19/09/2025
ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. తెలంగాణ అభివృద్ధి, ప్రజా ప్రభుత్వ ఆలోచనను మరొక్కసారి ఈ వేదిక పై వివరించాను.
పరిపాలన చేసేందుకు రాజకీయ సంకల్పం ఎంతో అవసరం.. భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాలనేది మా ఆలోచన.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి “తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047”రూపొందిస్తున్నాం. మొత్తం రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా ఈ ప్రణాళికలో విభజించాం. కోర్ అర్బన్ ఏరియాలో కోటి మంది నివసిస్తున్నారు... ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తున్నాం. సెమీ అర్బన్ ఏరియాను తయారీ రంగం జోన్ గా (మాన్యుఫాక్చర్) నిర్ణయించాం.
తెలంగాణలో అభివృద్ధికి తగినట్లు 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీటర్లు పొడిగించాలని నిర్ణయించాం. ప్రస్తుతం నిత్యం అయిదు లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దానిని 15 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
సబర్మతీ తీరంలా మూసీని మారుస్తాం. అందుకు మూసీ పునరుజ్జీవంపై దృష్టి సారించాం. హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నాం.
2027 నాటికి హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా ఉండనున్నాయి.. అందుకే ఈవీలకు రాయితీలు ప్రకటించాం. రాష్ట్ర అవసAnumula Revanth Reddyజినల్ రింగ్ రోడ్ నిర్మాణం
Anumula Revanth Reddy