20/06/2025
//శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ నేపథ్యంలో గుంటూరు నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టిన గుంటూరు ట్రాఫిక్ పోలీసులు.//
గుంటూరు నగరం శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో ది.23.06.2025 తేదీ సోమవారం నుండి గుంటూరు నగరంలో పలు ట్రాఫిక్ మళ్లింపులు(Diversions)అమలులోకి రానున్నాయి.
ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు:--
1.అమరావతి రోడ్ → MTB సెంటర్(రమేష్ హాస్పిటల్ కూడలి)వైపు వెళ్లే హెవీ వెహికల్స్ :- చిల్లీస్ పాయింట్ →ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా ప్రయాణించాలి.
2.MTB (రమేష్ హాస్పిటల్ కూడలి) సెంటర్ → Lodge సెంటర్ వెళ్లే హెవీ వెహికల్స్ :-రమేష్ హాస్పిటల్ → కంకరగుంట ఫ్లైఓవర్ మార్గం వినియోగించాలి. (స్కూల్, కాలేజ్ బస్సులకు కూడా వర్తించును).
3.Lodge సెంటర్ → MTB సెంటర్ వైపు కార్లు, ఆటోలు, టూ వీలర్లు:అరండల్ పేట → పొట్టి శ్రీరాములు నగర్ → డొంక రోడ్డు → మూడు వంతెనలు లేదా బ్రాడీపేట → కంకరగుంట ఫ్లైఓవర్ ద్వారా ప్రయాణించవచ్చు.
4.కోబాల్ట్ పేట,కృష్ణా నగర్,చంద్రమౌళి నగర్, బృందావన గార్డెన్స్,లక్ష్మీపురం ప్రాంతాల నుండి మార్కెట్ వైపుకు వచ్చే కార్లు,ఆటోలు,టూ-వీలర్లు:-పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్ లేదా బ్రాడీపేట 18 లైన్ ద్వారా →కంకరగుంట అండర్‌పాస్ →కలెక్టర్ ఆఫీస్ రోడ్ →రమేష్ హాస్పిటల్ మీదుగా ప్రయాణించాలి
5.MTB సెంటర్ → Lodge సెంటర్ వచ్చు కార్లు, ఆటోలు, టూ వీలర్లు :-శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పై ప్రయాణించవచ్చు.
6.పట్టాభిపురం → GGH వెళ్లే వారు:-- కంకరగుంట ఫ్లైఓవర్ → మెడికల్ కాలేజ్ → శంకర్ విలాస్ అండర్‌పాస్ మార్గంలో వెళ్లాలి.
7.మూడు వంతెనలు → GGH వెళ్లే వారు :-Naaz సెంటర్ → పల్లవి థియేటర్ మార్గాన్ని అనుసరించాలి.
8.GGH → MTB సెంటర్ :-పల్లవి థియేటర్ → Naaz సెంటర్ → Woman’s కాలేజీ రోడ్ మార్గం వినియోగించాలి.
9.GGH → బస్టాండ్ :-పల్లవి థియేటర్ → Naaz సెంటర్ → భగత్ సింగ్ విగ్రహం మార్గంలో వెళ్లాలి.
10. బస్టాండ్ → GGHభగత్ సింగ్ విగ్రహం → Naaz సెంటర్ → పల్లవి థియేటర్ మార్గంలో వెళ్లాలి.
11.Lodge సెంటర్ → MTB సెంటర్ హెవీ వెహికల్స్ :-
చిల్లీస్ → ఇన్నర్ రింగ్ రోడ్→ ఆటొ నగర్→బస్ స్టాండ్ లేదా కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాల్లో ప్రయాణించాలి.
* ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికను రూపొందించుకోవాలి.
* ట్రాఫిక్ పోలీస్ సూచనలకు అనుసరించగలరు.
* ప్రజల సౌలభ్యం కోసం తాత్కాలిక మార్గాలు రూపొందించబడ్డాయి.
వాహనదారులు మరియు ప్రజలు పై మార్గదర్శకాలను అనుసరించి ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేయడమైనది.
-- శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్,
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గుంటూరు జిల్లా.