీతాదేవి ఎప్పుడూ గుర్తింపు పొందింది. వివాహిత స్త్రీలు సీతమ్మను ఈ పవిత్రమైన రోజున ఆమె స్వచ్ఛత చిత్తశుద్ధి తమకు అందించాలని ప్రార్థిస్తారు. వారు 'సుమంగలి'గా ఉండటానికి సీతాదేవి ఆశీర్వాదం కోరుకుంటారు. ఒక వ్యక్తి జీవితంలో అన్ని అడ్డంకులను తొలగించే శుభకరమైన రోజుగా సీతా జయంతిని భావిస్తారు. సీతా నవమి రోజు పూజ, ఆచారాలు మరియు వ్రతాలు చేయడం ద్వారా సంతోషకరమైన వివాహ జీవితం లభిస్తుందని నమ్ముతారు.*సీతమ్మ పుట్టినిల్లు*

🔔🔔🔔🔔🔔

జానకీ మందిర్‌.. సీతమ్మ పుట్టిల్లు మిథిలారాజ్యం(నేటి నేపాల్‌లోని జనక్‌పూర్‌)లో నెలవైన ఆలయం. ఆ జగదానంద కారకుడి పట్టమహిషి కొలువైన మందిరం.

స్థలపురాణం ప్రకారం జనక మహారాజు ఏలిన నేల ఇది. సీతమ్మతల్లి జనకుడికి లభ్యమైన చోటు ఇదేనని.. రామయ్యను పెళ్లాడి అయోధ్యకు వెళ్లేదాకా ఈ నేలపైనే నడయాడిందని ఐతిహ్యం. అందుకు నిదర్శనంగా.. 1657లో ఈ ప్రాంతంలో ఒక స్వర్ణ సీత విగ్రహం దొరికింది. ఈ ఆలయానికి సమీపంలో ‘వివాహ మండప్‌’ పేరుతో ఒక గుడి ఉంటుంది. సీతారాముల పెళ్లి జరిగింది అక్కడేనని భక్తుల నమ్మిక. జానకీ మందిర్‌ను నేపాలీలు ‘నౌ లఖా మందిర్‌’గా వ్యవహరిస్తుంటారు. నౌ లఖా అంటే తొమ్మిది లక్షలు. 150 అడుగుల ఎత్తుండే ఈ మూడంతస్తుల గుడిలో 60 గదులుంటాయి. రాణి వృషభాను 1910లో దీన్ని నిర్మింపజేసింది. ఈ ఆలయ నిర్మాణానికిఅయిన ఖర్చు.. 9,99,900. అందుకే ‘నౌ లఖా మందిర్‌’ అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు నేపాల్‌ నలుమూలల నుంచే కాక.. భారత్‌, శ్రీలంక తదితర దేశాల నుంచి వేలాది భక్తులు వస్తుంటారు.

🔔🔔🔔🔔🔔

Address


Telephone

+9611145359

Website

Alerts

Be the first to know and let us send you an email when Sathrughna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sathrughna:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share