Sangi Media

Sangi Media We are all told, “live your life to the fullest”; I am here to do just that. SANGI MEDIA serves

20/02/2022

This is the tight fight with Narendra Reddy MLA Kodangal..... బిడ్డ నువ్వు ఎలా గెలుస్తావ్ నేను చూస్తా... ఇంకొకసారి మా పిల్లలను కొట్టించడం వచ్చేసావా నేను కూడా దిగాల్సి వస్తుంది 50 మంది ట్రాన్స్జెండర్స్ తీసుకువచ్చి నీ ఎదుట పెడతాను.... వారు మొత్తం కోస్గి కొడంగల్ తాండూర్ వాళ్ళు.... తెలంగాణ కు సంబంధించిన వాళ్ళు... అప్పుడు చూద్దాం మీ అన్నుబాయ్ డించక

*ఆత్మహత్యలులేని తెలంగాణ కావాలి:డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్* ఆత్మహత్యలు లేని తెలంగాణ రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో...
20/02/2022

*ఆత్మహత్యలులేని తెలంగాణ కావాలి:డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్*

ఆత్మహత్యలు లేని తెలంగాణ రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా కరీంనగర్ పట్టణంలో రెవెన్యూ గార్డెన్ లో జరిగిన బీసీ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కరీంనగర్ జిల్లా కమిటీ ఆద్వర్యం లో జరిగినది .
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ముంపు బాధితుడు పరిహారం కోసం గొడుగు దేవదాస్ ముదిరాజ్,గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థి వంశీకృష్ణ ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీ కులాల జన గణన చేపట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణ సంపద వర్గాల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్న కేసీఆర్ వాటిని పేదలకు పంచడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎంత మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ కాంట్రాక్టర్లున్నారో బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేసుకుంటున్నారని విమర్శించారు.

తరతరాలుగా అధికారానికి దూరంగా ఉన్న బహుజనులను పాలకులను చేయడానికే బీఎస్పీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలు ఆత్మహత్యలు ప్రేరేపించే విధంగా ఉన్నాయన్న ఆయన బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా పేదలకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు పాటించడం లేదని విమర్శించిన ఆయన కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసమే దళిత బంధు ప్రవేశపెట్టి దళితుల మధ్య కుల కుమ్ములాటలకు తెరతీశారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేద ప్రజల అభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన ఆస్తులు అమ్మి గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర పెట్టి, పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.

దేశంలో హిందూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్న కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి పథకాలు ప్రవేశపెట్టి,ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలు ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అలుగునూర్ క్రాస్ రోడ్డు నుండి భారీ ర్యాలీతో కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్ కు చేరుకున్న ఆయనకు కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా ఘ‌న‌స్వాగ‌తం పలికారు. ఈ కార్యక్రమానికి పల్లె ప్రశాంత్ గౌడ్ , సభాద్యక్షత వహించగా , జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ నిషాని రామచంద్రం సమన్వయపరిచారు . జిల్లా అధ్యక్షుడిని పట్టు వదలని విక్రమార్కుడు అని కొనియాడారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు దేవోళ్ల గంగాదర్ రాష్ట్ర కో ఆర్డినేటర్ , సదుర్ల మళ్లేషం రాష్ట్ర కో ఆర్డినేటర్ , ఎనగందుల వెంకన్న రాష్ట్ర ప్రదాన కార్యదర్శి , దొడ్డే సమ్మయ్య రాష్ట్ర కార్యదర్శి , మాతంగి అశోక్ జిల్లా ఇంచార్జ్ , శీలం రాజయ్య,జన్ను స్వరూప, అకెనపెల్లి శిరీష , మహేష్,సంగుపట్ల మళ్లేషం , మాంకాళి తిరుపతి , మారెపెల్లి మొగిలయ్య, పోతర్ల రాజు, జమున, సుమలత, అనురాద, సుజాత , భాగ్యశ్రీ॥ కొంకటి శేఖర్ , కుమ్మరి సంపత్, నిషాని రాజమల్లు, దాసారపు సదానందం, గాలి అనీల్ , నల్లాల శ్రీనివాస్ , కొమ్మగల్ల సాయి కృష్ణ , డాక్టర్ నిషాని శ్రీనివాస్,చెరుకూరి నాగేశ్వర్ రావు, లింగాల శ్రీనివాస్,సుధాకర్, అభిలాష్, అంబల సతీశ్, సిరిసిల్ల అంజయ్య, సీనియర్ నాయకులు మంద బాలయ్య , చిలుముల శంకర్, కొమ్మగల్ల అనీల్, సురేశ్, రాపాక అనీల్, ఎర్ర సురేశ్, కొమ్మగల్ల ఆంజనేయులు, రాపాక స్వామీ, సారయ్య,జ్యోతిరావు, కనుకుంట్ల స్వామీ, గౌతమ్, అరెళ్లి రాజు,విష్ణు, సతీశ్,తదితరులు పాల్గొన్నారు...

*ఈనెల 18న మేడారం రానున్న సీఎం కేసీఆర్* మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి ...
14/02/2022

*ఈనెల 18న మేడారం రానున్న సీఎం కేసీఆర్*

మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా జారతకు వస్తారన్నారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలకు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతరకు విజయవంతం చేయాలన్నారు. మేడారం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 34 పార్కింగ్ ప్లేస్ లను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడా ఏ సమస్య రాకుండా చూసేందుకు జాతరలో మొత్తం 40 వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు.

మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర చాలా కీలకమని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గతంలో 3,300 బస్సులను జాతరకు నడపగా.. ఈసారి మరో 500 పెంచామని, మొత్తం 3800 బస్సులు నడపనున్నామని చెప్పారు. ఆర్టీసీలో ప్రయాణించే భక్తులు మాత్రమే సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెలకు సమీపంలో దిగుతారని చెప్పారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Hyderabad:*తెలంగాణ రాష్ట్రంలో 43 మంది యం.ఆర్.ఓ లు అక్రమాలకు పాల్పడ్డారు*🔥🔥🔥🔥🔥ఉమ్మడి జిల్లాలలోని 43 మంది MROలు, రెవెన్యూ ...
17/10/2021

Hyderabad:*తెలంగాణ రాష్ట్రంలో 43 మంది యం.ఆర్.ఓ లు అక్రమాలకు పాల్పడ్డారు*
🔥🔥🔥🔥🔥

ఉమ్మడి జిల్లాలలోని 43 మంది MROలు, రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు

*కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో అవకతవకలపై విచారించి నివేదిక ఇచ్చిన విజిలెన్స్*

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అక్రమాలు, అవకతవకలు నిజమేనని నిర్ధారణ అయింది.

ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేయగా అవకతవకలు నిజమేనని తేలింది. అనర్హులకు డబ్బులు చెల్లించి వారి వద్ద నుంచి లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల్లో అనర్హులకు నగదు చెల్లించిన తాహశీల్దార్లు,ఆర్ఐలు, విఆర్ఏలు 43 మంది అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ నివేదికలో వెల్లడైంది. క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్, ఎంఐఎం లీడర్లు, వారి అనుచరులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తాహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, మరికొందరు బ్రోకర్లు కలసి అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో నిగ్గుతేలింది. రాష్ట్రంలో 10 జిల్లాలకు చెందిన 43 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది పేదలను ఏ విధంగా దోచుకున్నదీ విజిలెన్స్ విభాగం తన నివేదికలో స్పష్టంగా వివరించింది. విచారణలో బయటపడ్డ అక్రమాల్లో మచ్చుకు కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ ఆర్డీవో ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం దరఖాస్తుల ప్రక్రయలో రూ. 86.09 లక్షల మొత్తం దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గుడి హత్నూర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెం. 148/2020 కింద నిందితునిపై ఐపీసీ 420, 403, 409 సెక్షన్ల కింద అలాగే ఐటీ యాక్ట్ 66 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
వరంగల్ అర్బన్ (ప్రస్తుత హనుమకొండ) జిల్లా: ధర్మసాగర్ తాహశీల్దార్ ఆఫీసు కేంద్రంగా అవినీతి జరిగింది. ఇక్కడి తాహశీల్దార్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా భారీ ఎత్తున లంచాలు స్వీకరించినట్లు విజిలెన్స్ నివేదిక పేర్కొంది. ఇందుకోసం తాహశీల్దార్ కొందరు ప్రజా ప్రతినిధులను, ఇతరులను బ్రోకర్లుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడినట్లు నివేదికలో స్పష్టంగా ఉంది. తాహశీల్దార్ లంచాల భాగోతపు వసూళ్లలో మాజీ ఎంపీపీ గుడి వెనుక దేవేందర్, నారాయణగిరి సర్పంచ్ కర్ర సోమిరెడ్డితోపాటు సోంపల్లి కరుణాకర్ ప్రమేయమున్నట్లు విజిలెన్స్ నిర్ధారించింది.
ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, *జయశంకర్ భూపాలపల్లి*, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మొత్తం 43 మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియలో లంచాల రూపంలో వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ నివేదిక వివరించింది. దరఖాస్తుదారుల నుంచి రూ. వెయ్యి నుంచి పది వేల వరకు వసూళ్లు చేసినట్లు కూడా విజిలెన్స్ నివేదిక ప్రస్తావించింది. లంచాల రూపంలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. అధికారులు. అక్రమాలకు పాల్పడిన 43 మంది రెవెన్యూ సిబ్బందిలో తాహశీల్దార్లు, డిప్యూటీ తాహశీల్దార్లు, వీఆర్వోలు, వీఆర్ ఏలతోపాటు స్థానికులు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది. అయితే వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ తాహశీల్దార్ గా విజిలెన్స్ జాబితాలో తొలి పేరుగా ప్రస్తావించిన ఎం. రాజ్ కుమార్ ఎవరనే అంశంపై రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.
వాస్తవానికి ఈ పేరుతో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేస్తున్న కాలం నుంచి, అంటే గడచిన ఏడేళ్ల కాలంలో రాజ్ కుమార్ అనే పేరు గల అధికారి ఎవరూ ఇక్కడ తాహశీల్దార్ గా పనిచేసిన దాఖలాలు లేవు. గత కొంత కాలంగా సీహెచ్ రాజు అనే అధికారి మాత్రమే ఇక్కడ తాహశీల్దార్ గా పనిచేస్తున్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు సమర్పణ సమయంలోనే ధర్మసాగర్ తాహశీల్దార్ రాజ్ కుమార్. అందినకాడికి లంచాలు స్వీకరించినట్లు విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లాల వారీగా అక్రమార్కులకు పాల్పడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ రూరల్ జిల్లా: ఎంఆర్ఐలు పరకాల ఏ సంపత్ కుమార్, శాయంపేట హేమ నాయక్, సంగెం ఆనంద్ కుమార్, చెన్నారావుపేట సిహెచ్ స్వామి, నల్లబెల్లి వి సదయ్య, దుగ్గొండి జ్యోతి, నర్సంపేట గడ్డం ఉమా.
జనగామ జిల్లా: జనగామ తల్లూరి కృష్ణ ప్రసాద్, స్టేషన్ ఘనా పూర్ కృష్ణస్వామి, నర్మెట్ల బీ నరసింహ నాయక్, తరిగొప్పుల రంజిత్ నాయక్, జాఫర్ గడ్ రాంబాబు, పాలకుర్తి కే రవి, *జయశంకర్ జిల్లా భూపాలపల్లి ఆర్ఐ దేవేందర్,*కంప్యూటర్ ఆపరేటర్ నరేష్*,ములుగు గనాపూర్ శ్రావణ్.
మహబూబాద్ జిల్లా: మహబూబాబాద్ గూడూర్ తాహసిల్దార్ శైలజ, కేసముద్రం రిటైర్డ్ తాహసిల్దార్ ఎం వెంకట్ రెడ్డి, మహబూబాబాద్ తాహసిల్దార్ ఎం రంజిత్ కుమార్.
నల్గొండ జిల్లా త్రిపురం తాహసిల్దార్ కేసి ప్రమీల, ఆర్ఐ విగ్నేశ్వర రెడ్డి, ఆర్ఐ జోషి, నిడమనూరు తాహసిల్దార్ హెచ్ ప్రమీల, తిరుమలగిరి తాహసిల్దార్ పాండు నాయక్, దామరచర్ల ఆర్ఐ నాగరాజు, మిర్యాలగూడ టౌన్ ఆర్ ఐ శ్యాంసుందర్, రూరల్ ఆర్ ఐ సత్యనారాయణ, వేములపల్లి ఆర్ఐ సోయిరాం, ఆర్ ఐ శ్రీధర్ రెడ్డి, నక్రేకల్ తాహసిల్దార్ జంగయ్య, కేతపల్లి తాహసిల్దార్ వెంకటేశ్వర్లు.
సూర్యాపేట జిల్లా: నూతనకల్ ఏఆర్ ఐ సుజిత్ కుమార్.
ఆదిలాబాద్: జిల్లా కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్ నదీం, మీ సేవ నిర్వాహకులు సిందే అచ్యుత్, జాదవ్ శ్రీనివాస్, మొయినుద్దీన్, బాలకృష్ణ, సునీల్, మీసాల శంకర్, జ్ఞానేశ్వర్, దినేష్, నిర్మల.
నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తి ఆర్ఐ శశికాంత్, కొల్లాపూర్ విఆర్వో నవీన్ రెడ్డి, వంగూరు ఆర్ఐ సీతారాం నాయక్, ఆర్ ఐ మంజుల, ఉప్పునుంతల ఆర్ఐ పద్మ.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ డిప్యూటీ తాహసీల్దార్ జానకి, ముప్పకల్ ఆర్ఐ గంగాధర్, నిజామాబాద్ సౌత్ తాహసీల్దార్ ప్రసాద్, ఆర్ ఐ రాజు,నిజామాబాద్ నార్త్ నారాయణ తాహసిల్దార్ నారాయణ, డిప్యూటీ తాహసీల్దార్ మధు, ఆర్ఐ దశరథ్ అలీతోపాటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, సర్పంచులు. వీరిలో ధర్మసాగర్ మాజీ ఎంపీపీ గుడి వెనుక దేవేందర్, నారాయణగిరి సర్పంచ్ కర్ర సోమిరెడ్డి, సోంపల్లి కర్నకర్, వేలేరు మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేష్, ఎంపీపీ కె.సి.రెడ్డి సమ్మిరెడ్డి, పాలకుర్తి గూడూరు వీఆర్ఏ ఎల్లయ్య, *భూపాలపల్లి మీసేవ సెంటర్ నిర్వాహకులు పి. తిరుపతి, కే.కిరణ్*, మహబూబాబాద్ గూడూరు విఆర్వో ఉప్పలయ్య, గూడూరు సురేందర్, వైస్ ఎంపీపీ వీరన్న.కేసముద్రం తహసీల్దార్ టైపిస్ట్ వెంకన్న, బ్రోకర్ లింగమూర్తి, వీఆర్వో కొమ్మాలు, సదా రపు సత్యనారాయణ, వెంకటగిరి సర్పంచ్, కేసముద్రం సర్పంచ్ ప్రభాకర్, స్టేషన్ సర్పంచ్ బట్టు శీను, కేసముద్రం టీఆర్ఎస్ ప్రెసిడెంట్ వీరు నాయక్.
నిజామాబాద్ జిల్లా: బాల్కొండ టిఆర్ఎస్ ఉపసర్పంచ్ అబ్దుల్ వాహిద్, ఎంపీపీ సామ వెంకట్ రెడ్డి, మల్లెల లక్ష్మణ్, భీంగల్ మున్సిపల్ కోఆప్షన్ మేంబర్ మోహిన్, అశ్వక్, కరీం, మోసిన్, సలీం, రబ్బానీ.
మహబూబాబాద్ తాహసిల్దార్ కార్యాలయం: జూనియర్ అసిస్టెంట్ కీర్తన్, నల్గొండ జిల్లా ముకుందాపురం ఆర్ ఐ రామారావు, పంచాయతీ సెక్రటరీ శ్రీదేవి, బ్రోకర్ సైదిరెడ్డి, దొర పల్లి నాగరాజు, తిరుమలగిరి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రవి, ఆర్ ఐ ఈషాక్, బ్రోకర్ శంకర్ నాయక్, జవహర్ లాల్, ముని నాయక్, నకిరేకల్ ఆర్ఐ రాంప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ రాజు, కేతపల్లి ఆర్ఐ శ్యాంసుందర్ రెడ్డి, అసిస్టెంట్ ఆర్ఐ రాజ్యలక్ష్మి, కంప్యూటర్ ఆపరేటర్ సాగర్ తదితరులు ఉన్నారు.
Pic by tv9

Hyderabad :ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీతెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలుపామేడు-కొ...
16/10/2021

Hyderabad :ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు

పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు

నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తి

అంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులు
మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి

ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించిన మావోయిస్టులు

28/09/2021

*న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు)*

_*నేతలతో కుమ్మక్కైన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు*_

*పార్టీలతో అంట కాగిన అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్ వీ రమణ వ్యాఖ్యానించారు.*

*- అధికారంలో ఉన్న పార్టీతో సన్నిహితంగా మెలిగి డబ్బులు గుంజుకొనే పోలీసు అధికారులు.. ప్రభుత్వం మారినప్పుడు తప్పనిసరిగా తిరిగి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు.*

★ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, పోలీసులు కుమ్మక్కవడం దేశంలో కొత్త విధానంగా మారిందని సోమవారం సుప్రీంకోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించింది.

★ అధికారంలో ఉన్న పార్టీతో సన్నిహితంగా మెలిగి డబ్బులు గుంజుకొనే పోలీసు అధికారులు ప్రభుత్వం మారినప్పుడు తప్పనిసరిగా తిరిగి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పింది.

★ అలాంటి పోలీసులను ఎందుకు రక్షించాలని ప్రశ్నించింది.

★ వారు జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొంది.

★ లంచాలు తీసుకున్నారన్న ఆరోపణపై ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి గుర్జీందర్‌ పాల్‌ సింగ్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

★ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసుతో పాటు, రాజద్రోహం అభియోగాన్ని కూడా మోపింది.

★ ఈ కేసుల్లో తనను అరెస్టు చేయకుండా రక్షించాలని కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

★ ఆయనను ప్రస్తుతం అరెస్టు చేయకూడదంటూ తాత్కాలిక రక్షణ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇలాంటి అధికారుల ప్రవర్తనపై కీలక వ్యాఖ్యలు చేసింది.

★ ఆయనపై నమోదయిన మరో రెండు కేసుల్లోనూ ఇలాంటి రక్షణ ఆదేశాలే జారీ చేసింది.

★ ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ మాట్లాడుతూ _*"ప్రతి కేసులోనూ మీరు రక్షణ పొందలేరు. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి మీరు డబ్బును గుంజుకోగలిగారు. అయితే ఏదో ఒక రోజున దీన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది మరీ దారుణం. ఇలాంటి అధికారులను ఎందుకు రక్షించాలి? దేశంలో ఇదో కొత్త ధోరణి ప్రబలుతోంది"*_ అని అన్నారు.

★ ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ కల్పించుకొని అలాంటి అధికారులను రక్షించాల్సి ఉందని చెప్పారు.

★ జస్టిస్‌ రమణ స్పందిస్తూ _*"లేదు..అలాంటి వారు జైలుకు వెళ్లాల్సి ఉంది"*_ అని అన్నారు.

★ న్యాయవాది స్పందిస్తూ నిజాయితీపరులైన అధికారులు వేధింపులకు గురవుతున్నారని, అలాంటి వారిని రక్షించాల్సి ఉందని చెప్పారు.

★ ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

★ ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు.

★ మరో కేసులో ఇదే అధికారిని అరెస్టు చేయకుండా ఆగస్టు 26న కూడా సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది.

★ ప్రభుత్వాలు మారినప్పుడు పోలీసు అధికారులపై రాజద్రోహం, ఇతర కేసులు నమోదు చేయడం కొత్త విధానంగా మారిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

★ _*"అధికారంలోని పార్టీ పక్షాన వ్యవహరించినప్పుడు అంతా సవ్యంగా సాగిపోతుంది. పార్టీ మారినప్పుడు అదే అధికారిపై కేసులు నమోదవుతాయి. కుమ్మక్కయ్యే ఈ పద్ధతి మారాలి"*_ అని ఆ సందర్భంగా జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు.

_*బలహీనవర్గాల కేసులకూ ప్రాధాన్యమివ్వాలి*_

★ కేసుల విచారణ తేదీని నిర్ణయించే 'మెన్షనింగ్‌' ప్రక్రియలో కేవలం కార్పొరేట్‌ వాటికే పరిమితం కాకుండా, బలహీనవర్గాలకు చెందిన కేసులకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు.

★ మెన్షనింగ్‌ విధానాన్ని క్రమబద్ధీకరిస్తున్నట్లు సోమవారం ఆయన వెల్లడించారు.

★ సీనియర్‌ న్యాయవాది సి.యు.సింగ్‌... ఓ కార్పొరేట్‌ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు.

★ ఈ అంశానికి ప్రాధాన్యమిచ్చి, త్వరగా విచారణ చేపట్టాలని అభ్యర్థించారు.

★ ఆ సందర్భంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పందించారు.

★ _*"మనం కొంచెం ఆగాలి. మెన్షనింగ్‌ విధానాన్ని క్రమబద్ధీకరిస్తున్నాం. కార్పొరేట్‌ న్యాయవాదులంతా వచ్చి వారి కేసులను ప్రస్తావిస్తున్నారు. దానివల్ల మిగతా కేసులు వెనక్కు వెళ్లిపోతున్నాయి. క్రిమినల్‌ అప్పీళ్లు, ఇతర కేసులు పెండింగులో ఉన్నాయి. బలహీనవర్గాల కేసులకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది"*_ అని ఆయన పేర్కొన్నారు.

★ ఇదే ధర్మాసనంలో జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లిలు కూడా ఉన్నారు.

*భారీ వర్షాల నేపథ్యంలో రేపు సెలవు ప్రకటించిన సి.ఎం. కేసీఆర్.* హైదరాబాద్ గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస...
27/09/2021

*భారీ వర్షాల నేపథ్యంలో రేపు సెలవు ప్రకటించిన సి.ఎం. కేసీఆర్.*

హైదరాబాద్
గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వాళ్ళ ఏర్పడ్డ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో నేడు సాయంత్రం సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు మంగళ వారం (28 .9 ..2021 )సెలవు ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి గారి ఆదేశాలననుసరించి తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిని సి.ఎస్. ఆదేశించారు. అయితే, అత్యవసర శాఖలైన రెవిన్యూ, పోలీస్, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ లు విధి నిర్వహణలో ఉండాలని, భారీ వర్షాల వాళ్ళ ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సి.ఎస్. సోమేశ్ కుమార్ తెలియ చేశారు.

https://youtu.be/HUDC-TXQuXY
06/09/2021

https://youtu.be/HUDC-TXQuXY

మల్లన్న ఆఫీస్ లో మళ్లీ పోలీసులు సోదాలు ... ,@ మల్లన్న ఆఫీస్ లో మళ్లీ పోలీసులు సోదాలు ... ,...

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Sangi Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share