12/04/2025
( న్యూస్ వన్ బ్యూరో ) ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందంటారు. ఇప్పుడు విశాఖ మేయర్ విషయంలో వైసీపీ నిర్ణయాలు బొత్స సత్యనారాయణ కు సవాలుగా మారాయి. ఏడాది కాలం కూడా లేని పదవి కోసం పెట్టిన శిబిరాలు ఫలిస్తాయా? ఫలితం రాకపోతే తనకు నష్టం కలుగుతుందా అన్న ఆలోచనలో ఇప్పుడు బొత్స ఉన్నట్టు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ మేయర్ పీఠం ఆ పార్టీ దక్కించుకుంది. మేయర్ గా బీసీ మహిళ గొలగాని హరి వెంకట కుమారిని పార్టీ నియమించింది. వాస్తవానికి మేయర్ హరి వెంకట కుమారి అయినప్పటికీ పెద్దరికమంతా వైసీపీ పెద్దలదే....