Tirumala times

  • Home
  • Tirumala times

Tirumala times Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tirumala times, Media/News Company, .

14/07/2025

తిరుమల కొండలు



అప్పలాయగుంటలో వైభవంగా పుష్పయాగంఅప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగం వైభవంగా జరిగింది.ఈ...
12/07/2025

అప్పలాయగుంటలో వైభవంగా పుష్పయాగం

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగం వైభవంగా జరిగింది.

ఈ ఆలయంలో జూన్ 07 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారికి స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ముందుగా పుష్పయాగం కోసం వినియోగించే పుష్పాలను ఆలయంలో మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ప్రదక్షిణగా వెళ్లి మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిని కొలువుతీర్చారు.

మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో పుష్పయాగం నిర్వహించారు. ఒక టన్ను పుష్పాలను ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి టిటిడి సరఫరా చేసింది. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహించారు.


10/07/2025

తిరుమలలో వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ

Garuda Seva on Vyasa Poornima

వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమలలో గురువారం రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

On the auspicious occasion of Guru Poornima also known as Vyasa Poornima, the sacred Garuda Vahana Seva was performed with celestial grandeur at the Srivari Temple in Tirumala on Thursday evening.

Adorned in all divine ornaments, Sri Malayappa Swamy was taken for a majestic procession on Garuda Vahanam along the four mada streets, blessing thousands of devotees.


09/06/2025

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగింపుగా ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జ్యేష్ఠాభిషేకంలో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరించారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.



22/05/2025

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామం తత్ తుల్యం రామనామం వరాననే ||


12/05/2025

తిరుమలలో వైభవంగా వైశాఖ మాస పౌర్ణమి గరుడ వాహన సేవ

Vaisakha Masa Purnima Garuda Vahana Seva in Tirumala


తిరుమ‌ల‌లో వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభంPADMAVATI PARINAYOTSAVAMS held
06/05/2025

తిరుమ‌ల‌లో వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం

PADMAVATI PARINAYOTSAVAMS held

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Tirumala times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tirumala times:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share