01/07/2023
*పేద గుండెలకు ధైర్యం "మన కారసాని"*
*జూలై 1 డాక్టర్స్ డే, అదే రోజున డాక్టర్ కారసాని శ్రీనివాస రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను*.💐🌹🌷🌷🌹💐💐🌹🌷🌷🌹
గత రెండు దశాబ్దాలకు పైబడిన సుదీర్ఘ " *వైద్య ..సేవ*"ల ప్రయాణం.. ఉమ్మడి *గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల గుండె ధైర్యం*... పల్లె ప్రాంతంలో పుట్టిన ఆయన పల్లె ప్రజలకు తన సేవలు ఉపయోగపడాలన్న సంకల్పం ఇప్పటికే వేలాదిమందికి ప్రాణo పోసింది.
ప్రజలు అతి ఖరీదుగా భావించే గుండె వైద్యాన్ని తక్కువ ఖర్చులో అందజేస్తూ *ప్రాణదాత* గా నిలిచారు... మన *డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి*.
ఒకప్పుడు గుండె వైద్యం అంటే గుండెలు పగిలే రోజులవి .. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పెద్ద పట్టణాలకు పరిగెత్తాల్సిన పరిస్థితి... అప్పుసప్పులతో వైద్యం చేయించుకుని బతుకు జీవుడా అంటూ బయటపడిన రోజులు.. మనలో చాలామందికి గుర్తే ఉండొచ్చు....
అలాంటి పరిస్థితులను అధిగమిస్తూ పల్నాడు జిల్లా కేంద్రానికి మణిహారం లాంటి " *మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్* " వస్తుందని మన ఊహలకు అందకుండానే వాస్తవ రూపం దాల్చింది.
చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, లక్ష్యంతో ముందుకు సాగడం ఆయన నైజం. జీవితంలో కష్టమెరిగి , వైద్యం అంటే ఇష్టపడి పట్టుదలతో చదివారు. అంతటా మెరుగైన గుండె వైద్య శాస్త్రాన్ని అవపోసన పట్టారు.
మనందరికీ గుండె వైద్యం చేరువ చేసేందుకు నరసరావుపేటకు వచ్చారు..... మన *డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి*.
ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్ స్థాయి వైద్యాన్ని ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల ప్రజలకు చేరువ చేశారు.
ఢిల్లీ , ముంబై , హైదరాబాదు లాంటి మెట్రో నగరాలే కాదు విజయవాడ , గుంటూరు లాంటి పట్టణాలలో అయ్యే ఖర్చులో సగం కన్నా తక్కువ ఖర్చు కే మెరుగైన వైద్యం అందిస్తూ లక్షలాదిమంది ప్రజలకు ప్రాణం పోస్తున్నారు.
ఈ రోజున *మహాత్మా గాంధీ హాస్పిటల్స్* అనే పేరు, *డాక్టర్ కారసాని* అనే పేరు ఒక బ్రాండ్ గా నిలిచి వైద్య రంగంలో పలనాడుకు రాష్ట్రంలోనే గొప్ప పేరు తెచ్చిపెట్టారు.
*గుండె వైద్యం అంటే భయపడే పరిస్థితిని అధిగమించి పేదలకు సైతం గుండె వైద్యాన్ని చేరువ చేశారు*.
గుండె వైద్యానికి మాత్రమే తన సేవలు పరిమితం చేసుకోలేదు.
సాధించాల్సింది... ప్రజలకు చేయాల్సింది ఎంతో ఉందన్న ఆయన తలంపుతో మెదడు నరముల వైద్యవిభాగం, కిడ్నీ వైద్య విభాగం, ఊపిరితిత్తుల వైద్య విభాగం డెర్మటాలజీ , కాస్మటాలజీ ఇవన్నీ కలగలిపి ఈరోజున *మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను సంపూర్ణ వైద్యాలయం* గా తీర్చిదిద్దారు. మన *డాక్టర్ కారసాని శ్రీనివాస రెడ్డి* గారు.
అంతే కాదు ఆయనలోని మరో కోణాన్ని ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. *గొప్ప మానవతా మూర్తి ఆయన. విద్య పట్ల అనుకున్న అమితమైన ప్రేమ తో ఎందరో నిరుపేదలను తన సొంత ఖర్చులతో చదివిస్తున్నారు. ఎన్నో పాఠశాలల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారు. విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని .... తన వంతుగా బాధ్యత ఎరిగిన భారతీయ పౌరునిగా గొప్ప కృషి చేస్తున్నారు. ఇంత గొప్ప మానవతా మూర్తి .... వైద్య రంగానికి మణిహారం... గొప్ప హృదయ వైద్యుడు ... పేద ప్రజల గుండెచప్పుడు అయిన మన *డాక్టర్ కారసాని శ్రీనివాస రెడ్డి* గారు *జూలై 1న డాక్టర్స్ డే* రోజున జన్మించటం మన అందరికీ గొప్ప అదృష్టం. ఆ మహనీయునికి మనసారా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని పేద ప్రజలకు మీ సేవలు కలకాలం అందాలని కోరుకుంటున్నాం.🌹🌷🌹🌷💐🌷🌹💐💐🌹🌷🌷🌹💐https://youtube.com/watch?v=XCihpM7XNbU&feature=share9