20/05/2020
#మొత్తం_చదవండి.! #రేపటి_వాస్తవం_ఇదే_కనపడుతుంది...
#కరోనాతో_కలిసేఉంటాం_కరోనాసోకకుండా_అంతా_సిద్దంకావడమే_ఇక..
కరోనాపై జిల్లాల వారీగా పట్టిక లేదు. రాదు. ప్రభుత్వం విడుదల చేయడం లేదు. కరోనాపై అత్యుత్సాహం తగ్గించుకుని సాధారణ జీవితాల్లోకి వచ్చేస్తే మంచిది ఇక మనం కూడా..... మన ఊళ్ళో ఎన్ని, పక్క ఊళ్ళో ఎన్ని, జిల్లాలో ఎన్ని, ఎక్కడ ఎన్ని...? అవన్నీ ఇక అనవసరమే అనుకుంట... మీ ప్రాంతంలో కరోనా తీవ్రత ఉంటేకనుక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి, ఎలానూ అలెర్ట్ చేస్తుంది. జాగర్తలు తీసుకొంటుంది కదా..
రోజూ కరోనా జాబితా, జిల్లాలు, ప్రాంతాల వారీగా అడుగుతున్నారు..? సాధ్యమైనంత వరకు ఇస్తున్నాం. ఇంకా ఎంత కాలం ఇది. కరోనా గురించి మాట్లాడుకుని, మన దైనందిన జీవితాలు వదిలేసుకుంటామా...? అందుకే ప్రభుత్వం కూడా జిల్లాల వారీగా బులెటిన్లు ఇవ్వడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే ఇస్తున్నారు..
ప్రజలూ మారాలి కరోనా ఎవరూ కావాలని తెచ్చుకునేది కాదు..ఒకరికి కరోనా సోకిందంటే కారణం అజాగర్తగా వ్యవహరిండడం.. మాస్క్ వాడకపోవడం ,వ్యక్తిగత పరిశుభ్రత జాగర్తలు పాటించకపోవడమే ప్రధాన కారణం..కరోనా సోకినా అవతలి వ్యక్తి కొ కరోనా పట్ల అవగాహన లేకపోవడం,తనకి కరోనా సోకినా గుర్తించకపోవడం..లక్షణాలు ఉన్న ప్రభుత్వ వైధ్యులను సంప్రదించకపోవడంమే అసలు కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం..
కరోనా పట్ల ముందు అపోహలను వీడి...ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన సమయం ఇది..దగ్గు జ్వరం ఉండి అనుమానంవస్తే వెంటనే మీ ప్రాంతంలోని ANMలకు తెలియపరిచి మీ ఇంట్లో కుటుంబసభ్యులకు దూరంగా ఉండండి...
మీ ఇంట్లో వారికి దూరంగా ఉండటం అంటే మీ ఇంట్లో వారిని మీరు కరోనా రాకుండా కాపాడటమే అని గమనించండి.....ప్రభుత్వం అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తుంది...ఇక ప్రజలు మాత్రం వయసు మీదపడిన వారు ,చిన్న పిల్లల విషయంలో తప్పని సరిగా శ్రద్ద వహించి అనవసరంగా బయటకి పంపకండి..కొంతకాలం ఈ కనపడని శతృవుతో మనం అనునిత్యం జాగర్తలు పాటించి యుధ్దం కొనసాగించి గెలుస్తూ పోరాడాల్సిందే..
WHO చెప్పినట్లుగా కరోనా సోకిన వ్యక్తి నుండి నోటినుండి,తగ్గినా తుమ్మునా ముక్కునుండీ వచ్చే తుంపర్లు చేతుమీద పడి అవతలి వ్యక్తి ముక్కును , కళ్ళను ,నోటికి చేరితేనే కరోనా వైరస్ వ్యాపిస్తుంది..కనుక జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అనవసరంగా తిరగకపోవడం ప్రతి ఒక్కరికీ శ్రేయస్కరం..
మీకు కరోనా లేకపోయినా రాకపోయినా మీప్రక్క వాడికి ఉండచ్చేమో అనుకుని మీ మాస్క్ మీరు వాడుకోవడం ఇంటికి వెళ్ళ గానే చేతులుశుభ్రంగా కడుక్కోండి ..మీ ఇంట్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి..వ్యక్తిగత పరిశుభ్రతే కరోనాని నిర్వూలించగలదని గ్రహించండి...
మన టైమ్ బాగోక కరోనా సోకినా అధైర్య పడనవసరం లేదు..భయపడాల్సిన పనిలేదు ప్రభుత్వం వైధ్యంఅందిస్తుంది కరోనా వైరస్ తగ్గి తమ ఇళ్ళకి చేరిన పాజిటీవ్ రోగులు చాల మంది ఉన్నారు...ఎటొచ్చి బిపి ,షుగర్,అనారోగ్యసమస్యలు వయసు బాగా మీదపడిన వృద్దులకు ,చిన్న పిల్లలకు కరోనా వస్తేనే కొంత ఇబ్బందని WHO నే తెలిపింది..కానీ మన పశ్చిమగోదావరి జిల్లా లో కరోనా సోకిన వారిలో 90%.ఎవరికీ లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ సోకిందని వైద్యులు గుర్తిచారు..
నీ ఇంట్లోంచి నీ అవసరం కోసం, బయటకి వచ్చే నువ్వు కరోనా సోకకుండా జాగర్తలు పాటిస్తే కరోనా నీఇంటి ఛాయలకు రాదు..నీలా నీ ఇంటిపక్కోడు,నీ వీధిలో ఉన్న వాళ్ళు ,నీ ఊళ్ళో ఉన్న ప్రతోడు అవగాహన పెంచుకొని జాగర్తలు తీసుకొంటే కరోనాని వాక్సిన్ రాకుడానే తరిమేయచ్చు మిత్రమా...రేపటినుండి బస్సులు రోడ్డు ఎక్కుతున్నాయ్ ,ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ తీయబడతాయి..ఉద్యోగస్తులు ఉద్యోగాలకు ..వ్యాపారస్తులు వారి దుకాణాలుకు అందరూ ఎవరి కి వారు బద్దకం కరోనా భయం వదలేసి బయటకి రావాల్సిందేగా ఇక..
కరోనా ధీర్గకాలిక రోగం కాదు కదా(ఎయిడ్స్) కరోనా వస్తే భయపడకండి,సిగ్గు మొహమాటాలు పడాల్సిన పని లేదు..10నుండి 14రోజులు చికిత్స చాలు..కరోనానుండి కోలుకోటానికి..కరోనా లక్షణాలు ఉంటే దాచుకోకండి...ఎవరికివారు ముందుకొచ్చి పరిక్ష చేయించుకొని కరోనా సోకిందని తేలితే చికిత్స పొందండి..అదికూడా ఉచితంగానే ప్రభుత్వం వైధ్యం అందిస్తుంది....కరోనా ఎవరికైనా రావచ్చు కాబట్టి కరోనా వచ్చిన వారిని వివక్షతతో చూడకండి ఎందుకంటే రేపు మీకూ సోకచ్చు...
ఎక్కడైనా కరోనా వస్తే మాత్రం ఆప్రాంతంలో ప్రజలను ప్రభుత్వం అలెర్ట్ చేస్తుంది. పాజిటివ్ వచ్చిన ప్రాంతంలో కంటోన్మెంట్ క్లస్టర్లను ప్రకటించి అప్రమత్తం చేస్తుంది. బారికేడ్లు పెట్టేస్తారు. పోలీసులు కాపలా ఉంటారు. సో... అప్పుడు మీకే తెలుస్తుంది...! ఆరోగ్యసేతు యాప్ వాడుకోండి. అలెర్ట్ వస్తుంది. పుకార్లు, ప్రచారం నమ్మకండి. ఏ ఊర్లో అయినా కరోనా వస్తే కచ్చితంగా అధికారిక ప్రకటన ఇచ్చి, ఆప్రాంత ప్రజలను అలెర్ట్ చేస్తారు
లాక్ డౌన్ మార్చి 23 నుండి ప్రారంభించారు. అప్పుడు దేశంలో రోజుకి 500 కేసులు నమోదవ్వగా... ఇప్పుడు దేశంలో రోజుకి 4 వేలుకి పైగా కేసులు నమోదవుతున్నాయి. అంటే... లాక్ డౌన్ వలన కరోనాని 80% నియంత్రించగలిగాం.., కానీ పూర్తిగా ఆపలేము అనేది అర్దమైంది.... .ప్రజలు ఎవరికి వారు జాగర్తలు తీసుకొంటే గానీ కరోనా ఆగదు. అందుకే ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాలి. అదే ప్రతి ఒక్కరు వారికోసం వారికుంటుంబసభ్యులకోసం ఇంట్లోంచి బయటకి వస్తే జాగర్తకు కచ్చితంగా పాటించాలి...
లాక్ డౌన్ నెమ్మదిగా సడలిస్తారు. క్రమేణా కరోనా తగ్గకపోయినా లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసే అవకాశాలు మనముందు కనపడుతున్నాయి ..
AP CM జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నట్టు కరోనాకి వాక్సిన్ వచ్చే వరకు అది మనతోనే ఉంటుంది. ఎప్పుడైనా, ఎవరికైనా రావచ్చు. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ, మాజీ సీఎం చంద్రబాబు కూడా పరోక్షంగా చెప్తూనే ఉన్నారు.... అయితే సీఎం జగన్ మాత్రం నేరుగా చెప్పేసారు. ఏది ఏమైనా ఇది వినడానికి ఏదోలా అనుకున్నా ప్రస్తుత వాస్తవం మాత్రం ఇదే.....
కరోనా మనల్ని వదలదు. పూర్తిస్థాయి వాక్సిన్ వచ్చే వరకు మన జాగ్రత్తలతో మనం ఉండాలి. ప్రపంచంలో ఎయిడ్స్, డెంగ్యూ వంటి రోగాలకు మందు లేదు, వాక్సిన్ లేదు. కానీ అప్రమత్తమై మనం జాగ్రత్తగా ఉంటున్నాం కదా. అలాగే కరోనా విషయంలో కూడా ఎవరికి వారు తమకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జూన్ చివరి వరకు పరిస్థితి తీవ్రంగా ఉంటుందని తెలంగాణా సీఎం కేసీఆర్ ఒకసారి ప్రస్తావించారు.
అందుకే చెప్పేదేమిటంటే... కరోనాపై అత్యుత్సాహం వద్దు. మీ మీ మైండ్ నుండి దాన్ని తీసేసి లాక్ డౌన్ తర్వాత కుటుంబాలు, జీవితాలు, రోజువారీ కార్యక్రమాలు, మన బతుకులు చూసుకుని..., ఆ కరోనా మహమ్మారి రాకుండా జాగ్రత్తగా తీసుకొవడమే ప్రజలు చేయాల్సింది....
అవసరమైతేనే బయటకు రండి. మూతికి మాస్కులు వేసుకోవాల్సిందే. సానిటైజేర్లు జేబులో పెట్టుకుని గంటకోసారి శుభ్రం చేసుకోవాల్సిందే. భౌతిక దూరం పాటించాల్సిందే. అన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే...!! అన్నిటికంటే ముఖ్యంగా కరోనా వచ్చినా త్వరగా కోలుకునేందుకు వీలుగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇది తప్పనిసరి.
ఇతర దేశాలలో కరోనా విలయతాండవం చూస్తున్నాం.. ఇతరదేశాలకంటే ఇండియాలో మరణాలు తక్కువగా ఉన్నాయి అంటే కారణం... మన ఆహారపు అలవాట్లలో పెరుగు మాత్రం రోగ నిరోధకశక్తిని పెంచడంలో చాలా ప్రధానమైందట సో బాగా పెరుగు,పళ్ళు తీసుకోండి...., మన యోగ, మన ఆయుర్వేదం, మన పద్ధతులే, మన దేహానిశక్తి... సో... ఎవరికి వారు స్వతహాగా సిద్ధంగా ఉండటమే బెటర్ అనిపిస్తుంది...!!!