07/04/2025
PNR NEWS...
*పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు*
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాడి దెబ్బకు ఆక్వా సాగుకు గండిపడిందంటున్న జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజు..
ఆక్వా రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు సిండికేట్ అయ్యి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రొయ్యల ఎగుమతిపై విధించిన 26% శాతం సుంకం సాకుగా చూపిస్తూ రైతుల పండించిన రొయ్యల పంటకు రేట్లు తగ్గించి ఆక్వా రైతుల కడుపు కొట్టారంటూన్న గాంధీ భగవాన్ రాజు..
ఆక్వా సాగుకు అవసరమైన రొయ్యలమేత, వివిధ ముడి సరుకుల రేట్లు తగ్గిన, రొయ్యల ఫీడ్ ధర తగ్గించడం లేదని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకుని ఆక్వా రైతుల సమస్యలను పరిష్కార దిశగా పరిష్కరించాలని, ఫీడ్ ధర, రొయ్యల సాగుకు మద్దతు ధర పెంచి రైతులను ఆదుకోవాలని లేని పక్షంలో జూలై 1 నుండి క్రాఫ్ హాలిడే ప్రకటిస్తామని సంఘ సభ్యులు తీర్మానించినట్లు గాంధీ భగవాన్ రాజు తెలియజేశారు.