Tirupati Talks

  • Home
  • Tirupati Talks

Tirupati Talks news

రేణిగుంట మండలం వెంకటాపురం చెరువును ఆక్రమించుకుంటున్నారు. మూడు రోజులుగా రాత్రి సమయంలో జేసీబీ, తిప్పర్ల తో చెరువును పూడ్చి...
03/10/2022

రేణిగుంట మండలం వెంకటాపురం చెరువును ఆక్రమించుకుంటున్నారు. మూడు రోజులుగా రాత్రి సమయంలో జేసీబీ, తిప్పర్ల తో చెరువును పూడ్చి వేస్తున్నారు. ఈ చెరువు తిరుపతి, కరకంబాడీ మార్గంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ చెరువును ఆక్రమించుకుని ప్లాట్లు వేసి అమ్ముకునేందుకు సిద్ధం చేస్తున్నారు. ఎకరం 7 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది.

05/08/2022
02/04/2022

తిరుపతి జిల్లా కలెక్టర్ గా వెంకట్ రమణ రెడ్డి.

అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా గిరీష.

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా మాధవి లత.

పుట్టపర్తి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్.

రాష్ట్రంలో 26 జిల్లాల కు కలెక్టర్లు, ఐపీఎస్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు .

02/04/2022

వికారినామ సంవత్సరము (2019) పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది...

శార్వరి (అంటే చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది...

ప్లవ నామ సంవత్సరం (2021)

ప్లవ అంటే, దాటించునది అని అర్థం.

"దుర్భిక్షాయ ప్లవ ఇతి తతశ్శోభనే భూరితోయం"...

దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది.

అంటే చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం.

వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి గదా. మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటూ కరోనా తదితర గండాలను దాటించేసింది.

నేడు ప్లవ నామ సంవత్సరం ముగించుకుని "శుభకృత్" నామ సంవత్సరం లో అడుగుపెడుతున్నాం...

ఆ తరువాతది " శోభకృత్" సంవత్సరము...

గత సంవత్సరాలు పేరుకు తగ్గ ఫలితాలు చూయించాయి కనుక...

ఈ శుభకృత్ నామ సంవత్సరం పేరుకు తగ్గట్టే మీకూ నాకూ మనందరికీ శుభాలు తెస్తుందని ఆశిస్తూ... అభిలషిస్తూ...

పెద్దలకూ... పూజ్యులకు... గురు సమానులకు...
బంధు మిత్రులకు... హితులకు... శ్రేయోభిలాషులకు... శుభకృత నామ
నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🙏🙏

24/03/2022

అమరావతిలో ఎకరా 60 కోట్లు పలుకుతుంది.

ప్రబుత్వం వద్ద ఉన్న 10,000 ఎకరాలు అమ్మితే 6 లక్షల కోట్ల డబ్బు వస్థుంది. ఆ డబ్బుతో రాజధాని నిర్మించవచ్చు.

రాజధానికి అప్పులు చేయవలసిన అవసరం లేదు : బొల్లి బాబు.

అది సరేరా బొల్లిగా
నీకు ఇదే కుల రాజధానిలో 4,000 ఎకరాల బినామీ భూమి ఉంది.
ఆ భూమి ఎకరా కనీసం ఎకరా యాబై కోట్లు అమ్మినా

నీ 4,000 ఎకరాల పొలం

2 లక్షల కోట్లు ఔతుంది కధరా.?

అంటే నీ 4,000 ఎకరాల భూముల ధరలకోసం మా రాయలసీమ ఉత్తరాంద్రలు నష్టపోవాలటరా బొల్లిగా.?

24/03/2022

🍁ఉచితం🍁
ఒక రోజున దొంగ ఒకడు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు.
ఇంటి ముందు కాపలాగా ఒక కుక్క ఉన్నది. దొంగను చూసింది కానీ ఏ చప్పుడు చేయకుండా చూస్తూ ఉన్నది. అతన్ని చూసి మొరగని కుక్కను చూసి దొంగ ఆలోచనలో పడ్డాడు. దొంగతనానికి వెళదామా? వద్దా? అని.
తీరా ఇంటి లోపలకు వెళ్ళాక కుక్క అరిచిందంటే ఏం చేయాలి? ఇప్పుడే అరిస్తే వేరే ఇంటికి దొంగతనానికి వెళ్లొచ్చు! అని అనుకున్నాడు.
ఇలా ఆలోచిస్తూ చివరగా తాను తెచ్చిన రొట్టెముక్కను కుక్కకు విసిరాడు. అంతే వెంటనే ఆ కుక్క గట్టిగా అరుస్తూ అతని వెంటపడి కరవడానికి ప్రయత్నించింది.
అప్పుడు దొంగ కుక్కతో ఇలా అన్నాడు. "నన్ను చూసికూడా అరవని నువ్వు రొట్టె ముక్క ఇవ్వగానే అరుస్తున్నావు ఎందుకు?" అని అడిగాడు.
నువ్వు ఊరికే ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు ఈ ఇంటి బంధువో లేక తెలిసిన వ్యక్తో అయిఉంటావని అనుకున్నాను.
కానీ ఎప్పుడైతే నువ్వు "ఉచితంగా రొట్టెముక్క ఇచ్చావో అప్పుడే నాకు అర్థమయింది నువ్వు దొంగవని", అని బదులిచ్చింది ఆ కుక్క.
ఆలోచించవలసిన విషయమే కదండీ ఇది. ఉచితం అనగానే ఆలోచన మరిచి ఎగబడుతున్నారు జనాలు.
"ఉచితంగా రొట్టె" ఇచ్చాడంటే అందులో ఎంతటి అర్థం ఉందో గ్రహించింది కుక్క. కానీ మషులమైన మనమే "ఉచితంగా డబ్బులు" ఎందుకు ఇస్తునారో గ్రహించలేక పోతున్నాం.
*_ఒక కుక్క గ్రహించిన చిన్న విషయాన్ని కూడా మానవులమైన మనం గ్రహించలేక పోతున్నందుకు చాల బాధగా ఉంది*._

కడప జిల్లాకు వైయస్సార్ పేరు పెడితే ఆ పేరు రాయడానికి చంద్రబాబు అను’కుల మీడియా ఇప్పటికీ సిగ్గుపడుతోంది. వెన్నుపోటు పొడిచిన...
27/01/2022

కడప జిల్లాకు వైయస్సార్ పేరు పెడితే ఆ పేరు రాయడానికి చంద్రబాబు అను’కుల మీడియా ఇప్పటికీ సిగ్గుపడుతోంది. వెన్నుపోటు పొడిచినందుకు పశ్చాతాపంగానైనా పెద్దాయనను గౌరవించాలని బాబుకు అనిపించలేదు. జగన్ గారు ఎన్టీఆర్ జిల్లాను ప్రకటిస్తే చాటుగా దుఖాన్ని దిగమింగుతున్నారు. reddy MP

❤️ వివాహం - జాతక చక్రం ❤️ (మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండివారికి ఉపయోగపడవచ్చు)వివాహ పొంతన విషయంలో తప్పనిసరిగా వదూవరులిద్దరి ...
02/01/2022

❤️ వివాహం - జాతక చక్రం ❤️
(మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి
వారికి ఉపయోగపడవచ్చు)

వివాహ పొంతన విషయంలో తప్పనిసరిగా వదూవరులిద్దరి జాతకచక్రంలో పంచమం (సంతానం కోసం), సప్తమ స్ధానం (దాంపత్య జీవితం), అష్టమ స్ధానం (వైదవ్యం), దశ , అంతర్దశలు (వివాహానంతర జీవితం) తప్పని సరిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. పాయింట్లకు ప్రాదాన్యత ఇవ్వరాదు. తారాబలం, గ్రహమైత్రి, నాడీమైత్రి బాగుండి జాతకచక్రం అనుకూలంగా ఉన్నప్పుడు వదూవరులిద్దరికి పొంతన కుదిరినట్లే.

వధూవరులకు వివాహ పొంతన చూసేటప్పుడు ముఖ్యముగా 8 కూటములను పరిగణన లో తీసుకొన్నారు .

1 వర్ణకూటమి 2 వశ్యకూటము ౩ తారాకూటమి 4 యోనికూటము 5 గ్రహకూటమి 6.గణకూటమి 7 రాశికూటమి 8 నాడీకూటమి

వీటిలో మొత్తం 18 గుణాలు దాటితే శుభం అనేది సామాన్య వచనం, కానీ సప్తమ, పంచమ, అష్టమ భావాలు సంపూర్ణ శుభత్వం ఉంటే వివాహం చేయవచ్చు. ఒక వేళ జన్మ నక్షత్రం తెలియకపోతే నామ నక్షత్రాన్ని అనుసరించి చూడాలి.

వర్ణకూటమి : స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే వర్ణమునకు చెందిన వారయితే మంచిది.

కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారు బ్రాహ్మణ వర్ణం.

మేషం, సింహం, దనస్సు రాశుల వారు క్షత్రియ వర్ణం.

మిధున, తుల, కుంభ రాశుల వారు వైశ్య వర్ణం.

వృషభ, కన్య, మకర రాశులు శూద్ర వర్ణం.

వదూవరులు ఇద్దరు ఏక వర్ణమైన ఉత్తమం. వధువు వర్ణం కంటే వరుడి వర్ణం ఎక్కువైన మద్యమం. వరుని వర్ణం కంటే వధువు వర్ణం ఎక్కువైన వర్ణ పొంతన కుదరదు.

2 . వశ్యపొంతన :
మేషరాశికి - సింహము, వృశ్చికం,
వృషభ రాశివారికి – కర్కాటక, తులారాశులు , మిదునమునకు – కన్యరాశి,
కర్కాటకరాశికి –వృశ్చికం, ధనుస్సు ,
సింహరాశికి – తులారాశి ,
కన్యకు – మిధున , మేషములు ,
తులా రాశికి – కన్య, మకరం,
వృశ్చికరాశికి – కర్కాటకం ,
ధనుస్సుకు –మీనము ,
మకర రాశికి – మేషం ,
కుంభం కుంభరాశికి – మేషము ,
మీనమునకు – మకరం

ఈ విధంగా పై రాశులు వశ్యము కలిగి ఉన్నవి . వధూవరులు ఇద్దరి రాశులు వశ్య పొంతన కలిగి ఉండవలెను .మిధున, కన్య, తుల నర రాసులు. వీటికి సింహం తప్ప తక్కినవన్నీ వశ్యములే. సింహానికి వృశ్చికం తప్ప అన్నీ వశ్యాలే.

౩. తారా పొంతన : స్త్రీ జన్మ నక్షత్రమునుండి పురుషుని జన్మ నక్షత్రము వరకు లెక్కించిన సంఖ్యను 9 చే భాగించగా 1 , ౩ , 5 , 7 శేషము వచ్చిన తారలు మంచివి కావు. అను జన్మతారలో చేసుకోవచ్చును.శుభతారలైతే 3 గుణాలు,అశుభ తారలైతే 1 న్నర గుణాలు ఉంటాయి.

4 . యోనిపొంతనము :

అశ్వని,శతభిషం-గుఱ్ఱం

స్వాతి,హస్త-ఎద్దు

ధనిష్ట,పూర్వాభాద్ర-సింహం

భరణి,రేవతి-ఏనుగు

పుష్యమి,కృత్తిక-మేక

శ్రవణం,పూర్వాషాడ-కోతి

ఉత్తరాషాడ,అభిజిత్-ముంగీస

రోహిణి,మృగశిర-పాము

జ్యేష్ఠ,అనూరాధ-లేడి

మూల,ఆరుద్ర-కుక్క

పునర్వసు,ఆశ్లేష-పిల్లి

మఘ,పుబ్బ-ఎలుక

విశాఖ,చిత్త-పులి

ఉత్తర,ఉత్తరాభాద్ర-ఆవు

పులి – ఆవు , పిల్లి – ఎలుక , లేడి – కుక్క , గుఱ్ఱము – దున్న , పాము – ముంగిస ,
సింహం – ఏనుగు , కోతి- మేక ఇవి విరోధ జంతువులు. వధూవరుల ఇరువురు నక్షత్రములు విరోధ జంతువులకు సంబంధించినవి కాకూడదు. ఒకే యోని అయితే సంపద, భిన్న యోనులైతే శతృత్వం లేకపోతే మద్యమం, రాశి కూటం, వశ్య కూటం అనుకూలమైతే యోనికూటం కుదరకున్నా దోషం లేదు.

5 గ్రహకూటమి :

గ్రహం మిత్రుడు శత్రువు సముడు

రవి చంద్రుడు, కుజుడు, గురువు

శని,శుక్రుడు

బుధుడు

చంద్రుడు

రవి, బుధుడు

శత్రువులులేరు

మిగిలినవారు సములు

కుజుడు

గురువు, చంద్రుడు, రవి

చంద్రుడు

కుజ, గురువు, శని

బుధుడు

శుక్రుడు, రవి

చంద్రుడు

కుజుడు, గురువు, శని

గురువు

రవి, కుజుడు, చంద్రుడు

బుధ, శుక్రుడు

శని

శుక్రుడు

శని, బుధుడు

రవి, చంద్రుడు

కుజుడు, గురువు

శని

శుక్రుడు, బుధుడు

రవి, చంద్రుడు, కుజుడు

గురువు

సూర్యుడు – శని , చంద్రుడు – బుధుడు, కుజుడు –బుధుడు, గురుడు –శుక్రుడు
ఈపైన తెలిపిన గ్రహములు ఒకరికొకరు పరస్పం శత్రువులు గ్రహ కూటమిని చూసేటప్పుడు పైవిధంగా ఉండకూడదు.

వధూవరుల రాశులకు అన్యోన్యమైత్రి ఉత్తమం, సమమైత్రి మద్యమం, పరస్పర సమత్వం కనిష్ఠం, పరస్పర శతృత్వం మృత్యుపదం, శతృత్వం కలహాప్రదం.

6 గణ కూటమి :-

స్వగుణం చోత్తమం ప్రీతి మధ్యమం దైవమానుషం

అధమం దేవడైత్యానాం మృత్యుర్మానుష రాక్షసం.

వధూవరుల జాతకం పరిశీలించేటప్పుడు వరుని యొక్క మనస్తత్వం నిర్ణయించటానికి అతని జన్మ నక్షత్రం ఆదారంగా నిర్ణయించవచ్చు. నక్షత్ర విభజన వారి మనస్తత్వ ప్రకారం విభజించబడింది. వధువు నక్షత్రంతో వరుని నక్షత్రం సరిపోతుందో లేదో చూడాలి. కానీ వరుని నక్షత్రంతో వధువు నక్షత్రాన్ని పోల్చకూడదు. నక్షత్రాలు 27 నక్షత్రాలను మూడు భాగాలుగా చేశారు.

దేవగణ నక్షత్రాలు:- అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి,హస్త, స్వాతి, అనురాధ, శ్రావణం, రేవతి

దేవగణ నక్షత్ర జాతకులు సాత్విక గుణం కలిగి ఉంటారు.శాంత స్వభావం కలిగి ఉంటారు. పరోపకారులై ఉంటారు. ఓర్పు, సహనం కలిగి ఉంటారు.

మనుష్యగణ నక్షత్రాలు:-భరణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ, ఉత్తర,పూర్వాషాడ, ఉత్తరాషాడ, పూర్వభాధ్ర, ఉత్తర భాధ్ర

మనుష్యగణ నక్షత్ర జాతకులు రజో గుణ లక్షణాలు కలిగి ఉంటారు.మంచి చెడు రెండు కలిగి ఉంటారు. భాదించటం, వేధించటం చేయరు. ఎవ్వరికీ హాని తలపెట్టరు.

రాక్షస గణ నక్షత్రాలు:-కృత్తిక, ఆశ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ,మూల, ధనిష్ట, శతబిషం

రాక్షసగణ నక్షత్ర జాతకులు తామస గుణ లక్షణాలు కలిగి ఉంటారు. అసూయ ద్వేషాలు కలిగి ఉంటారు. కఠినంగా మాట్లాడుతారు. మిక్కిలి స్వార్ధపరులు.

వధూవరులిద్దరిది ఒకే గణమైతే వారిద్దరి మధ్య సహకారం, ప్రేమానురాగాలు ఉంటాయి. వధువుది మనుష్య గణమై వరునిది రాక్షస గణమైతే వారిద్దరిమధ్య బొత్తిగా అవగాహన లేకపోవటం, ఆమెకు విలువ ఇవ్వక తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. వధువుది దైవగుణం వరునిది రాక్షసగణం అయితే సంసారంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది.భార్యాభర్తల మద్య పొందిక కుదరదు.
7. రాశి పొంతనము :

వధూవరుల జన్మ రాసులు ఒకదానికొకటి 6-8 అయితే మృత్యువు, 5-9 అయితే సంతాన హాని, 2-12 అయితే నిర్ధనత్వం.

ప్రీతి షడష్టకం:- మేషం-వృశ్చికం, మిధునం-మకరం, సింహం-మీనం, తుల-వృషభం, ధనస్సు-కర్కాటకం-కన్య.

మృత్యు షడష్టకం:-మేషం-కన్య, మిధునం-వృశ్చికం, సింహం-మకరం, తుల-మీనం, ధనస్సు-వృషభం, కుంభం-కర్కాటం.

శుభ ద్విర్ద్వాదశం:-మీనం-మేషం, వృషభం-మిధునం, కర్కాటకం-సింహం, కన్య-తుల, వృశ్చికం-ధనస్సు,మకరం-కుంభం.

అశుభ ద్విర్ద్వాదశం:-మేషం-వృషభం, మిధునం-కర్కాటం, సింహం-కన్య, తుల-వృశ్చికం, ధనస్సు-మకరం, కుంభం-మీనం.

శుభ నవపంచకాలు:-మేషం-సింహం, వృషభం-కన్య, మిధునం-తుల, సింహం-ధనస్సు, తుల-కుంభం, వృశ్చికం-మీనం, ధనస్సు-మేషం, మకరం-వృషభం.

అశుభ నవ పంచకాలు:- కర్కాటకం-వృశ్చికం, కన్య-మకరం, కుంభం-మిధునం, మీనం-కర్కాటకం.

ఏకరాశి:-సౌభాగ్యం,పుత్ర లాభాలు.

సమసప్తకం-ప్రీతి,ధన,భోగ,సుఖాలు.

తృతీయ లాభాలు:-ప్రీతి,ధనం,సౌఖ్యం.

చతుర్ధ దశమాలు:- ప్రీతి,ధనం,సౌఖ్యం.

8 నాడీపొంతనము : నాడీ దోషం ఎంతో విశిష్టమైనది. విడువరానిది.వదూవరులిద్దరిదీ ఏకనాడీ అయితే వారి వివాహం ఎట్టి పరిస్ధితులలోను చేసుకొనకూడదు. వదూవరులిద్దరిదీ ఏక శరీర తత్వము కాకూడదు అనేది నాడీ నిర్ణయం. వివాహమునకు తరువాత వ్యక్తి క్రొత్త జీవితములోనికి ప్రవేశించునని పెద్దలు అంటారు, పెద్దలు ఇట్లు చెప్పుట చాలా వరకు సరైనది కూడ. వివాహమునకు తరువాత ప్రారంభమగు క్రొత్త జీవితము సుఖమయముగా వుండుటకు కుండలి యొక్క లెక్కింపు చేసెదరు. కుండలి యొక్క లెక్కింపు క్రమములో అష్టకూటము ద్వారా విచారణ చేసెదరు. ఈ అష్ట కూటము (Ashtkoot)లో ఎనిమిదవ మరియు అంతిమ కూటము నాడీ కూటము. నాడీ కూటమి సరిగా లేకుంటే మిగతా ఏడు కూటాల గుణాల్ని కూడా నాశనం చేస్తుంది.

శరీరాన్ని మూడు భాగాలుగా విభజించారు.జ్యోతిష్య శాస్త్రము (Astrology)లో నాడులు మూడు ప్రకారములుగా వుండును, ఈ నాడుల పేర్లు ఆదినాడి, మధ్య నాడి, అంత్య నాడి.

1. ఆది నాడి: జేష్ట, మూల, ఆర్ద్ర, పునర్వసు, ఉత్తరఫల్గుని, హస్త, పూర్వభాద్ర,శతబిషం మరియు అశ్విని నక్షత్రములు ఆది లేదా ఆద్య నాడిలో వుండును. దీని వల్ల మేదోసంపత్తి, ప్రతీకార వాంఛ, ఆలోచనా విధానం, కోపం, ఆవేశం తెలుపుతుంది. వదూవరులిద్దరి నక్షత్రాలు ఉత్తర, శతభిషం, పూర్వాభాద్ర, పునర్వసు, ఆరుద్ర, మూల మొదలగు నక్షత్రాలకు ఆది నాడీ దోషం లేదు.

2. మద్య నాడి: పుష్యమి, మృగశిర, చిత్ర, అనురాధ, భరణి, దనిష్ట, పూర్వాషాడ, పూర్వఫల్గుణి మరియు ఉత్తరాభాద్ర నక్షత్రములు మధ్య నాడిలో వుండును. దీని వల్ల శరీరం మద్య భాగంలో ఉన్న రుగ్మతలు, సంతానం, ఊపిరితిత్తులు గుండెలో ఉన్న రుగ్మతలు తెలుపుతుంది. వదూవరులిద్దరి నక్షత్రాలు పూర్వాషాడ, అనురాధ, ధనిష్ఠ, పుష్యమి, చిత్త, పుబ్బ, మృగశిర, అను నక్షత్రాలకు మద్య నాడీ దోషం లేదు.

3. అంత్య నాడి: స్వాతి, విశాఖ, కృత్తిక, రోహిణి, ఆశ్లేష, మఘ, ఉత్తరాషాడ, శ్రవణ మరియు రేవతి నక్షత్రములు అంత్య నాడిలో వచ్చును. దీనివల్ల మర్మాయవాలు,కామవాంఛ,నపుంసకత్వం గురించి తెలియజేయును. వదూవరులిద్దరి నక్షత్రాలు కృత్తిక, విశాఖ, ఆశ్లేష, శ్రవణం, మఖ, ఉత్తరాషాడ, రోహిణి నక్షత్రాలకు అంత్య నాడీ దోషం లేదు.

జ్యోతిష్య శాస్త్ర ఆదారముగా వరుడు మరియు కన్య ఇరువురి నక్షత్రములు ఒకే నాడిలో వుండిన అప్పుడు ఈ దోషము కలుగును. అన్ని దోషముల కన్నా నాడీ దోషము అశుభ కరముగా చెప్పబడుతున్నది. ఎందుకంటే ఈ దోషము కలుగుట వలన 8 అంఖము యొక్క హాని కలుగును. ఈ దోషము కలుగుట వలన వివాహ ప్రసంసము చేయుట శుభకరముగా వుండదు.

మహర్షి వశిష్టు (Maharishi Vashisht) ని అనుసారముగా నాడీ దోషములో ఆది, మధ్య మరియు అంత్య నాడులకు వాతము (Mystique), పిత్తము (Bile) మరియు కఫము (Phlegm) అనే పేర్ల ద్వారా తెలిపెదరు.

నాడి మానవుని యొక్క శారీరక ఆరోగ్యమును కూడ ప్రభావితము చేయును (Nari also effect human health). ఈ దోషము కారణముగా వారి సంతానము మానసికముగా వికసితము లేని మరియు శారీరకముగా అనారోగ్యముతో వుండును (Naridosh also effect Mind of their Child and Health of their Child).

ఈ స్థితులలో నాడీ దోషము కలుగదు: (Naridosha will not affect you in this Conditions)

1. యది వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రములు (Birth Nakshatras) ఒకటిగా వుండిననూ ఇరువురి చరణములు ప్రదమ చరణమైన ఎడల నాడీ దోషము కలుగదు.

2. యది వరుడు - వదువు ఒకే రాశిగా వుండి (Bride and Groom have Same Rashi) మరియు జన్మ నక్షత్రము బిన్నమైన (Different Birth Nakshatras) ఎడల నాడీ దోషము నుండి వ్యక్తి ముక్తి పొందగలడు.

3. వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రము ఒకటిగా వుండి మరియు రాశులు వేరు వేరుగా (Different Rashi) వుండిన ఎడల నాడీ దోషము కలుగదు.

తప్పనిసరి అయితే నాడీ దోష పరిహారానికి మృత్యుంజయ జపం సువర్ణ దానం చేయాలి.
🙏🙏🙏🙏🙏

01/01/2022

గతాన్ని మర్చిపోదాం, కొత్త సమయాన్ని ప్రారంభిద్దాం. మనల్ని బాధపెట్టిన ఘటనలను, మనుషులను క్షమించేద్దాం. పాత బంధాలను కలుపుకుందాం. కొత్త స్నేహాలను స్వాగతిద్దాం.
*నూతనం.. ప్రారంభం* .. . *ఆరంభం* .. అనే కొత్త పదాలలోనే *ఉత్తేజం* దాగి ఉంటుంది. ఎన్నో *ఆశలు* , ఎన్నో *ఆశయాలు* , మరెన్నో *ఆకాంక్షలు* , లక్ష్యాలతో ముందుకు వస్తున్న *2022* అనే *నవ వసంతానికి ఆహ్వానం* పలుకుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు *
🌹నూతన సంవత్సర శుభాకాంక్షలు*🌹

తిరుపతి:     రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయండి, శ్రీ బాగ్ ఒడంబడిగను అమలుచేయండి**ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (ఆప్స్...
16/12/2021

తిరుపతి: రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయండి, శ్రీ బాగ్ ఒడంబడిగను అమలుచేయండి*

*ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (ఆప్స్) రౌండ్ టేబుల్ సమావేశం లో వక్తల పిలుపు*.

రాయలసీమ లో రాజ ధానిని ఏర్పాటుచేసి శ్రీ బాగ్ ఒడంబడిగను అమలుచేయాలని *రాయలసీమఅద్యయన సమితి అధ్య క్షులు భూమను సుబ్రమణ్యం రెడ్డి, ప్రో. క్రిష్ణా మోహన్ రెడ్డి, సినీయర్ జర్నలిస్ట్ రాఘ వ సర్మా* లు డిమాండ్ చేశారు.గురువారం ఉదయం తిరుపతి లో యూత్ హాస్టల్ నందు *ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (ఆప్స్)* ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న *"3 రాజధానులు మరియు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి*" అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేధావులు, వివిధ ప్రజా, విద్యార్థి, మహిళా సంఘాలు మరియు ప్రజలు స్వచ్చంధంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాయలసీమ అధ్యయన సమితి అధ్య క్షులు *భూమన్ సుబ్రమణ్యం రెడ్డి* మాట్లాడుతూ అమరావతి రైతులు వారికి రావలసిన నష్టపరిహారం గురించి గాని, భూ సమస్యల గురించిగాని అడగాలి గాని రాజధాని కావాలని అడగడం విడ్డూరం అన్నారు. అమరావతి రాజధాని గా ఉండాలని రాష్ట్రంలోని ఏ ప్రాంత ప్రజలు కూడా అడగలేదని, అది కేవలం ఆ ఒక్క ప్రాంతం వారేనని అన్నారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల అవసమా? అని, అదంతా వ్యాపారమే అని అన్నారు. అమరావతి ప్రాంత వాసులకు అసలు రాజధాని గురించి నిరసన చేసే హక్కే లేదన్నారు. శ్రీ బాగ్ ఒడంబడిగ మేరకు రాయలసీమ లో రాజ ధానిని ఏర్పాటు చేయాలని కోరారు. న
*ఎస్. వి. యునివర్సిటీ ప్రొపేసర్ క్రిష్ణ మోహన్ రెడ్డి* మాట్లాడుతూ కొత్త రాజధాని నిర్మాణాలు చరిత్రలో ఫెయిలయ్యాయని, ప్రస్తుతం ఉన్న స్థిరమైన నగరాలలోనే రాజధాని అభివృద్ధి చేయాలని తెలిపారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతులను నమ్మించి మొసం చేసిందన్నారు. రాయలసీమ ప్రజలు తమ మాధ్యమాల ద్వారా రాయలసీమ కు రాజధాని అనే అంశాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. రాయలసీమ కు రాజధాని ని వ్యతిరేకిస్తున్న నాయకులను, పార్టీలను మనం మద్దతివ్వకూడదని అన్నారు. *సీనియర్ జర్నలిస్ట్ రాఘవసర్మా* మాట్లాడుతూ రాజ ధాని కోసం నియమించిన ఏ కమిటి కూడ అమరావతిలో రాజ ధానిని పెట్టాలని కొరలేదని అన్నారు. *రాయలసీమ మేధ వుల వేదిక కన్వీనర్ పురుషోత్తం రెడ్డి* మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో టీడీపీ, జనసేన బీజేపీ పార్టీల వారు తిరుపతి లో మూడు రాజ ధనులకు మద్దతుగా ఏర్పాతు చేసిన బానర్ల ను చింపడం విడురమన్నారు.

ఈ కార్యక్రమానికి ఆప్స్ రాష్ట్ర అధికార ప్రతినిది రపీ హిం ధూ స్తానీ అధ్య క్షత వహించగా, ఆప్స్ జిల్లా అధ్య క్షులు షేక్ మహ్మద్ రపీ స్వాగతం పలికారు. ఈ కార్య క్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్, శంకరంబాడీ సాహిత్య అకాడమీ కన్వీనర్ డా"డి.మస్తానమ్మ, మాలమహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కుసుమ కుమారి, ముస్లిం నాయకులు గౌస్, ధన లక్ష్మీ, న్యాక్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరయ్య, మునుబోలు మధుసూధనరావు రాయలసీమ విమోచన సమితి రాజా, వెంకటేష్, సీనియర్ పాత్రికేయులు అదిమూలం శేఖర్ మరియు ఇతర నాయకులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

09/12/2021

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని అమరావతి ఉద్యమకారులను
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని అమరావతి ఉద్యమకారులను
అగ్గితోటి కడుగు ఈ అమరావతి ఉద్యమకారుల జీవచ్ఛవాన్ని
మారదు తెలుగుదేశం మారదు యెల్లో మీడియా
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు తెలుగుదేశం మారదు యెల్లో మీడియా..

07/12/2021

రాజదాని అంటే రాజదాని రైతులు కాదోయ్‌
రాజదాని అంటే
రాయలసీమ ప్రజల త్యాగం వాయ్...

రాష్ట్రమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
రాజదాని మాటలు కట్టిపెట్టోయ్‌
రాష్ట్ర ప్రజలకు గట్టిమేల్‌ తలపెట్టవోయి

అమరావతి భూముల్లో పాడి పంటలు పొంగిపొర్లె
దారిలో నువు పాటు పడవోయి

యీసురోమని రాజదాని రైతులుంటే
రాష్ట్రమేగతి బాగుఅగునోయ్‌
జల్దుకుని కళలన్ని నేర్చుకు
రాష్ట్రయి సరకులు నింపవోయ్‌

రాజదానిభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను రాష్ట్ర ప్రజలకుఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌
చెట్టపట్టాల్‌ పట్టుకొని
రాష్ట్రస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా మెలగవలెనోయ్‌

రాజధాని లాభం కొంత మానుకు
రాయలసీమ, ఉత్తరాంధ్రకు తోడుపడవోయ్‌
రాజదాని అంటే రాజదాని రైతులు కాదోయ్‌
రాజదాని అంటే
రాయలసీమ ప్రజల త్యాగం వాయ్..
ఓక రాజదాని వద్దు..
వికేంద్రీకరణ ముద్దు...

03/12/2021

కొడాలి కోత

ఓట్ల కోసం పెళ్ళాన్ని నడి రోడ్డు మీదకి తెచ్చిన బాబు

అక్టోబర్ 22 న వంశి ఏదో అంటే నవంబర్ 20 న బాబు ఏడవడం సానుభూతి కోసమే

వంశి 5 శాతం అల్లరి చేస్తే 95 శాతం అల్లరి చేసింది బాబే

నా కుటుంబాన్ని వంశి కుటుంబాన్ని సీఎం జగన్ కుటుంబాన్ని సోషల్ మీడియా లో నీచంగా తిట్టించింది బాబు కాదా?

హరి కృష్ణ బ్రతికుంటే మా సిస్టర్ ని రోడ్డు మీద పెడతావా అని కొట్టేవాడు బాబును

బాబు TRS బీజేపీ లలో సొంత కులస్థులని పంపి కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తుంటాడు

వ్యవస్థలలో తన మనుషులను పెట్టుకున్నాడు బాబు

ఆలా బాబు పంపినోడే TRS MLA అరికపూడి గాంధీ

కమ్మ కులానికి నేనే ప్రతినిధి అన్నట్టుగా యువతను రెచ్చకొడుతున్నాడు బాబు

ఏడిచాడు ,మర్డర్ కేసులో పారిపోతూ తునిలో పట్టబడ్డోడు కొల్లు రవీంద్ర

భార్య: ఏమండీ నా జుట్టు కొంచెం క‌త్తిరించుకోవాలా..?భ‌ర్త: క‌త్తిరించుకో..భార్య: ఎంత‌క‌ష్ట‌ప‌డి పెంచుకున్నానో..భ‌ర్త: అయిత...
20/11/2021

భార్య: ఏమండీ నా జుట్టు కొంచెం క‌త్తిరించుకోవాలా..?

భ‌ర్త: క‌త్తిరించుకో..

భార్య: ఎంత‌క‌ష్ట‌ప‌డి పెంచుకున్నానో..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: ఇప్పుడు అ‍ంద‌రూ క‌త్తిరించుకుంటున్నారు..అదే ఫ్యాష‌న్

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: నేను క‌త్తిరించుకున్నాక‌ ఫ్యాష‌న్ మారిపోతే..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: మా ఫ్రెండ్స్ అంద‌రూ అంటుంటారు..నాకు చిన్న‌ జ‌డ‌నే బాగుంటుంది అని..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: నాచిన్న‌ ఫేస్ కి చిన్న‌ జడ‌ బాగుండ‌దేమో అనిపిస్తుంది

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: చిన్న‌ జ‌డ‌యితే దువ్వుకోవ‌డం తేలిక‌.

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: పెద్ద‌ జ‌డ‌ని క‌ట్ చేస్తే పూలు పెట్టుకొవ‌డం కుద‌ర‌నిపిస్తూంది..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: ఒక‌సారి experment చేసి చూడాలా..?

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: మ‌ళ్ళీ వెంట్రుక‌లు పెర‌గాలంటే చాలా టైం ప‌ట్టుద్ది..

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

భార్య: లేక‌పోతే ఒక‌సారి క‌ట్ చేయించుకొని చూడాలా..?

భ‌ర్త: అయితే క‌త్తిరించుకో..

భార్య: ఒక‌వేళ‌ క‌ట్ చేయించుకున్నాక‌ బాలేక‌పోతే..?

భ‌ర్త: అయితే క‌త్తిరించుకోకు..

:

:
:
:
:
:
:
:
:
ప్ర‌స్తుతం ఆభ‌ర్త‌ ఎర్ర‌గ‌డ్డ‌ మాన‌సిక‌ వైద్య‌శాల‌లో చికిత్స‌ పొందుతున్నాడు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:
అయితే క‌త్తిరించుకో..
:
అయితే క‌త్తిరించుకోకు..
:

:

డాక్ట‌ర్ల‌కి ఇప్ప‌టికీ అంతుచిక్క‌డం లేదు దేన్ని క‌త్తిరించ‌మంటున్నాడు..
అంత‌లోనే వ‌ద్ద‌ని ఎందుకంటున్నాడ‌ని..
:
:
:
అత‌నిపై విదేశీ వైద్య‌బ్ర్రుందం యొక్క‌ ప‌రిశోధ‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి..

నీతి: మాతో పెట్టుకుంటే అంతే మరి 🤣🤣🤣🤣

20/11/2021

మనసులో మాటలు ......!!!

ఇద్దరు చేతులు
కలిస్తే మనం
నలుగురు చేతులు
వేస్తె బలం
పదిమంది చేతులు
జోడించి చూస్తే
బలవంతం
వంద చేతులు ఎత్తితే
ఉద్యమం
వేలమంది చేతులు
కలిపితే ప్రళయం
అంతకు మించి
కలిపితే మానవ యుద్ధం
యుద్ధాలు మానవ నాశనం
మనం కోరుకునే
మానవత్వం.....!!

రెండు ఇటుకలు పేడితే పొయ్యి
పది ఇటుకలు కలిపితే హోమగుండం
అంతకు మించిన
ఇటుకలు కలిపితే
తయారయ్యే సమాధి
వేల ఇటుకలు
కలిపితే గోపురం
సమాధికి దూరం
గోపురాలకు
దగ్గరయ్యే మనం

ఇటుకలు పెరిస్తే గోడ
గోడ వార
పేరుకునే చెత్త
పెరిగిపోయే దూరం

ఇరుకుగా ఉండే ఇంట్లో
ఉండాలంటే సర్దుకు పోవాలి

మొండిగా ఉండే మనసులో
ఇటుకలు లేని గోడలే
చేరిపోయే చెడు ఆలోచనలు
పెరిగిపోయే దూరం
మనుషుల్లో పెరిగే దూరం

మనసులో ఇష్టాలు లేకపోతే
ఇటుకలు లేని గోడలు

కరుడుగా మారిపోతే
మట్టి మనసు మారదు
దూరాలు దగ్గరకు
రావు దగ్గరగా వున్నా
పెంచే దురాలే..........✍️

Address


Alerts

Be the first to know and let us send you an email when Tirupati Talks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share